iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ టికెట్ల విషయంలో BCCI షాకింగ్ నిర్ణయం! మ్యాచ్ చూడాలంటే అవి ఉండాల్సిందే!

  • Author Soma Sekhar Published - 05:57 PM, Sat - 29 July 23
  • Author Soma Sekhar Published - 05:57 PM, Sat - 29 July 23
వరల్డ్ కప్ టికెట్ల విషయంలో BCCI షాకింగ్ నిర్ణయం! మ్యాచ్ చూడాలంటే అవి ఉండాల్సిందే!

2023 వరల్డ్ కప్ మహా సంగ్రామానికి మరికొన్ని రోజుల్లో తెరలేవనుంది. భారత్ ఆతిథ్యం ఇస్తున్న ఈ వరల్డ్ కప్ ను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని పక్కా ప్రణాళికలు వేస్తోంది బీసీసీఐ. అందుకు సంబంధించి ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటోంది. అందులో భాగంగానే వరల్డ్ కప్ మ్యాచ్ లు చూడ్డానికి వచ్చే ప్రేక్షకులకు ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ ను అందించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇందుకు సంబంధించి బీసీసీఐ సెక్రెటరీ జై షా కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు. వరల్డ్ కప్ టికెట్లపై బీసీసీఐ షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

భారత్ వేదికగా జరగనున్న 2023 వరల్డ్ కప్ కు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రపంచ కప్ మ్యాచ్ లు చూడాలి అంటే అభిమానులు ఒరిజినల్ టికెట్లు అంటే ఫిజికల్ టికెట్స్ తీసకెళ్లాల్సిందే అంటూ బీసీసీఐ స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. దాంతో వరల్డ్ కప్ లో ఈ-టికెట్ల సౌకర్యం ఉండదని తెలుస్తోంది. ప్రస్తుతం వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో ఈ-టికెటింగ్ ను అమలు చేయలేమని జై షా చెప్పుకొచ్చాడు. ఈ పద్దతిని ముందుగా ద్వైపాక్షిక సిరీస్ లలో అమలు చేశాకే.. వరల్డ్ కప్ లాంటి టోర్నీల్లో అమలు చేస్తామని ప్రకటించాడు.

కాగా.. వాస్తవానికి ఇండియాలో ఏ స్టేడియానికి మ్యాచ్ చూడ్డానికి వెళ్లినా.. భౌతిక టికెట్ తప్పనిసరి. ఆన్ లైన్ లో టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ.. స్టేడియానికి వెళ్లాలంటే భౌతిక టికెట్ కంపల్సరీ. అయితే ఈ పద్దతి ద్వారా అభిమానులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. దాంతో ఈ-టికెట్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. కాగా.. ఢిల్లీలో జరిగిన సమావేశంలో బీసీసీఐ కార్యదర్శి జై షా మాట్లాడుతూ..”మేం వరల్డ్ కప్ లో ఈ-టికెట్ ను ఉపయోగించలేం. అభిమానులు భౌతికంగా టికెట్లు పొందడానికి 7-8 కేంద్రాలను ముందుగానే ప్లాన్ చేశాం. పెద్ద స్టేడియాల్లో ఈ-టికెట్ నిర్వాహన చాలా కష్టం” అని ఆయన స్పష్టం చేశారు. ఇక ప్రపంచ కప్ టికెట్ల ధరతో పాటుగా అన్నీ త్వరలోనే ప్రకటిస్తామని జై షా పేర్కొన్నారు. మరి వరల్డ్ కప్ టికెట్ల విషయంలో బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: రాబిన్‌ ఊతప్ప విశ్వరూపం! ఫోర్లు, సిక్సుర్ల వర్షం కురిపించేశాడుగా..