SNP
SNP
ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్సీలో యంగ్ టీమిండియా, ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఈ రోజు తొలి మ్యాచ్ జరగనుంది. పసికూన ఐర్లాండ్‌తో మ్యాచ్ కావడంతో.. చాలా మంది స్టార్ క్రికెటర్లకు ఈ సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చారు. దీంతో జట్టు మొత్తం యంగ్ బ్లడ్‌తో నిండిపోయింది. బుమ్రా, సంజు శాంసన్ తప్ప మిగతా వాళ్లంత కొత్తవాళ్లే. కొంతమంది ఇంకా డెబ్యూ చేయని క్రికెటర్లు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ అతుల్ వాసన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
టీమిండియాలోకి వచ్చేయడం చాలా సులువైపోయిందని, చాలా మంది యువ క్రికెటర్లు ఎంత ఈజీగా టీమిండియా క్యాప్ అందుకుంటున్నారంటూ అతుల్ వ్యాఖ్యానించారు. జట్టులో చాలా మంది యువ క్రికెటర్లకు భారీగా అవకాశాలు దక్కుతున్నాయి. దేశవాళీ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లో సత్తా చాటిన వారందరికీ చాలా త్వరగానే టీమిండియాలో స్థానం దక్కుతుంది. అయితే.. యువ క్రికెటర్లకు అవకాశాలు ఇవ్వడంతో పాటు జట్టులో స్థిరంగా రాణిస్తున్న ఆటగాళ్లను, యువ క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చే పేరుతో పక్కన పెట్టడం సరికాదని అతుల్ అభిప్రాయపడ్డారు.
అయితే.. భారత జట్టులో యువ క్రికెటర్లకు చాలా వేగంగా, భారీగా అవకాశాలు లభిస్తున్న మాట వాస్తవం. కానీ, అందుకు ప్రధాన కారణం జట్టులోని స్టార్, సీనియర్ ఆటగాళ్లపై పని ఒత్తిడిని తగ్గిస్తూ.. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా వారికి విశ్రాంతి ఇవ్వడంతో యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. మేజర్ టోర్నీలకు ముందు చిన్న దేశాలతో సిరీస్‌లకు కీలక ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వడంతో వాళ్లు గాయాల పాలు కాకుండా వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలకు ఫ్రెష్‌గా అందుబాటులో ఉంటారు. యువ క్రికెటర్లకు అవకాశాలతో పాటు బుమ్రా గురించి మాట్లాడిన అతుల్.. బుమ్రా వెన్నుగాయం నుంచి కోలుకుని తిరిగి టీమిండియాలో వచ్చాడని, అయితే గాయం మళ్లీ తిరగబెడితే.. అతను జట్టుకు మళ్లీ దూరం అవుతాడని పేర్కొన్నాడు. మరి అతుల్ యువ క్రికెటర్లకు టీమిండియాలో సులువుగా అవకాశాలు లభిస్తున్నాయని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
🚨 A look at #TeamIndia‘s Playing XI 🔽
Follow the match ▶️ https://t.co/cv6nsnJY3m#IREvIND pic.twitter.com/mFGjP99XRb
— BCCI (@BCCI) August 18, 2023
ఇదీ చదవండి: 61 ఏళ్ల వయసులో ఇంగ్లండ్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్! ఎవరతనూ? ఏంటీ కథ?