iDreamPost
android-app
ios-app

Ashwin, Bairstow: అశ్విన్‌-బెయిర్‌స్టో మధ్య గొడవ! ఒకరినొకరు..

  • Published Feb 05, 2024 | 2:11 PM Updated Updated Feb 05, 2024 | 2:11 PM

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ తన సీనియారిటీ పవరేంటో చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అశ్విన్‌-బెయిర్‌స్టో మధ్య గొడవ జరిగింది. అందేంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ మంచి బౌలింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ తన సీనియారిటీ పవరేంటో చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే అశ్విన్‌-బెయిర్‌స్టో మధ్య గొడవ జరిగింది. అందేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 05, 2024 | 2:11 PMUpdated Feb 05, 2024 | 2:11 PM
Ashwin, Bairstow: అశ్విన్‌-బెయిర్‌స్టో మధ్య గొడవ! ఒకరినొకరు..

విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే 7 వికెట్లు పడగొట్టి.. విజయానికి మరో మూడు వికెట్ల దూరంలో మాత్రమే ఉంది. బజ్‌బాల్‌ గేమ్‌ ఆడి.. 399 పరుగుల టార్గెట్‌ను ఊదేస్తామని హెచ్చులకు పోయిన ఇంగ్లండ్‌ను వణికిస్తూ.. టీమిండియా బౌలర్లు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జానీ బెయిర్‌స్టో మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ ఘటనతో ఒక్కసారిగా మ్యాచ్‌లో హీట్‌ పెరిగింది. గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగానే తలపడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆటగాళ్ల మధ్య వేడి రాజుకుంది. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌లో ఆశలు పుట్టించాడు బెయిర్‌స్టో. తనకు అలవాటైన అగ్రెసివ్‌ ఇంటెంట్‌తో.. అప్పటికే 5 ఫోర్లు బాది.. డేంజరస్‌గా మారాడు. బెయిర్‌ స్టో ఇలాగే చెలరేగితే.. మ్యాచ్‌ చేజారే ప్రమాదం ఉందని గ్రహించిన టీమిండియా కెప్టెన్‌ జస్ప్రీత్‌ బుమ్రాను రంగంలోకి దించాడు.

ఆ ప్లాన్‌ సరిగ్గా వర్క్‌అవుట్‌ అయింది. ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌ నాలుగో బంతికి బెయిర్‌ స్టో లెగ్‌ బిఫోర్‌గా అవుట్‌ అయ్యాడు. అయితే అంతకంటే ముందు ఓవర్‌లోనే అశ్విన్‌.. హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకుని అద్భుతంగా ఆడుతున్న జాక్‌ క్రాలీని అవుట్‌ చేసి ఉన్నాడు. బెయిర్‌ స్టోను కూడా పెవిలియన్‌ పంపుదామని అశ్విన్‌ గట్టిగానే ప్రయత్నించాడు. అయితే బుమ్రా ఓవర్‌లో అవుటైన తర్వాత.. అశ్విన్‌ సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అశ్విన్‌ను బెయిర్‌ స్టో ఏదో అంటూ కనిపించాడు. దానికి అశ్విన్‌ సైతం వెనక్కి తిరిగి మాటతోనే సమాధానం ఇచ్చాడు. ఇలా ఇద్దరు మధ్య మాటల యుద్ధం జరిగింది. అయితే.. ఇద్దరు బూతులు తిట్టుకుని ఉంటారని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. ఆటలో ఇలా ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం జరగడం సర్వ సాధారణమే అయినా కొన్ని సార్లు అవి శృతి మించుతూ ఉంటాయి.

ఇక ఈ మ్యాచ్‌లో రవిచంద్రన్‌ అశ్విన్‌ అద్భుతంగా రాణిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా చెలరేగిపోయి.. 6 వికెట్లతో ఇంగ్లండ్‌ వెన్నువిరిస్తే.. రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ వాళ్ల పనిపడుతున్నాడు. ఎంతో కీలకమైన రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్‌ బౌలింగ్‌ను ఎదుర్కొవడానికి ఇంగ్లండ్‌ బ్యాటర్లు వణికిపోతున్నారు. ఇప్పటికే 3 వికెట్లు పడగొట్టిన అశ్విన్‌.. 500 వికెట్ల మార్క్‌ను దాటేశాడు. ఈ అరుదైన ఘనత సాధించిన తర్వాత అశ్విన్‌ భారీగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఎంతో కీలకమైన వికెట్లను అశ్విన్‌ పడగొట్టాడు. ఓపెనర్‌ బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌లను అశ్విన్‌ తక్కువ స్కోర్‌కే అవుట్‌ చేసి.. టీమిండియా విజయం దిశగా నడిపించాడు. మరి ఈ మ్యాచ్‌లో అశ్విన్‌-బెయిర్‌ స్టో మధ్య చోటు చేసుకున్న మాటల యుద్ధంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.