టీమిండియాలో ఎంతో మంది ప్రపంచ స్థాయి బౌలర్లు ఉన్నారు. కానీ అందులో ఓ బౌలర్ మాత్రం స్పీడ్ గన్ కంటే వేగంగా బంతులు సంధిస్తాడని ప్రశంసల్లో ముంచెత్తాడు ఆసీస్ స్టార్ బౌలర్, మాజీ ఆటగాడు జాసన్ గిలెస్పీ. ఇలాంటి ఫాస్ట్ బౌలర్ జట్టులో ఉంటే టీమ్ కు తిరుగుండదు అంటూ కితాబిచ్చాడు గిలెస్పీ. అలాంటి బౌలర్ జట్టుకు దూరం కావడం ఏ టీమ్ కైనా నష్టమే అని చెప్పుకొచ్చాడు. వచ్చే ప్రపంచ కప్ లో అతడు జట్టులో కీలక పాత్ర వహిస్తాడని ఆశా భావం వ్యక్తం చేశాడు ఈ ఆసీస్ మాజీ పేసర్. మరి స్పీడ్ గన్ కంటే వేగంగా బంతులు సంధించే ఆ టీమిండియా బౌలర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా స్టార్ పేసర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు ఆసీస్ మాజీ ఆటగాడు, స్టార్ పేసర్ జాసన్ గిలెస్పీ. అతడి బంతులు స్పీడ్ గన్ కంటే వేగంగా వస్తాయని కితాబిచ్చాడు. ఇంతలా ఆసీస్ స్టార్ ఆకాశానికి ఎత్తిన ఆ టీమిండియా బౌలర్ ఎవరో తెలుసా? యార్కర్ల కింగ్ జస్ప్రీత్ బుమ్రా. వెన్నునొప్పి కారణంగా గతేడాది టీ20 ప్రపంచ కప్ నుంచి ఈ ఏడాది డబ్ల్యూటీసీ ఫైనల్ వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు బుమ్రా. సుమారు ఏడాది కాలంగా అంతర్జాతీయ క్రికెట్ కు దూరం అయ్యాడు బుమ్రా. వెన్నునొప్పి తిరగబెట్టడంతో.. ప్రస్తుతం ఎన్సీఏలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. తాజాగా అతడు బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే బుమ్రాను ప్రశంసల్లో ముంచెత్తాడు ఆసీస్ స్టార్ బౌలర్, మాజీ ఆటగాడు జాసన్ గిలెస్పీ. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన గిలెస్పీ బుమ్రాపై ప్రశంసల వర్షం కురిపించాడు. గిలెస్పీ మాట్లాడుతూ..” వరల్డ్ లోనే బెస్ట్ బౌలర్ బుమ్రా. అతడు జట్టులో లేకపోవడం టీమిండియాకు పెద్ద దెబ్బ. బౌలింగ్ లో ప్రత్యేక శైలి కలిగిన బుమ్రా.. స్పీడ్ గన్ కంటే వేగంగా బంతులు సంధిస్తాడు. అతడి బౌలింగ్ ను ఎదుర్కొవడం చాలా కష్టం. ఈ మాట నేను అంటున్నది కాదు.. ప్రపంచ స్టార్ బ్యాటర్ల నుంచి సేకరించిన సమాధానాలు తెలుసుకునే చెబుతున్నా. గన్ నుంచి బుల్లెట్ వచ్చే వేగం కంటే అతడి బంతి వేగంగా వస్తుందని వారు అభిప్రాయ పడ్డారు. త్వరలోనే అతడు కోలుకుని పూర్తిస్థాయిలో జట్టులోకి వస్తాడని ఆశిస్తున్నా” అని జాసన్ గిలెస్పీ తెలిపాడు. మరి బుమ్రా స్పీడ్ గన్ కంటే వేగంగా బంతులు సంధిస్తాడన్న గిలెస్పీ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదికూడా చదవండి: భారత కెప్టెన్‌కు అవమానం! విరుచుకుపడుతున్న క్రికెట్ ఫ్యాన్స్