SNP
న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్, 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఫిన్ అలెన్.. తాజాగా పాకిస్థాన్ స్టార్ పేసర్ అఫ్రిదీ పరువుపోయేలా దారునంగా అవమానించాడు. ఆ ఓవర్ గురించి, ఆ మ్యాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్, 2021 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడిన ఫిన్ అలెన్.. తాజాగా పాకిస్థాన్ స్టార్ పేసర్ అఫ్రిదీ పరువుపోయేలా దారునంగా అవమానించాడు. ఆ ఓవర్ గురించి, ఆ మ్యాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ షా అఫ్రిదీ పరువుతీసేలా.. న్యూజిలాండ్ స్టార్ ఓపెనర్, ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఫిన్ అలెన్ విధ్వంసం సృష్టించాడు. పాక్ కెప్టెన్ కమ్ లీడ్ పేసర్‌గా ఉన్న అఫ్రిదీని ఏ మాత్రం లెక్కచేయకుండా అతని ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు రాబట్టాడు. అది కూడా వరుసగా 6, 4, 4, 4, 6తో చెలరేగాడు. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకుని.. పాకిస్థాన్ జట్టు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య ప్రారంభమైన తొలి టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసింది. కివీస్ తరఫున ఫిన్ అలెన్, డెవాన్ కావ్వె ఓపెనర్లుగా బరిలోకి దిగారు. బౌలింగ్ ఎండ్ నుంచి పాకిస్థాన్ కెప్టెన్ షాహీన్ అఫ్రిదీ బాల్ అందుకున్నాడు.
తొలి ఓవర్‌లోనే తన నిప్పులు చెరిగే పేస్‌తో న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు అఫ్రిదీ. ఓపెనర్ డెవాన్ కాన్వెను డకౌట్ చేసి.. బ్లాక్ క్యాప్స్‌కు ఊహించని షాకిచ్చాడు. కానీ, తన తర్వాతి ఓవర్‌లో అంతకంటే పెద్ద షాక్ అఫ్రిదీ తిన్నాడు. ఇన్నింగ్స్ మూడో ఓవర్, అఫ్రిదీ రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ ఫిన్ అలెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అప్పటికే తొలి ఓవర్‌లో ఒక వికెట్ తీసి.. కేవలం ఒక్క పరుగు మాత్రమే ఇచ్చి ఫుల్ జోష్‌లో ఉన్న షాహీన్ అఫ్రిదీని ఏ మాత్రం లెక్కచేయకుండా.. తొలి బంతినే భారీ సిక్స్‌గా మలిచాడు. తర్వాతి బంతిని లో ఫుల్ టాస్‌గా వేయడంతో మిడాఫ్ వైపు ఆడేసి బౌండరీ సాధించాడు. మూడో బంతిని ఫేస్ ఉపయోగించి.. షార్ట్ ఫైన్ పక్కనుంచి మళ్లీ బౌండరీ రాబట్టాడు. అసలు ఏం జరుగుతుందో కూడా అఫ్రిదీకి అర్థం కాలేదు. నాలుగో బంతికి మరో బౌండరీ వచ్చింది. ఐదు బంతిని లాంగ్ ఆన్ మీదుగా మరో భారీ సిక్స్ బాదాడు. ఇలా వరుసగా 6,4,4,4,6 బాది.. ఆ ఓవర్‌లో ఏకంగా 24 పరుగులు పిండుకున్నాడు.
అఫ్రిదీని ఉతికి ఆరేసిన తర్వాత.. ఫిన్ 15 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సులతో 35 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చాలా కాలం తర్వాత టీ20 ఆడుతున్న కెప్టెన్ కేన్ విలియమ్సన్ 42 బంతుల్లో 57 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. డారిల్ మిచెల్ 27 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్సులతో 61 పరుగులు చేసి విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. వీరంతా రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరి ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ అఫ్రిదీ బౌలింగ్‌ను ఫిన్ అలెన్ చితక్కొట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Finn Allen takes on Pakistan’s Captain Shaheen Afridi 🔥 pic.twitter.com/NXc49ChvYs
— CricketGully (@thecricketgully) January 12, 2024