క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం.. ఫుట్ బాల్ దిగ్గజం కన్నుమూత!

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు దశాబ్దాలకు పైగా ఫుట్ బాల్ రంగానికి విశిష్ట సేవలందించిన దిగ్గజం కన్నుమూశాడు. ఆ వివరాలు..

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు దశాబ్దాలకు పైగా ఫుట్ బాల్ రంగానికి విశిష్ట సేవలందించిన దిగ్గజం కన్నుమూశాడు. ఆ వివరాలు..

క్రీడా ప్రపంచంలో తీవ్ర విషాదం నెలకొంది. రెండు దశాబ్దలకు పైగా ప్రపంచ ఫుట్ బాల్ రంగానికి విశిష్టమైన సేవలు అందించిన దిగ్గజ ప్లేయర్ కన్నుమూశాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు.. చికిత్స పొందుతూ శనివారం తుది శ్వాస విడిచాడు. దాంతో ఫుట్ బాల్ ప్రేక్షకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ ఫుట్ బాల్ చరిత్రలో ఈ ఆటగాడు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఫుట్ బాల్ దిగ్గజం, ఆర్సెనల్ ఎఫ్ సీ లెజెండ్ కెవిన్ కాంప్ బెల్(54) మరణించాడు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడు.. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ శనివారం తుదిశ్వాస విడిచాడు. ఇక ఈ దిగ్గజం మరణవార్తను ఆర్సెనల్ ఎఫ్ సీ క్లబ్ సోషల్ మీడియా వేదికగా ధృవీకరించింది. “మా క్లబ్ మాజీ స్ట్రైకర్, దిగ్గజం కెవిన్ కాంప్ బెల్ అనారోగ్యం కారణంగా మరణించాడు. అతడి మరణవార్త మామ్మల్ని దిగ్బ్రాంతికి గురిచేసింది. క్లబ్ లో ప్రతీ ఒక్కరు అతడిని గౌరవించేవారం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబానికి ఆ దేవుడు అండగా నిలవాలని, అదే విధంగా కాంప్ బెల్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాం” అని ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. ఇక కాంప్ బెల్ కెరీర్ విషయానికి వస్తే.. 1988లో అర్సెనల్ క్లబ్ తరఫున తన కెరీర్ ప్రారంభించి.. రెండు దశాబ్దాలకు పైగా వరల్డ్ ఫుట్ బాల్ కు సేవలందించాడు. అర్సెనల్ తరఫున యూత్ కప్ గెలుచుకున్నాడు. ఇక తన కెరీర్ లో ఓవరాల్ గా 148 గోల్స్ చేశాడు.

Show comments