World Cup 2023: ఇప్పుడు టీమిండియా సూపర్‌ గా కనిపిస్తుందా? కానీ, ఒక పెద్ద మైనస్‌ ఉంది!

ఇప్పుడు టీమిండియా సూపర్‌ గా కనిపిస్తుందా? కానీ, ఒక పెద్ద మైనస్‌ ఉంది!

  • Author Soma Sekhar Published - 02:37 PM, Sat - 23 September 23
  • Author Soma Sekhar Published - 02:37 PM, Sat - 23 September 23
ఇప్పుడు టీమిండియా సూపర్‌ గా కనిపిస్తుందా? కానీ, ఒక పెద్ద మైనస్‌ ఉంది!

వరల్డ్ ముంగిట టీమిండియా భీకర ఫామ్ లో ఉంది. వరుసగా సిరీస్ లు గెవడమే కాక.. మినీ వరల్డ్ కప్ గా పేరుగాంచిన ఆసియా కప్ ను సైతం ముద్దాడింది. ఇక ఇదే ఊపును ఆస్ట్రేలియా సిరీస్ లో కూడా కొనసాగిస్తోంది. మూడు వన్డేల సిరీస్ లో భాగంగా మెుహాలీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో పటిష్టంగా ఉంది టీమిండియా. గత కొంతకాలంగా అద్భుతంగా రాణిస్తున్న టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్ లో సత్తా చాటుతున్నప్పటికీ.. ఒకే ఒక్క సమస్య భారత జట్టును తీవ్రంగా వెంటాడుతోంది. అదే ఫీల్డింగ్ సమస్య. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఒక్క క్యాచ్ మిస్ చేసినా గానీ.. మ్యాచ్ చేజారడం ఖాయం. ఇలాంటి విభాగంలో జట్టు ఇంకా బలహీనంగా ఉండటం ఆదోళనకరమైన విషయం.

ప్రస్తుతం టీమిండియా వరల్డ్ క్రికెట్ లో సూపర్ పవర్ గా అవతరించింది. అన్ని ఫార్మాట్లలో ఆధిపత్యం చెలాయిస్తూ.. నంబర్ వన్ జట్టుగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో పటిష్టంగా కనిపిస్తున్న జట్టు.. ఫీల్డింగ్ విషయానికి వచ్చేసరికి తేలిపోతోంది. సింపుల్ క్యాచ్ లను కూడా ఆటగాళ్లు వదిలేస్తూ.. ప్రత్యర్థి బ్యాటర్లకు లైప్ ఇస్తూ.. మ్యాచ్ ను రిస్క్ లోకి నెట్టేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాను వేధిస్తున్న ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే అది ఫీల్డింగ్ అనే చెప్పాలి. గతంలో యువరాజ్ సింగ్, మహ్మద్ కైఫ్ లాంటి ఫీల్డర్లు టీమిండియా ఫీల్డింగ్ భారం మోసేవారు.

అయితే ఇప్పుడు కూడా టీమిండియాలో వరల్డ్ క్లాస్ ఫీల్డర్లు ఉన్నారు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, పాండ్యా, గిల్, శ్రేయస్ అయ్యర్, రోహిత్ లాంటి అద్భుతమైన ఫీల్డర్లు ఉన్నారు. కానీ క్యాచ్ లు అందుకోవడంలో మాత్రం వీరు విఫలం అవుతున్నారు. గత కొంతకాలంగా టీమిండియా ఫీల్డింగ్ ఘోరంగా ఉంటోంది. ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా మూడు క్యాచ్ లు మిస్ చేసి విమర్శలు మూటగట్టుకున్నారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ఫీల్డర్స్ సైతం మిస్ ఫీల్డింగ్ చేస్తే.. వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో జట్టు పరిస్థితి ఏంటి? అని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సైతం మిస్ ఫీల్డింగ్ తో మరోసారి అప్రతిష్టపాలైయ్యారు టీమిండియా ఆటగాళ్లు.

ఈ మ్యాచ్ లో డేవిడ్ వార్నర్ ఇచ్చిన సింపుల్ క్యాచ్ ను అయ్యర్ వదిలేయడం, కెప్టెన్ రాహుల్ ఒక రనౌట్ ను మిస్ చేయడం టీమిండియా ఫీల్డింగ్ ఇంకా మెరుగుపడాలనడానికి ఒక ఉదాహరణగా చూపొచ్చు. వరల్డ్ కప్ గెలవాటంటే కేవలం బ్యాటింగ్, బౌలింగ్ మాత్రమే పటిష్టంగా ఉంటే సరిపోదు. ఫీల్డింగ్ కూడా బలంగా ఉంటేనే ప్రత్యర్థిని కట్టడి చేయగలుగుతాం. 2019 వరల్డ్ కప్ క్యాచ్ ల ఎఫిసీయెన్సీలో టీమిండియా 8వ స్థానంలో ఉండటం గమనార్హం. మనకంటే పాక్, బంగ్లాదేశ్ లు ఈ విభాగంలో ముందున్నాయి అంటేనే అర్థం అవుతోంది. మన ఫీల్డింగ్ ఏ స్థాయిలో ఉందో. మరి టీమిండియా ఫీల్డింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments