పాండ్యా, రాహుల్ కాదు.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే: మాజీ ఫీల్డింగ్ కోచ్

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. ఇక ఈ విషయంపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రోహిత్ తర్వాత కాబోయే కెప్టెన్ అతడే అంటూ ఓ స్టార్ ప్లేయర్ పేరు చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు సమాధానం దొరకలేదు. ఇక ఈ విషయంపై మాజీ క్రికెటర్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉన్నారు. తాజాగా భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ రోహిత్ తర్వాత కాబోయే కెప్టెన్ అతడే అంటూ ఓ స్టార్ ప్లేయర్ పేరు చెప్పుకొచ్చాడు.

రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్ ఎవరు? ఈ ప్రశ్న గత కొంత కాలంగా భారత క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ విషయంపై మాజీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తూనే వస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత టీమిండియా కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యార్, రిషబ్ పంత్ లలో ఎవరికో ఒకరికి పగ్గాలు అందిస్తారని చాలా మంది మాజీ క్రికెటర్లు చెప్పుకొచ్చారు. అయితే వీరు ఎవరూ టీమిండియా కెప్టెన్ కారని, ఆ ప్లేయరే భవిష్యత్ కెప్టెన్ అని చెప్పుకొచ్చాడు భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్.

హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్లకు కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అన్న ప్రశ్నకు ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి సమాధానమైతే ఇవ్వలేదు. ఇక ఈ విషయంపై మాజీ క్రికెటర్లు కొందరి పేర్లను ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. రోహిత్ శర్మ తర్వాత మూడు ఫార్మాట్స్ లో టీమిండియాకు కెప్టెన్ అయ్యే అర్హతలు శుబ్ మన్ గిల్ లో ఉన్నాయని చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా గిల్ పై ప్రశంసలు కురిపించాడు.

“శుబ్ మన్ గిల్, యశస్వీ జైస్వాల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్ లో ఉన్నారు. అంతకు ముందు ఇంగ్లండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్ లో కూడా ఈ జోడీ అదరగొట్టింది. వన్డేల్లో కూడా బాగా ఆడుతున్నారు. మరీ ముఖ్యంగా గిల్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గిల్ మూడు ఫార్మాట్స్ లో సత్తాచాటగలడు. అతడు రోహిత్ శర్మ దగ్గర కెప్టెన్సీ పాఠాలు నేర్చుకుంటున్నాడు. శుబ్ మన్ లో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. జింబాబ్వే టూర్ లో అది రుజువైంది కూడా. ఇక వచ్చే వరల్డ్ కప్ తర్వాత టీమిండియాకు మూడు ఫార్మాట్స్ లో గిల్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు” అంటూ పేర్కొన్నాడు టీమిండియా మాజీ ఫీల్డింగ్ కోచ్ శ్రీధర్. చాలా మంది హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ పేర్లు చెబుతున్నప్పటికీ.. వారికి ఆ అవకాశం లేదని ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు మాజీ ఫీల్డింగ్ కోచ్. మరి శుబ్ మన్ గిల్ టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ అవుతాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments