iDreamPost

ఆసియా కప్.. శ్రీలంకపై భారత్ చెత్త రికార్డు! ఇదే తొలిసారి

  • Author Soma Sekhar Published - 08:45 PM, Tue - 12 September 23
  • Author Soma Sekhar Published - 08:45 PM, Tue - 12 September 23
ఆసియా కప్.. శ్రీలంకపై భారత్ చెత్త రికార్డు! ఇదే తొలిసారి

ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లో టీమిండియా-శ్రీలంక జట్లు తలపడుతున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. నిన్న పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన టాపార్డర్.. నేడు లంక స్పిన్నర్ ధాటికి కాకావికలం అయ్యింది. లంక నయా స్పిన్ సంచలనం దునిత్ వెల్లలాగే 5 వికెట్ల తో టీమిండియాను దెబ్బకొడితే.. అతడికి తోడు చరిత అసలంక 4 వికెట్లతో రాణించాడు. ఇక ఈ మ్యాచ్ లో తీసిన 10 వికెట్లు లంక స్పిన్నర్లు కూల్చడం గమనార్హం. దీంతో టీమిండియా ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో స్పిన్ ను అత్యంత సమర్థవంతంగా ఎదుర్కొనే జట్లలో టీమిండియా ముందువరుసలో ఉంటుంది. అలాంటి జట్టు నేడు స్పిన్ ధాటికి విల విలలాడింది. ఎలాంటి అనుభవం లేని ఓ 20 ఏళ్ల కుర్ర స్పిన్నర్ ను వరల్డ్ క్లాస్ బ్యాటర్లుగా ముద్రపడ్డ టీమిండియా ప్లేయర్లు ఎదుర్కొలేకపోయారు. అతడు వేసే గింగిరాలు తిరిగే బంతులకు భారత బ్యాటర్లు దాసోహం అయ్యారు. బాల్ ఎటుపడి ఎటు తిరుగుతుందో కూడా తెలియకుండా అతడు బంతులను సంధిస్తున్నాడు. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. ఇప్పటి వరకు ఇలాంటి రికార్డు ఇండియా ఖాతాలో లేదు.

ఈ మ్యాచ్ లో టీమిండియా చేజార్చుకున్న 10 వికెట్లు కూడా స్పిన్నర్లు తీయడం విశేషం. యువ స్పిన్నర్ దునిత్ వెల్లలాగే 5 వికెట్లు తీసి ఇండియా పతనాన్ని శాసించగా.. అతడికి తోడు మరో స్పిన్నర్ చరిత అసలంక 4 వికెట్లు తీసి రాణించాడు. ఇక మిగిలిన ఒక వికెట్ కూడా.. స్పిన్నర్ కే దక్కింది. ఈ వికెట్ ను మహేష్ తీక్షణ పడగొట్టాడు. దీంతో టీమిండియా వన్డే చరిత్రలో 10 వికెట్లు స్పిన్నర్లకు సమర్పించడం ఇదే తొలిసారి. స్పిన్ ను అలవోకగా ఎదుర్కొటంలో టీమిండియా బ్యాటర్లు సిద్దహస్తులు అని ఎప్పటి నుంచో పేరుంది. గతంలో సచిన్, లక్ష్మణ్, ద్రవిడ్, పుజారా లాంటి ఎంతో మంది స్పిన్ కు అడ్డుగోడలా నిలిచి పరుగులు సాధించారు. ప్రస్తుతం కూడా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ లాంటి ప్లేయర్లు స్పిన్ ను అలవోకగా ఎదుర్కోగల సత్తా ఉన్న ప్లేయర్లే. కానీ తాజాగా జరిగిన మ్యాచ్ లో మాత్రం తమ వికెట్లను స్పిన్నర్లకే చేజార్చుకున్నారు.

కాగా.. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లను తయ్యారుచేయడంలో లంక ఎప్పుడూ ముందే ఉంటుంది. ముత్తయ్య మురళీధరన్, మిస్టరీ స్పిన్నర్ అజంతా మెండీస్ లు ప్రపంచ క్రికెట్ చరిత్రపై తమదైన ముద్రవేశారు. 2001లో శ్రీలంక స్పిన్నర్లు ఇదే గ్రౌండ్ లో 10 వికెట్లు తీశారు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సేమ్ గ్రౌండ్ లో ఇదే రికార్డును ఇండియాపై రిపీట్ చేశారు. ఓవరాల్ గా వన్డే క్రికెట్ చరిత్రలో 10 వికెట్లు స్పిన్నర్లు తీయడం ఇది 10వ సారి కావడం గమనార్హం. కాగా.. 1997లో శ్రీలంక స్పిన్నర్లు కొలంబో గ్రౌండ్ లోనే 9 వికెట్లు నేలకూల్చారు. మరి టీమిండియా చెత్త రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి