Nidhan
Gyanendrakumar Kedarnath Pandey, Team India: క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కొందరు మాత్రమే స్టార్లుగా మారి గేమ్‌ను ఏలుతారు. అయితే ప్రతిభ ఉన్నా ఎదగలేక అనామకులుగా మిగిలిన పోయినవారూ ఉన్నారు. ఆ కోవలోకే వస్తాడీ భారత మాజీ క్రికెటర్.
Gyanendrakumar Kedarnath Pandey, Team India: క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కొందరు మాత్రమే స్టార్లుగా మారి గేమ్‌ను ఏలుతారు. అయితే ప్రతిభ ఉన్నా ఎదగలేక అనామకులుగా మిగిలిన పోయినవారూ ఉన్నారు. ఆ కోవలోకే వస్తాడీ భారత మాజీ క్రికెటర్.
Nidhan
క్రికెట్లో ఎంతో మంది ఆటగాళ్లు వస్తుంటారు, పోతుంటారు. కొందరు మాత్రమే స్టార్లుగా మారి గేమ్‌ను ఏలుతారు. మరికొందరు మాత్రం ఆ స్థాయికి చేరుకోలేకపోతారు. ప్రతిభ ఉన్నా ఎదగలేక అనామకులుగా మిగిలిన పోయినవారూ ఉన్నారు. అవకాశాలు లేక రేసులో వెనుకబడి మామూలు ఆటగాళ్లలా ఉండిపోయిన వారూ ఉన్నారు. అలాంటి ఓ క్రికెటర్ కన్నీటి కథే ఇది. రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ వంటి లెజెండ్స్‌తో కలసి భారత్ తరఫున ఆడిన ఓ ప్లేయర్.. ఆ తర్వాత కాలంలో మళ్లీ అవకాశాలు రాకపోవడంతో రిటైర్మెంట్ ప్రకటించాడు. టాప్ క్రికెటర్‌గా ఓ వెలుగు వెలగాల్సినోడు.. బ్యాంక్ ఉద్యోగిగా మిగిలిపోయాడు. అతడి గురించి మరింతగా తెలుసుకుందాం..
భారత మాజీ క్రికెటర్ జ్ఞానేంద్రకుమార్ కేదార్నాథ్ పాండే గురించి ఇప్పుడు అంతా డిస్కస్ చేస్తున్నారు. చాన్నాళ్లు వెలుగులోకి రాని ఈ ఆల్‌రౌండర్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన ఈ 52 ఏళ్ల మాజీ క్రికెటర్.. అప్పట్లో డొమెస్టిక్ క్రికెట్లో అదరగొట్టి భారత జట్టుకు ఎంపికయ్యాడు. మార్చి 24, 1999లో పెప్సీ కప్ ట్రై-సిరీస్‌లో భాగంగా ఇండియా-పాకిస్థాన్ మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు జ్ఞానేంద్రకుమార్. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన అతడు.. టీమిండియాలో సెటిల్ అవుతాడని అంతా అనుకున్నారు. ఆ టైమ్‌లో భారత జట్టులో ఆల్‌రౌండర్ల కొరత ఉండేది. దీంతో ఆ ప్లేస్‌ను జ్ఞానేంద్రకుమార్ భర్తీ చేస్తాడని అనుకుంటే.. రెండు వన్డేలకు అతడి కెరీర్ ముగిసింది. అదే పాకిస్థాన్‌తో మొహాలీలో వారం తర్వాత ఆడిన రెండో మ్యాచ్ అతడికి లాస్ట్ మ్యాచ్‌గా నిలిచింది. ఆ తర్వాత భారత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వడానికి ఎంత ప్రయత్నించినా కుదరలేదు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 117 మ్యాచుల్లో కలిపి 5348 పరుగులు చేసిన జ్ఞానేంద్రకుమార్.. 165 వికెట్లు పడగొట్టాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 82 మ్యాచుల్లో 1781 పరుగులు చేసి.. 89 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో మరిన్ని అవకాశాలు ఇస్తే అతడు తప్పక రాణించేవాడేమో. కానీ సెలెక్టర్లు మాత్రం అతడ్ని కరుణించలేదు. డొమెస్టిక్ క్రికెట్లో ఎంత రాణించినా, ఆరేళ్ల పాటు తీవ్రంగా ప్రయత్నాలు చేసినా అతడ్ని తిరిగి నేషనల్ టీమ్‌లోకి తీసుకోలేదు. దీంతో కెరీర్‌పై ఆశలు వదులుకున్నాడు జ్ఞానేంద్రకుమార్.
ప్రస్తుతం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఆర్ ఏజెంట్‌గా వర్క్ చేస్తున్నాడు జ్ఞానేంద్రకుమార్. అప్పటి బీసీసీఐ సెక్రెటరీ జయంత్ లేలే నుంచి సపోర్ట్ లేకపోవడంతో తాను ఇలా మిగిలిపోయానని.. లేకపోతే కెరీర్ వేరేలా ఉండేదని ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జ్ఞానేంద్రకుమార్ వాపోయాడు. ఇది చూసిన నెటిజన్స్.. అందరి కెరీర్ ఒకేలా ఉండదని, జ్ఞానేంద్రకుమార్కు బోర్డు నుంచి మద్దతు లభించి ఉంటే బాగుండేదని అంటున్నారు. ఓ మంచి క్రికెటర్ ఆటను అందరమూ మిస్ అయ్యామని చెబుతున్నారు. అతడి కన్నీటి కథ అందరికీ తెలియాలని కోరుకుంటున్నారు.