iDreamPost
android-app
ios-app

CAAను సమర్ధించిన పాకిస్తానీ క్రికెటర్.. వైరలవుతున్న ట్వీట్!

  • Published Mar 13, 2024 | 8:15 AM Updated Updated Mar 13, 2024 | 8:15 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను సమర్ధించాడు పాకిస్తాన్ క్రికెటర్. ట్విట్టర్ వేదికగా ఈ చట్టానికి తన మద్ధతు తెలియజేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం సీఏఏను సమర్ధించాడు పాకిస్తాన్ క్రికెటర్. ట్విట్టర్ వేదికగా ఈ చట్టానికి తన మద్ధతు తెలియజేశాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే..

CAAను సమర్ధించిన పాకిస్తానీ క్రికెటర్.. వైరలవుతున్న ట్వీట్!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన CAA చట్టం ద్వారా బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్, పాకిస్తాన్ రెఫ్యూజీలకు భారతదేశ పౌరసత్వం లభించనుంది. అయితే దీనిపై కొందరు సానుకూలంగా ఉండగా మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇక సీఏఏను సమర్ధిస్తూ.. సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ గా మారింది. మరి సీఏఏను మెచ్చుకున్న ఆ ప్లేయర్ ఎవరు? ట్వీట్ లో ఏం రాసుకొచ్చాడో ఇప్పుడు చూద్దాం.

భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సీఏఏకు పూర్తి మద్ధతు ప్రకటించాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్, స్పిన్నర్ డానిష్ కనేరియా. ఈ మేరకు సీఏఏను సమర్ధిస్తూ.. ట్విట్ చేశాడు.”భారత ప్రభుత్వం పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్ రెఫ్యూజీలకు భారత పౌరసత్వం పొందేందుకు సీఏఏ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఈ చట్టం ద్వారా పాకిస్తాన్ లో ఉన్న హిందువులు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోగలరు. ఈ చట్టం తీసుకొచ్చిన ప్రధాని నరేంద్ర మోదీకి, అమిత్ షాక్ ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

కాగా.. పాక్ క్రికెట్లో ఉన్న ఏకైక హిందువుగా డానిష్ కనేరియాకు గుర్తింపు ఉంది. కొన్ని దశాబ్దాల క్రితమే కనేరియా కుటుంబీకులు సూరత్ వదిలి పాక్ లోని కరాచీలో స్థిరపడ్డారు. గతంలో ఇతడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి. షోయబ్ అక్తర్ తనను మతం పేరుతో దూషించాడని సంచలన ఆరోపణలు చేశాడు. ఆ తర్వాత తాను సనాతన ధర్మాన్ని ఆచరిస్తానని, హిందువుగానే చనిపోతానని, తన మూలాలు మాత్రం ఎప్పటికీ సనాతన ధర్మమే అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. అయితే ఫిక్సింగ్ ఆరోపణలతో కనేరియాపై నిషేధం విధించారు. దీంతో తన కెరీర్ కు అర్దాంతరంగా పుల్ స్టాప్ పడింది. సీఏఏ చట్టాన్ని సమర్ధించిన కనేరియాపై హర్షం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. మరి సీఏఏ కు మద్ధతు పలికిన పాక్ క్రికెటర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: వీడియో: అర్జున్ టెండుల్కర్ స్టన్నింగ్ యార్కర్.. దెబ్బకు కింద పడ్డ బ్యాటర్!