Somesekhar
సన్ రైజర్స్ కు వరంలా మారాడు ప్యాట్ కమ్మిన్స్. దీంతో ఈసారి ఐపీఎల్ టైటిల్ ను కచ్చితంగా SRH కొడుతుందని ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు. దానికి కారణం కమ్మిన్స్ అని ఫ్రూప్ తో సహా చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
సన్ రైజర్స్ కు వరంలా మారాడు ప్యాట్ కమ్మిన్స్. దీంతో ఈసారి ఐపీఎల్ టైటిల్ ను కచ్చితంగా SRH కొడుతుందని ఫ్యాన్స్ గట్టిగా చెబుతున్నారు. దానికి కారణం కమ్మిన్స్ అని ఫ్రూప్ తో సహా చెబుతున్నారు. ఆ వివరాల్లోకి వెళితే..
Somesekhar
IPL 2024లో భాగంగా నిన్న హైదరాబాద్ వేదికగా జరగాల్సిన గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ మ్యాచ్ వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయింది. దాంతో ఇరు జట్లకు చెరో పాయింట్ రావడంతో.. SRH ప్లే ఆఫ్స్ కు వెళ్లింది. దాంతో ఈసారి కప్ కచ్చితంగా సన్ రైజర్స్ ఎగరేసుకుపోతుందని ఫ్యాన్స్ బల్ల గుద్దిమరీ చెబుతున్నారు. అయితే ఫ్యాన్స్ అంత గట్టిగా చెప్పడానికి కారణం కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కావడం విశేషం. అతడి గణాంకాలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఆ ఫ్రూప్ లు ఏంటి?ఓసారి పరిశీలిద్దాం పదండి.
ప్యాట్ కమ్మిన్స్.. ఈసారి ఎలాగైనా ఐపీఎల్ టైటిల్ కొట్టాలన్న టార్గె తో ఈ ఆసీస్ కెప్టెన్ ను జట్టులోకి తీసుకుంది కావ్య మారన్. దాంతో పాటుగానే సారథిగా ఎంతో అనుభం ఉన్న కమ్మిన్స్ కు పగ్గాలు సైతం అందించింది. అయితే తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సన్ రైజర్స్ ను ప్లే ఆఫ్స్ కు తీసుకెళ్లాడు ప్యాట్. కాగా.. కమ్మిన్స్ గత రికార్డులను పరిశీలిస్తే.. ఈసారి కచ్చితంగా SRH టైటిల్ ను ఎగరేసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు విషయం ఏంటంటే?
కెప్టెన్ గా ప్యాట్ కమ్మిన్స్ కు తిరుగులేని రికార్డ్స్ ఉన్నాయి. అతడు కెప్టెన్ నియమించిన దగ్గర నుంచి ఆసీస్ కు తిరుగులేని విజయాలను అందిస్తూ.. మెగాట్రోఫీలను జట్టుకు అందిస్తూ వస్తున్నాడు. గతేడాది నుంచి కమ్మిన్స్ పట్టిందల్లా బంగారంలా మారుతోంది. ప్యాట్ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత యాషెస్ సిరీస్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, వరల్డ్ కప్ 2023 లాంటి మెగా ట్రోఫీలను ఆస్ట్రేలియాకు అందించాడు. ఇక ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. దాంతో ఈ సెంటిమెంట్ రిపీట్ అయితే.. ఈసారి ఐపీఎల్ టైటిల్ సన్ రైజర్స్ దే. హైదరాబాద్ టీమ్ కు ప్యాట్ వరంలా మారి కప్ అందిస్తే.. అదే పదివేలు అనుకుంటున్నారు ఫ్యాన్స్. మరి కెప్టెన్ గా తిరుగులేని రికార్డ్స్ కలిగి ఉన్న కమ్మిన్స్.. సన్ రైజర్స్ కు కప్ అందిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.