ఇండియన్‌ క్రికెట్‌ మక్కా.. ఈడెన్‌ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం

ఇండియన్‌ క్రికెట్‌ మక్కా.. ఈడెన్‌ గార్డెన్స్‌లో అగ్ని ప్రమాదం

ఇండియన్‌ క్రికెట్‌ మక్కాగా పిలువబడే కోల్‌కత్తాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ క్రికెట్‌ స్టేడియంలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. 2023 వన్డే వరల్డ్‌ కోసం ఈ స్టేడియంలో మరమ్మతులు చేస్తుండగా బుధవారం రాత్రి డ్రెస్సింగ్‌ రూమ్‌లో మంటలు చెలరేగాయి. అక్కడున్న సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించడంతో ఫైర్‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. అయితే.. ఈ అగ్నిప్రమాదం విద్యుత్తు పరికరాల్లో సమస్య కారణంగానే చోటు చేసుకున్నట్లు సంబంధిత అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన చోట సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం.

కాగా ఆటగాళ్లు ఉండే డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఫాల్‌సీలింగ్‌లో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. మ్యాచ్‌లు జరిగినప్పుడు క్రికెటర్లు ఇక్కడ తమ కిట్లను భద్రపర్చుకుంటారు. అయితే.. ప్రమాద విషయం తెలియగానే బెంగాల్‌ క్రికెట్‌ అసోసియషన్‌ జాయింట్‌ సెక్రటరీ దేబ్రత్‌దాస్‌ స్టేడియానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘనటలో ప్రాణ నష్టం జరగలేదు. అయితే.. స్థానిక ఆటగాళ్లకు చెందిన కొంత సామాగ్రి కాలిపోయినట్లు సిబ్బంది తెలిపారు.

ఈ ప్రమాదంతో స్టేడియంలో ఫైర్‌ సెఫ్టీపై అనుమానలు తలెత్తున్నాయి. మరో రెండు నెలల్లో వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఇక్కడ జరగనున్నాయి. అలాంటి సమయంలో ఈ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. వరల్డ్‌ కప్‌ నిర్వహణ సమయంలో ఇలాంటి ప్రమాదం జరిగితే.. దేశ ప్రతిష్ట దెబ్బతినడంతో పాటు ఊహించని స్థాయిలో నష్టం జరిగే అవకాశం ఉందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: 2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోని వాడిన బ్యాట్‌ ధర రూ.83 లక్షలా? మతిపోయే నిజం..

Show comments