టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కు ఓ అభిమాని దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ వీడియో ద్వారా స్కై చెప్పుకొచ్చాడు. మరి సూర్యకు అభిమాని ఇచ్చిన షాకేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ కు ఓ అభిమాని దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా ఓ వీడియో ద్వారా స్కై చెప్పుకొచ్చాడు. మరి సూర్యకు అభిమాని ఇచ్చిన షాకేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రికెటర్లకు అప్పుడప్పుడు అభిమానులు షాక్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఓ అభిమాని వరల్డ్ నంబర్ వన్ టీ20 ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ కు దిమ్మతిరిగే షాకిచ్చాడు. వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంకతో జరిగే మ్యాచ్ కు ముందు కాస్త ఖాళీ టైమ్ దొరకడంతో.. టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ కు ఓ ఆలోచన వచ్చింది. దీంతో వెంటనే కెమెరా చేతపట్టుకుని వరల్డ్ కప్ లో టీమిండియా ఆటతీరుపై ముంబై బీచ్ పరిసర ప్రాంతాల్లో ప్రజాభిప్రాయసేకరణ చేపట్టాడు. ఈ క్రమంలో ఓ అభిమాని సూర్యకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. ఈ విషయాన్ని స్వయంగా సూర్యనే ఓ వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు.
సూర్యకుమార్ యాదవ్.. వరల్డ్ కప్ లో అంతగా రాణించలేకపోతున్నాడు. కానీ కీలక సమయాల్లో మాత్రం జట్టుకు అండగా నిలుస్తూ.. విజయాల్లో తనవంతు పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ మెగాటోర్నీలో మరో కీలక మ్యాచ్ కు సిద్దమవుతోంది టీమిండియా. శ్రీలంకతో నవంబర్ 2న వాంఖడే స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కు ముందు కాస్త ఖాళీ సమయం దొరకడంతో.. టీమిండియా స్టార్ బ్యాటర్ కు ఓ చిలిపి ఆలోచన వచ్చింది. అదేంటంటే? వరల్డ్ కప్ లో టీమిండియా ఆటతీరుపై ప్రజాభిప్రాయ సేకరణ చేయాలని భావించాడు. అనుకున్న వెంటనే కెమెరా చేతపట్టుకుని తనను ఎవ్వరూ గుర్తు పట్టకుండా ముంబై బీచ్ ఏరియాకు బయలుదేరాడు.
ఇక చాలా మంది టీమిండియా ఆటతీరు ఓకే అంటే.. ఇంకొందరు మాత్రం ఇంకాస్త మెరుగుపడాలని చెప్పుకొచ్చారు. మెజారిటీ పీపుల్ మాత్రం ఎవరు ఎలా ఆడినా.. ఈసారి వరల్డ్ కప్ టీమిండియాదే అంటూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే సూర్యకుమార్ ఆట ఈ వరల్డ్ కప్ లో ఎలా ఉందని తన గురించి ప్రశ్నించుకున్నాడు. దానికి సదరు అభిమాని సమాధానం చెబుతూ..” అతడి ఆట ఏమంత బాలేదు. ఇంకా బాగా ఆడాలి” అంటూ చెప్పి సూర్యకు షాకిచ్చాడు. ఆ అభిమాని తాను మాట్లాడుతున్నది సూర్యతోనే అని తెలీక నిజం చెప్పేశాడు. అతడి ఆన్సర్ కు షాకయ్యాడు సూర్య భాయ్.
కాగా.. ఈ విషయాన్ని అతడే స్వయంగా ఓ వీడియో ద్వారా వెల్లడించాడు. కాగా.. అతడు తన గురించి అలా మాట్లాడినప్పుడు గట్టిగా నవ్వాలనిపించిందని చెప్పుకొచ్చాడు స్కై. ఇక తనతో పాటుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రాల ఆటతీరుపై కూడా అభిమానులను అడిగి తెలుసుకున్నాడు. ప్రస్తుతం సూర్య ప్రజాభిప్రాయసేకరణ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి వరల్డ్ కప్ లో సూర్య ఆటతీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.