iDreamPost
android-app
ios-app

వీడియో: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ అంతా ఫిక్సింగేనా? ఇదే సాక్ష్యం!

  • Published Mar 01, 2024 | 5:07 PM Updated Updated Mar 01, 2024 | 5:07 PM

PSL 2024 Fixing: ఐపీఎల్‌కు పోటీగా వచ్చిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తున్నాయి. గురువారం జరిగిన ఒక మ్యాచ్‌లో చోటుచేసుకున్న సంఘటనే అందుకు కారణం. మరి ఆ ఘటన ఏంటో? ఎందుకు ఫిక్సింగ్‌ అంటున్నారో ఇప్పుడు చూద్దాం..

PSL 2024 Fixing: ఐపీఎల్‌కు పోటీగా వచ్చిన పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌పై ఫిక్సింగ్‌ ఆరోపణలు వస్తున్నాయి. గురువారం జరిగిన ఒక మ్యాచ్‌లో చోటుచేసుకున్న సంఘటనే అందుకు కారణం. మరి ఆ ఘటన ఏంటో? ఎందుకు ఫిక్సింగ్‌ అంటున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 01, 2024 | 5:07 PMUpdated Mar 01, 2024 | 5:07 PM
వీడియో: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ అంతా ఫిక్సింగేనా? ఇదే సాక్ష్యం!

ఐపీఎల్‌ను ప్రపంచ వ్యాప్తంగా అనేక టీ20 లీగ్స్‌ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. కానీ, ఏ లీగ్‌ కూడా ఐపీఎల్‌ అంత సక్సెస్‌ కాలేదు. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌, పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌, ది హండ్రెడ్‌, సౌతాఫ్రికా టీ20 లీగ్‌, ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20 ఇలా చాలా లీగ్స్‌ ప్రారంభం అయ్యాయి. కానీ, వీటన్నింటిలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ వేరే. ఐపీఎల్‌లో ఆటగాళ్లపై కోట్ల వర్షం కురుస్తుంది. పైగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ కూడా ఐపీఎల్‌నే ఎక్కువగా చూస్తారు. ఎలాగైనా ఐపీఎల్‌ను బీట్‌ చేయాలని పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ ఎక్కువగా ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే మొత్తం టోర్నీని ఫిక్సింగ్‌తో నడిపిస్తోందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా ఇప్పటికే పీఎస్‌ఎల్‌పై పలు విమర్శలు ఉన్నాయి. వాటికి బలం చేకూర్చేలా తాజాగా ఒక సంఘటన జరిగింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

సాధారణంగా మ్యాచ్‌లు ఎప్పుడు ఆసక్తికరంగా మారుతాయంటే.. మ్యాచ్‌లు వన్‌సైడ్‌ కాకుండా చివరి బాల్‌ వరకు ఉత్కంఠ భరితంగా సాగితే.. క్రికెట్‌ అభిమానులు థ్రిల్‌ ఫీల్‌ అవుతారు. నరాలు తెగే ఉత్కంఠ మధ్య సాగే మ్యాచ్‌లకే ప్రేక్షకాధారణ ఉంటుంది. ఇదే పాయింట్‌ను పట్టుకున్న పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ నిర్వహకులు మ్యాచ్‌లను స్క్రిప్టెడ్‌గా చివరి వరకు తీసుకెళ్తూ.. ఊహించని ఎండ్‌ ఇస్తున్నారంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అందుకు ఈ ఘటన ఉదాహరణ అంటూ పేర్కొంటున్నారు. పీఎస్‌ఎల్‌ 2024 సీజన్‌లో భాగంగా గురువారం కరాచీ కింగ్స్‌, క్వాట్టా గ్లాడియేటర్స్‌ మధ్య ఒక మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఓ ఊహించని ఘటన.. క్రికెట్‌ అభిమానులను షాక్‌కు గురిచేసింది. అప్పటికే పరుగులు భారీగా వెళ్తున్నా కూడా బౌలర్‌ ఏ మాత్రం ఆలోచించకుండా ప్రత్యర్థి జట్టుకు ఫ్రీగా బౌండరీ ఇచ్చేశాడు.

పైగా తానోదే ఫ్రస్టేషన్‌లో అలా చేసినట్లు ఫీలైపోయాడు. కరాచీ టీమ్‌ బ్యాటింగ్‌ చేస్తుండగా.. ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌లో క్వాట్టా గ్లాడియేటర్స్‌ బౌలర్‌ సోహైల్‌ ఖాన్‌ బౌలింగ్‌లో సిఫర్ట్‌ బాల్‌ను డిఫెన్స్‌ ఆడాడు. ఆ బాల్‌ను ఫాలోత్రూలో అందుకున్న సోహైల్‌.. బ్యాటర్‌ వైపు త్రో వేస్తున్నట్లుగా వేగంగా కిందికేసి కొట్టాడు. అది కాస్త ఓవర్‌ త్రూ రూపంలో బౌండరీకి వెళ్లింది. ఈ సీన్‌ చూసిన ఎవరికైనా.. అసలు ఆ బౌలర్‌ అలా ఎందుకు బాల్‌ విసిరాల్సి వచ్చింది? విసిరితే విసిరాడు.. కానీ స్టప్‌ ఎందుకు వేశాడో ఎవరికి అర్థం కావడం లేదు. ఇదే విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యర్థి జట్టుకు ఉచితంగా పరుగులు ఇస్తూ.. గేమ్‌లో హైప్‌ క్రియేట్‌ చేయడానికి కారణమని, ఇది పక్కా ఫిక్సింగ్‌ అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్‌ మీడియాలో కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.