iDreamPost
android-app
ios-app

వీడియో: డుప్లెసిస్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. లేటు వయసులో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌!

  • Published Jul 18, 2023 | 10:55 AM Updated Updated Jul 18, 2023 | 10:55 AM
  • Published Jul 18, 2023 | 10:55 AMUpdated Jul 18, 2023 | 10:55 AM
వీడియో: డుప్లెసిస్‌ స్టన్నింగ్‌ క్యాచ్‌.. లేటు వయసులో కళ్లు చెదిరే ఫీల్డింగ్‌!

సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌, ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ లేటు వయసులో కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తున్నాడు. అమెరికాలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మేజర్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 టోర్నీలో టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న డుప్లెసిస్‌ ఆ జట్టును విజయపథంలో నడిపిస్తున్నాడు. సోమవారం ఎంఐ న్యూయార్క్‌తో జరిగిన మ్యాచ్‌లో టీఎస్‌కే విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లోనే డుప్లెసిస్‌ కళ్లు చెదిరే క్యాచ్‌ ఒకటి అందుకున్నాడు. అది కూడా ఒంటి చేత్తో మ్యాచ్‌ గెలిపించగల హిట్టర్‌ టివ్‌ డేవిడ్‌ది. 6 బంతుల్లో 21 పరుగుల కావాల్సిన దశలో టిమ్‌ డేవిడ్‌ అప్పటికే ప్రమాదకరంగా మారిపోయాడు. 19 బంతుల్లో ఒక ఫోర్‌, సిక్స్‌తో 24 పరుగులతో మ్యాచ్‌ గెలిపించే పొజిషన్‌లో ఉన్నాడు.

6 బంతుల్లో కనీసం మూడు బంతులు టిమ్‌ డేవిడ్‌కి చిక్కినా కూడా మ్యాచ్‌ ఎంఐదే. ఈ పరిస్థితిల్లో డానియల్‌ సామ్స్‌ వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ తొలి బంతికే టిమ్‌ భారీ షాట్‌కు ప్రయత్నించాడు. గాల్లోకి రాకెట్‌లా లేసిన బంతి లాంగ్‌ ఆన్‌ దిశగా వెళ్లింది. వెంటనే రాకెట్‌ను మించిన వేగంతో దూసుకొచ్చిన డుప్లెసిస్‌ గాల్లో పక్షిలా ఎగురుతూ.. భారీ డైవ్‌ కొడుతూ కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకున్నాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, క్రికెట్‌ అభిమానులు ‘డుప్లెసిస్‌.. నీ వయసేంటి? ఆ ఫీల్డింగ్‌ ఏంటి?’ అంటూ ఆశ్చర్యంతో మెచ్చకుంటున్నారు. ప్రస్తుతం డుప్లెసిస్‌ 39 ఏళ్లు.. ఈ వయసులో కూడా డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలు మామూలుగా లేవు. యువ క్రికెటర్లు సైతం కుళ్లుకునే విధంగా డుప్లెసిస్‌ ఫీల్డింగ్‌ చేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను బ్యాటింగ్‌లో నిరాశపర్చిన తన ఫీల్డింగ్‌తో ఫ్యాన్స్‌కు వినోదం పంచాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన టెక్సాస్‌ సూపర్‌ కింగ్స్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఓపెనర్‌ కాన్వె 74 పరుగులతో దుమ్మురేపాడు. కెప్టెన్‌ డుప్లెసిస్‌ 8 మాత్రమే చేసిన నిరాశపరిచాడు. చివర్లో సాంట్నర్‌ 13 బంతుల్లో ఒక ఫోర్‌, 2 సిక్సులతో చెలరేగి 27 పరుగుల చేయడం టెక్సాస్‌కు కలిసొచ్చింది. బౌల్ట్‌, రబాడ రెండేసి వికెట్లు తీసుకున్నారు. పొలార్డ్‌, రషీద్‌ ఖాన్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. ఇక 155 పరుగుల లక్ష్యఛేదనకు దిగిన ఎంఐ.. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు మాత్రమే చేసి.. ఓటమి పాలైంది. ఓపెనర్‌ జహంగీర్‌ 41, పూరన్‌ 19, టిమ్‌ డేవిడ్‌ 24 పర్వాలేదనిపించారు. మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. సూపర్‌ కింగ్స్‌ బౌలర్లలో డానియల్‌ సామ్స్‌, మొహమ్మద్‌ మోహ్‌సిన్‌ రెండేసి వికెట్లు పడగొట్టగా, థేరోన్‌, జై ఉల్‌ హక్‌, బ్రావో తలో వికెట్‌ తీసుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో డుప్లెసిస్‌ పట్టిన క్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: నా భార్య నన్ను కాదని అతన్ని ఇష్టపడుతోంది: స్టార్‌ క్రికెటర్‌