iDreamPost
android-app
ios-app

డుప్లెసిస్‌ చెత్త కెప్టెన్సీ.. ఒక్క నిర్ణయంతో మ్యాచ్‌ పోగొట్టాడు!

  • Published Mar 23, 2024 | 10:57 AM Updated Updated Mar 23, 2024 | 10:57 AM

Faf Du Plessis, IPL 2024: ఐపీఎల్‌ 2024లో తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. అయితే.. అది ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ తీసుకున్న చెత్త నిర్ణయంతోనే అనే వాదన వినిపిస్తోంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..

Faf Du Plessis, IPL 2024: ఐపీఎల్‌ 2024లో తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైంది. అయితే.. అది ఆ జట్టు కెప్టెన్‌ డుప్లెసిస్‌ తీసుకున్న చెత్త నిర్ణయంతోనే అనే వాదన వినిపిస్తోంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 23, 2024 | 10:57 AMUpdated Mar 23, 2024 | 10:57 AM
డుప్లెసిస్‌ చెత్త కెప్టెన్సీ.. ఒక్క నిర్ణయంతో మ్యాచ్‌ పోగొట్టాడు!

క్రికెట్‌ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. ధనాధన్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ 2024 సీజన్‌ అట్టహాసంగా మొదలైంది. శుక్రవారం చెన్నైలోని చెపాక్‌ క్రికెట్‌ స్టేడియంలో చెన్నై సూపర్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌తో ఈ మెగా టోర్ని షురువైంది. ధోని, విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్లతో ఇరు జట్లు కళకళలాడాయి. అయితే.. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌, కొత్త కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ సారథ్యంలో తొలి విజయాన్ని నమోదు చేసింది. ఆర్సీబీని పూర్తిగా డామినేట్‌ చేస్తూ.. సూపర్‌ విక్టరీ కొట్టి.. మంచి విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌ చివరి 5 ఓవర్ల మిగిలి ఉన్నంత వరకు మ్యాచ్‌ ఇరు జట్ల మధ్య దోబుచులాడింది. కానీ, ఆర్సీబీ కెప్లెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌ చెత్త కెప్టెన్సీతో ఈ మ్యాచ్‌తో సీఎస్‌కే చాలా సులువుగా గెలిచింది. అతను తీసుకున్న ఓ చెత్త నిర్ణయం సీఎస్‌కేకు వరంగా మారింది. మరి ఆ డుప్లెసిస్‌ ఏం చేశాడు? ఆర్సీబీ ఓటమికి ఎలా కారణం అయ్యాడో ఇప్పుడు చూద్దాం..

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు నిర్ణయించాడు. బ్యాటింగ్‌కు దిగి అగ్రెసివ్‌ ఇంటెంట్‌ చూపిస్తూ.. స్కోర్‌ బోర్డును పరిగెత్తించాడు. 23 బంతుల్లో 35 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు. ఆ వెంటవెంటనే ఆర్సీబీ మూడు వికెట్లు కోల్పోయింది. పాటిదార్‌, మ్యాక్స్‌వెల్‌ డకౌట్‌ అయ్యారు. వికెట్లు పడటంతో స్టోగా ఆడిన కోహ్లీ.. రహానె సూపర్‌ ఫీల్డింగ్‌కు పెవిలియన్‌ చేరాడు. ఆ వెంటనే బాగా ఆడుతున్న కామెరున్‌ గ్రీన్‌ కూడా అవుట్‌ అయ్యాడు. దీంతో ఆర్సీబీ 78 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అనుజ్‌ రావత్‌, దినేష్‌ కార్తీక్‌ అద్భుతమైన భాగస్వామ్యంతో ఆర్సీబీకి ఊపిరపోశాడు. 6 వికెట్లు 90కి పైగా పరుగులు జోడించారు. దీంతో 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి ఆర్సీబీ 173 పరుగులు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే.. 140కే పరిమితం అవుతుందనుకున్న ఆర్సీబీకి ఇది చాలా మంచి స్కోర్‌.

ఇక 174 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన సీఎస్‌కే ఓపెనర్లు రుతురాజ్‌, రచిన్‌ రవీంద్ర మంచి స్టార్‌ ఇచ్చారు. రుతురాజ్‌ 15 రన్స్‌ చేసి అవుటైనా.. రచిన్‌ 37 రన్స్‌తో రాణించాడు. ఆ తర్వాత వచ్చిన రహానే 19 బంతుల్లోనే 27 పరుగులు చేసి రాణించాడు. డారిల్‌ మిచెల్‌ కూడా 22 పరుగులు చేశాడు. అయితే.. 110 పరుగుల వద్ద సీఎస్‌కే 4వ వికెట్‌ కోల్పోయిన తర్వాత ఆర్సీబీ మ్యాచ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. ఎందుకంటే.. 13 ఓవర్లు ముగిసిన తర్వాత సీఎస్‌కే 114 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 7 ఓవర్లలో 60 పరుగులు కావాలి. ఆర్సీబీ యువ స్పిన్నర్‌ మయాంక్‌ డాగర్‌ను ఆడేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారు. అతనికి ఇంకా రెండు ఓవర్లు ఉన్నాయి.

అంతుకు ముందు వేసిన రెండు ఓవర్లలో డాగర్‌ కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివర్లో ఆ రెండు ఓవర్లు అతను వేసి ఉంటే సీఎస్‌కే కచ్చితంగా ఒత్తిడిలోకి వెళ్లేంది. కానీ, ఇక్కడే ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌ తన చెత్త కెప్టెన్సీని చూపించాడు. డాగర్‌ను పక్కనపెట్టేసి.. విచ్చలవిడిగా పరుగులు ఇస్తున్న సిరాజ్‌, అల్జారీ జోసెఫ్‌లతో చివరి ఓవర్లు వేయించి.. సీఎస్‌కే పని సులభం చేశాడు. డాగర్‌తో మరీ చివరి ఓవర్లు కాకపోయినా.. 16, 18వ ఓవర్లు వేయించి ఉండాల్సిందని ఆర్సీబీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డుప్లెసిస్‌ ఎందుకు డాగర్‌తో మరో రెండు ఓవర్లు వేయించలేదో అర్థం కావడం లేదని, ఇదో ఓటమికి కారణమైందని తలపట్టుకుంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.​