SNP
ఇండియా 2007లో టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరి కష్టం ఉంది. అంత గొప్ప విజయాల్లో కలిసి భాగంగా నిలిచినా.. గంభీర్-శ్రీశాంత్ మధ్య స్నేహం ఏర్పడలేదు. తాజాగా వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకునేంత వరకు వెళ్లింది..
ఇండియా 2007లో టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ గెలవడంలో వీరిద్దరి కష్టం ఉంది. అంత గొప్ప విజయాల్లో కలిసి భాగంగా నిలిచినా.. గంభీర్-శ్రీశాంత్ మధ్య స్నేహం ఏర్పడలేదు. తాజాగా వీళ్లిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. ఇద్దరూ కొట్టుకునేంత వరకు వెళ్లింది..
SNP
టీమిండియా మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, శ్రీశాంత్ ఇద్దరూ వివాదాలతో సహవాసం చేసిన వాళ్లే. టీమిండియాకు ఆడుతున్న సమయంలో తమ అగ్రెసివ్ నెస్ తో ప్రత్యర్థి ఆటగాళ్లతో పాటు, సొంత టీమ్ ఆడగాళ్లతో కూడా ఈ ఇద్దరు ఆటగాళ్లు గొడవ పడ్డారు. తాజాగా వీరిద్దరూ గొడవకు దిగారు. లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023లో భాగంగా బుధవారం సురత్ లోని లాలాభాయ్ క్రికెట్ స్టేడియంలో ఇండియా క్యాపిటల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో గౌతమ్ గంభీర్ ఇండియా క్యాపిటల్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా.. శ్రీశాంత్ గుజరాత్ జెయింట్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం జరిగిన మ్యాచ్ లో వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది.
మాట మాట అనుకున్న ఇద్దరు ఆటగాళ్లు ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. అంపైర్లు, ఇతర ఆటగాళ్లు వచ్చి బలవంతంగా వారిద్దరిని దూరం చేయడంతో.. కొట్టుకోకుండా పక్కకు వెళ్లారు. ఇద్దరూ అగ్రెసివ్ నేచర్ ఉన్న ఆటగాళ్లే కావడంతో గొడవను ఆపడం అక్కడున్న వాళ్లకి కష్టమైంది. మొత్తానికి గంభీర్-శ్రీశాంత్ మధ్య పెద్ద గొడవే జరిగింది. వీరిద్దరూ కలిసి టీమిండియాకి చాలా కాలం పాటు కలిసి ఆడారు. టీ20 వరల్డ్ కప్ 2007, వన్డే వరల్డ్ కప్ 2011 గెలిచిన భారత జట్టులో ఇద్దరూ సభ్యులే. అయినా కూడా వీరిద్దరి మధ్య ఇంత పెద్ద గొడవ జరగడం క్రికెట్ అభిమానులను షాక్ కు గురిచేసింది. సీనియర్ క్రికెటర్లు అయి ఉండి.. జూనియర్లకు ఆదర్శంగా నిలవాల్సిన టైమ్ లో.. ఇలా గ్రౌండ్ లో బూతులు తిట్టుకుంటారా అంటూ కొంత మంది క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
గౌతమ్ గంభీర్.. పాకిస్థాన్ ఆటగాళ్లతో పాటు ఐపీఎల్ సందర్భంగా విరాట్ కోహ్లీతో సైతం అనేక సార్లు గొడవ పడిన విషయం తెలిసిందే. అలాగే శ్రీశాంత్ సైతం ఆస్ట్రేలియా ఆటగాళ్లతో పాటు ఐపీఎల్ లో హర్భజన్ సింగ్ తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. అలాగే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో శ్రీశాంత్ కెరీర్ మొత్తం నాశనం అయిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా.. ఇద్దరు సీనియర్ ఆటగాళ్లు ఇలా గ్రౌండ్ లో తీవ్రంగా గొడవకు దిగడంపై మాత్రం క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎంతో అనుభవం ఉన్న ఆటగాళ్లు ఒకరికొకరు మర్యాదను ఇచ్చిపుచ్చుకోవాలని కోరుతున్నారు. కాగా.. ఈ గొడవపై మ్యాచ్ తర్వాత శ్రీశాంత్ ఒక వీడియోకు కూడా రిలీజ్ చేశాడు. తాను ఒక్క మాట కూడా అనలేదని, గంభీర్ కారణం లేకుండా తనను దూషించాడని, అతని మాటలు తనను ఎంతో బాధించాయని, గంభీర్ ఎప్పుడూ కూడా తోటి ఆటగాళ్లను, సీనియర్లను గౌరవించడని శ్రీశాంత్ పేర్కొన్నాడు. వీరేందర్ సెహ్వాగ్, విరాట్ కోహ్లీలను కూడా గంభీర్ గౌరవించడు, ఇలా తోటి ఆటగాళ్లనే గౌరవించని వ్యక్తి.. ప్రజలకు ఎలా ప్రాతినిథ్యం వహిస్తాడని మండిపడ్డాడు. మరి గంభీర్-శ్రీశాంత్ మధ్య జరిగిన గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.