iDreamPost
android-app
ios-app

David Warner: వార్నర్ ‘గ్రేట్’ ప్లేయర్ కాదు.. దానికి ఆ ముగ్గురే అర్హులు: ఆసీస్ మాజీ కోచ్

  • Published Jan 09, 2024 | 7:04 PM Updated Updated Jan 09, 2024 | 7:04 PM

డేవిడ్ వార్నర్ 'గ్రేట్' క్రికెటర్ కాదని, ఆసీస్ గ్రేట్ ప్లేయర్లు అంటే నాకు ఆ ముగ్గురే గుర్తుకువస్తారని ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

డేవిడ్ వార్నర్ 'గ్రేట్' క్రికెటర్ కాదని, ఆసీస్ గ్రేట్ ప్లేయర్లు అంటే నాకు ఆ ముగ్గురే గుర్తుకువస్తారని ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

David Warner: వార్నర్ ‘గ్రేట్’ ప్లేయర్ కాదు.. దానికి ఆ ముగ్గురే అర్హులు: ఆసీస్ మాజీ కోచ్

డేవిడ్ వార్నర్.. పాకిస్తాన్ తో జరిగిన టెస్ట్ సిరీస్ అనంతరం టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఇక ఇప్పటికే వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్.. కేవలం టీ20లకు మాత్రమే అందుబాటులో ఉండనున్నాడు. అయితే క్రికెట్ నుంచి పూర్తిగా తప్పుకున్నాక, తన సెకండ్ ఇన్నింగ్స్ లో కొత్త అవతారంలో కనిపిస్తానని వార్నర్ వెల్లడించాడు. కోచ్ గా సేవలు అందించడం తన డ్రీమ్ అంటూ చెప్పుకొచ్చాడు వార్నర్. కాగా.. తన కెరీర్ లో ఎన్నో అద్భుత ఇన్నింగ్స్ లు ఆడి జట్టుకు చిరస్మరణీయ విజయాలు అందించాడు. దీంతో అతడు ఆసీస్ గ్రేట్ ప్లేయర్ల సరసన చేరాడని అందరూ భావించారు. కానీ వార్నర్ ‘గ్రేట్’ క్రికెటర్ కాదని, ఆసీస్ గ్రేట్ ప్లేయర్లు అంటే నాకు ఆ ముగ్గురే గుర్తుకువస్తారని ఆస్ట్రేలియా మాజీ కోచ్ జాన్ బుకానన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం బుకానన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

డేవిడ్ వార్నర్.. ఆస్ట్రేలియా టీమ్ కు ఎన్నో తిరుగులేని విజయాలను అందించాడు. దాంతో పాటుగా మరెన్నో రికార్డులను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా టెస్ట్ లకు వీడ్కోలు పలికాడు వార్నర్. పాకిస్తాన్ తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ తర్వాత రెడ్ బాల్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు ఈ స్టార్ బ్యాటర్. తనదైన బ్యాటింగ్ తో ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర ఓపెనర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు వార్నర్. అయితే ఇంతటి ఘనతలను సొంతం చేసుకున్న డేవిడ్ భాయ్ గురించి ఆ జట్టు మాజీ కోచ్ జాన్ బుకానన్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.

warner is not a great

తాజాగా ఫాక్స్ న్యూస్ తో మాట్లాడిన ఈ ఆసీస్ మాజీ కోచ్ కు వార్నర్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. డేవిడ్ వార్నర్ ను ‘గ్రేట్’ అనొచ్చా? అన్న ప్రశ్నకు ఆసీస్ మాజీ కోచ్ జాన్ బుకానన్ సమాధానం ఇస్తూ..” వార్నర్ మెరుగైన బ్యాటరే.. కానీ గొప్ప ఆటగాడు కాదు. ఆసీస్ గ్రేట్ ప్లేయర్ల లిస్ట్ లో అతడికి చోటు దక్కే అవకాశం లేదు. గ్రేట్ ప్లేయర్లు అనగానే నాకు ముందుగా డాన్ బ్రాడ్ మన్, గ్లెన్ మెగ్రాత్, షేన్ వార్న్ లాంటి వాళ్లే గుర్తుకువస్తారు. నా దృష్టిలో వాళ్ల ముగ్గురే గ్రేట్ ప్లేయర్లు. చాలా మంది ఆసీస్ ఆటగాళ్లు వీరికి దగ్గరగా వచ్చినా.. గ్రేట్ కేటగిరీలో ప్లేస్ సంపాదించుకోలేకపోయారు. వార్నర్ కూడా అంతే” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు బుకానన్. ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ కావడంతో.. వార్నర్ ఫ్యాన్స్ బుకానన్ పై ఫైర్ అవుతున్నారు. మీకు గ్రేట్ కాకపోవచ్చు.. కానీ మాకు మాత్రం దిగ్గజమే అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. మరి డేవిడ్ వార్నర్ పై ఆసీస్ మాజీ కోచ్ బుకానన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.