టీ20 WC టీమ్‌లో చోటు దక్కకపోవడంపై తొలిసారి స్పందించిన రింకూ సింగ్‌! ఏమన్నాడంటే..?

Rinku Singh, T20 World Cup 2024, IPL 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం టీమిండియాలో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై రింకూనే తొలిసారి స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rinku Singh, T20 World Cup 2024, IPL 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 కోసం టీమిండియాలో రింకూ సింగ్‌కు చోటు దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై రింకూనే తొలిసారి స్పందించాడు. అతను ఏమన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్‌ తర్వాత.. కొన్ని రోజుల్లోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. వెస్టిండీస్‌, అమెరికా వేదికగా జూన్‌ 2 నుంచి ఈ మెగా టోర్నీ మొదలుకానుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటికే భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో 15 మందితో కూడిన స్క్వౌడ్‌ను ఎంపిక చేశారు. వీరితో పాటు మరో నలుగురు ప్లేయర్లను స్టాండ్‌బైగా సెలెక్ట్‌ చేశారు. ఈ ఐపీఎల్‌కి ముందు నుంచి రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ కోసం రింకూ సింగ్‌ ఎంపిక అవుతాడని, అతనికి కచ్చితంగా టీమిండియాలో చోటు దక్కుతుందని అంతా భావించారు. కానీ, రింకూ సింగ్‌కు భారత సెలెక్టర్లు మొండిచేయి చూపించారు. అతన్ని 15 మందితో కూడిన స్క్వౌడ్‌లో ఎంపిక చేయలేదు. స్టాండ్‌బైగా మాత్రమే ఎంపికయ్యాడు.

రింకూ సింగ్‌కు టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టీమ్‌లో చోటు దక్కకపోవడంపై క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. అద్భుతమైన ఫినిషర్‌ను టీమ్‌లోకి తీసుకోకుండా.. సెలెక్టర్లు తప్పు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. తనకు టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై రింకూ సింగ్‌ తొలిసారి స్పందించాడు. తాను ప్రతికూల పరిస్థితుల్లో కూడా పాజిటివ్‌గానే ఉంటానని రింకూ తెలిపాడు. మన టైమ్‌ బాగాలేదంటూ.. కుంగిపోయే వ్యక్తిని తాను కాదంటూ స్పష్టం చేశాడు. సాకులు వెతుక్కునే వాళ్లు.. మన టైమ్‌ బాలేదని చెబుతూ ఉంటారని, నిజానికి మన అవయవాలు అన్ని బాగుంటే.. మన టైమ్‌ బాగున్నట్లే అంటూ వేదాంతం మాట్లాడాడు. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని, ప్రస్తుతం తన రోజులు బాగానే గడుస్తున్నాయంటూ పేర్కొన్నాడు రింకూ సింగ్‌.

వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కకపోయినా.. స్టాండ్‌బైగా ఉన్న తనకు టీ20 వరల్డ్‌ కప్‌ను ముద్దాడే అవకాశం తప్పకుండా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. క్రికెటర్‌గా జూనియర్‌ లెవెల్‌లో ఎన్నో ట్రోఫీలు గెలిచినట్లు రింకూ తెలిపాడే. ఇక ఐపీఎల్‌ విషయానికి వస్తే.. ఈ సీజన్‌లో రింకూ సింగ్‌కు పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా.. రింకూకు పెద్దగా అవకాశం కూడా రాలేదు. కేకేఆర్‌ టాపార్డర్‌ అద్భుతంగా రాణిస్తుండటంతో.. చివర్లో రింకూ అవసరం వారికి పెద్దగా రావడం లేదు. అయితే.. కేకేఆర్‌ ఈ రోజు(మే 21 మంగళవారం) ఎస్‌ఆర్‌హెచ్‌తో తొలి క్వాలిఫైయర్‌లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలిస్తే.. వారు నేరుగా ఫైనల్స్‌కు చేరుకుంటారు. మరి టీ20 వరల్డ్‌ కప్‌ టీమ్‌లో చోటు దక్కకపోవడంపై తానేమి బాధపడటం లేదని రింకూ సింగ్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments