SNP
Ishan Kishan, T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో ఇషాన్ కిషన్ వైఫల్యం కేవలం బ్యాటింగ్‌లోనే కాదు.. వికెట్ కీపింగ్‌లో కూడా కొనసాగుతోంది. తాజాగా ఓ వీడియోతో అతను కీపర్‌గా వరల్డ్ కప్‌కు అన్‌ఫిట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Ishan Kishan, T20 World Cup 2024: ఐపీఎల్ 2024లో ఇషాన్ కిషన్ వైఫల్యం కేవలం బ్యాటింగ్‌లోనే కాదు.. వికెట్ కీపింగ్‌లో కూడా కొనసాగుతోంది. తాజాగా ఓ వీడియోతో అతను కీపర్‌గా వరల్డ్ కప్‌కు అన్‌ఫిట్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్ 2024లో చాలా మంది క్రికెటర్లు తమ ప్రాణం పెట్టి ఆడుతున్నాడు. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్ తర్వాత.. జూన్‌లో ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ చివర్లో లేదా, ముగిసిన తర్వాత టీ20 వరల్డ్ కప్ 2024 కోసం టీమ్‌ను ప్రకటించే అవకాశం ఉండటంతో.. ఐపీఎల్‌లో అదరగొట్టి.. ఎలాగైన టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో చోటు దక్కించుకోవాలని, స్టార్లు క్రికెటర్లు సైతం తమ బెస్ట్ ఇచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. టీమ్‌లో చోటు ఖాయమైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా లాంటి ఆటగాళ్ల కూడా.. ఆట కోసం తమ రక్తం, ప్రాణం పెడుతుంటే.. ఓ యువ క్రికెటర్ మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు.
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియాలో దాదాపు అన్ని స్థానాలకు ఆటగాళ్లు సెలెక్టర్ల దృష్టిలో ఉన్నారు. ముఖ్యంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ప్లేస్ కోసం ఓ నలుగురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ నెలకొందని ఇన్ని రోజులు క్రికెట్ అభిమానులు భావించారు. రిషభ్ పంత్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్.. వీరిలో పంత్, సంజు, కేఎల్ అద్భుతంగా ఆడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్‌లోనూ సత్తా చాటుతున్నారు. పైగా వారి ముగ్గురిపై కెప్టెన్సీ భారంగా కూడా ఉంది. అయినా కూడా బ్యాటింగ్‌లో అదరగొడుతూ.. కీపింగ్‌లో సూపర్ క్యాచ్‌లు, స్టింపింగ్‌లతో ఔరా అనిపిస్తూ.. టీ20 వరల్డ్ కప్ కోసం తమను సెలెక్ట్ చేయాల్సిందే అని విధంగా సెలెక్టర్లపై ఒత్తిడి తెచ్చే ప్రదర్శన చేస్తున్నారు. వీరికి దినేష్ కార్తీక్ కూడా పోటీ ఇస్తున్నాడు.
కానీ, యువ క్రికెటర్, ఆల్రెడీ టీమిండియాలో మ్యాచ్‌లు ఆడి, సత్తా చాటిన ఇషాన్ కిషన్ మాత్రం.. తనకు టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు అవసరం లేదు అనేలా వ్యవహరిస్తున్నాడు. బ్యాటింగ్‌లో దారుణంగా విఫలం అవుతున్న ఇషాన్.. వికెట్ కీపింగ్‌లోనూ వరస్ట్ ప్రదర్శన కనబరుస్తున్నాడు. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ డేవిడ్ వేసిన త్రోను పట్టుకుండా చాలా నిర్లక్ష్యంగా వదిలేశాడు. అది కాస్త ఓవర్ త్రో రూపంలో బౌండరీకి వెళ్లింది. పైగా అది రాంగ్ త్రూ కూడా కాదు. బాల్ తగిలి ఉంటే.. ఢిల్లీ వికెట్ కోల్పోయేది. అయినా కూడా ఇషాన్ చాలా కేర్‌లెస్‌గా బాల్‌ను పట్టుకోకుండా వదిలేశాడు. ఇషాన్ బాల్ వదిలేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఒక్క వీడియో చాలు.. టీ20 వరల్డ్ కప్‌కు వికెట్ కీపర్‌గా ఇషాన్ అన్‌ఫిట్ అని చెప్పడానికి అంటూ క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. ఈ దెబ్బతో టీ20 వరల్డ్‌కప్ కోసం వికెట్ కీపర్ స్థానానికి ఇషాన్ పేరును పక్కనపెట్టేయొచ్చు అనే టాక్ కూడా వినిపిస్తోంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.