iDreamPost

2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోని వాడిన బ్యాట్‌ ధర రూ.83 లక్షలా? మతిపోయే నిజం..

  • Published Aug 10, 2023 | 10:59 AMUpdated Aug 10, 2023 | 10:59 AM
  • Published Aug 10, 2023 | 10:59 AMUpdated Aug 10, 2023 | 10:59 AM
2011 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోని వాడిన బ్యాట్‌ ధర రూ.83 లక్షలా? మతిపోయే నిజం..

2011 ఏడాది ఏ భారత క్రికెట్‌ అభిమాని కూడా మర్చిపోలేడు. ఎందుకంటే.. ఆ ఏడాదో భారత్‌కు రెండో వన్డే వరల్డ్ కప్‌ దక్కింది. స్వదేశంలో జరిగిన 2011 వరల్డ్‌ కప్‌ టోర్నీ ఆసాంతం భారత క్రికెట్‌ అభిమానుల కలల జట్టు.. ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తూ విశ్వవిజేతగా నిలిచింది. అయితే.. 2011 వరల్డ్‌ కప్‌ గురించి తల్చుకోగానే.. కళ్లముందు ధోని కొట్టిన చివరి సిక్స్‌ కనిపిస్తుంది. శ్రీలంకతో జరిగిన ఫైనల్‌లో ధోని సిక్స్‌తో మ్యాచ్‌ ముగించాడు. ఆ షాట్‌ ఇప్పటికీ ఎప్పటికీ ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ గుండెల్లో అలా నిలిచిపోయింది. ధోని ఆ షాట్‌ ఆడిన క్షణం.. 130 కోట్ల హృదయాలు భావోద్వేగంతో ఉప్పొంగాయి. టీమిండియా ప్రపంచ ఛాంపియన్‌గా అవసరించిన క్షణం అది.

ఆ మ్యాచ్‌లో ధోని ఆడిన షాట్‌ ఎవర్‌గ్రీన్‌గా నిలిపోయింది. అయితే.. ధోని ఆడిన ఆ బ్యాట్‌ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ మ్యాచ్‌లో ధోని మొత్తం 91 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపాడు. కాగా, ధోని ఆ మ్యాచ్‌లో ఉపయోగించిన బ్యాట్‌ ధర ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది క్రికెట్‌ టౌన్‌గా నిలిచింది. ఆ బ్యాట్‌ ధర ఇప్పుడు అక్షరాలా రూ.83 లక్షలు. నమ్మడానికి షాకింగా ఉన్నా అదే నిజం. 2011 వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ధోని వాడిన బ్యాట్‌ను తాజాగా వేలం వేస్తే అంత భారీ ధర పలికింది.

లండన్‌లోని చారిటీ ఈవెంట్‌లో ధోని బ్యాట్‌ను వేలం వేశారు. ఆర్కే గ్లోబల్‌ షేర్స్‌ అండ్‌ సెక్యూరిటీస్‌ లిమిటెడ్‌(ఇండియా) కంపెనీ ఈ అత్యంత భారీ ధర చెల్లించి ధోని బ్యాట్‌ను సొంతం చేసుకుంది. అయితే.. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును ధోని సతీమణి సాక్షి ఆధ్వర్యంలో నడిచే సాక్షి ఫౌండేషన్‌ కోసం వినియోగించనున్నారు. కాగా, ఈ వేలంతో ధోని బ్యాట్‌కు వచ్చిన ధరతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బ్యాట్‌గా ధోని బ్యాట్‌ నిలిచింది. దాన్ని ధోని వాడటం, పైగా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇండియా ఛాంపియన్‌గా నిలిచే ఇన్నింగ్స్‌, షాట్‌ ఆ బ్యాట్‌ నుంచే రావడంతో దానికి అంత ధర పలికింది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఇంగ్లండ్‌ గడ్డపై పృథ్వీ షా విధ్వంసం! కొద్దిలో రోహిత్‌ 264 రికార్డ్‌ మిస్‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి