Somesekhar
ఆ ఇద్దరు అలానే ఆడితే.. టీమిండియాను 5-0తో వైట్ వాష్ చేస్తాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్.
ఆ ఇద్దరు అలానే ఆడితే.. టీమిండియాను 5-0తో వైట్ వాష్ చేస్తాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్.
Somesekhar
5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కోసం టీమిండియా గడ్డపై అడుగుపెట్టింది ఇంగ్లాండ్. ఇక అందులో భాగంగా జరిగిన తొలి టెస్ట్ లో విజయం సాధించి.. ఘనంగా బోణీ కొట్టింది పర్యటక జట్టు. తొలి మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత ఆటగాళ్లు సమష్టిగా విఫలం అయ్యారు. బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో దారుణంగా విఫలం అయ్యారు. దాంతో 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లీష్ టీమ్ విజయం సాధించింది. ఇక విమర్శలు ఎదుర్కొవడం టీమిండియా ప్లేయర్ల వంతు అయ్యింది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ టీమిండియాను 5-0తో వైట్ వాష్ చేస్తాం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్ట్ లో టీమిండియా పతనాన్ని శాసించింది ఇద్దరే ఇద్దరు. ఆ ఇద్దరు ఎవరంటే? భారీ శతకంతో చెలరేగిన ఓలీ పోప్, డెబ్యూ స్నిన్నర్ టామ్ హార్ట్లీ. ఈ ఇద్దరు ఇంగ్లాండ్ ఆటగాళ్లు భారత పరాజయానికి ప్రధాన కారణం. ఇదిలా ఉండగా.. టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్. ప్రముఖ న్యూస్ ఛానల్ ఏఎన్ఐతో మాట్లాడుతూ..”ఒక వేళ ఓలీ పోప్, టామ్ హార్ట్లీ తమ ఫామ్ ను ఇలాగే కొనసాగిస్తే.. ఇండియాను 5-0తె వైట్ వాష్ చేస్తాం” అంటూ పనేసర్ వ్యాఖ్యానించాడు. అయితే ఈ కామెంట్స్ పై టీమిండియా ఫ్యాన్స్ తో పాటుగా నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మీరు గెలిచింది ఒక్క మ్యాచే అని గుర్తుంచుకో పనేసర్, పగటి కలలు కనకు అంటూ కౌంటర్లు ఇస్తున్నారు. పైగా జట్టులోకి విరాట్ కోహ్లీ వస్తున్నాడు అంటూ మరికొందరు రాసుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. రెండో టెస్ట్ కు ముందు టీమిండియాకు డబుల్ షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తో పాటుగా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాలు గాయం కారణంగా రెండో టెస్ట్ కు దూరం అయ్యారు. దీంతో వీరి స్థానాలను భర్తీ చేసేందుకు, ఎప్పటి నుంచో టీమిండియాలో చోటు కోసం నిరీక్షిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ తో పాటుగా వాషింగ్టన్ సుందర్ కొత్త ప్లేయర్ సౌరభ్ కుమార్ లకు పిలుపునిచ్చింది. ప్రస్తుతం సర్ఫరాజ్ ఖాన్ భీకర ఫామ్ లో ఉన్నాడు. రంజీల్లో దుమ్మురేపే రికార్డులతో ఇంగ్లాండ్ కు దడ పుట్టిస్తున్నాడు. ఇక రెండో టెస్ట్ విశాఖపట్నం వేదికగా ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ లో గెలిచి, సిరీస్ ను సమం చేయాలని భారత్ భావిస్తోంది. మరి ఇండియాను వైట్ వాష్ చేస్తామని పగటి కలలు కంటూ కామెంట్స్ చేసిన మాంటి పనేసర్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను తెలియజేయండి.
Monty Panesar to ANI, “If Ollie Pope and Tom Hartley continue to play like this it will be a whitewash, it will be 5-0 for England.”
📷 AFP / Getty Images pic.twitter.com/rEQVUabvoF
— CricketGully (@thecricketgully) January 30, 2024