iDreamPost
android-app
ios-app

టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యంత బలమైన టీమ్‌ అదే: దిగ్గజ క్రికెటర్‌

  • Published May 28, 2024 | 10:43 AMUpdated May 28, 2024 | 1:26 PM

Eoin Morgan, Team India, T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు ఓ దిగ్గజ క్రికెటర్‌.. ఈ టోర్నీలో అత్యంత బలమైన టీమ్‌ ఏదో తేల్చిచెప్పేశాడు. వాళ్లే ఫేవరేట్స్‌గా ఉంటారని అన్నాడు. మరి ఆ టీమ్‌ ఏదో? అన్నది ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Eoin Morgan, Team India, T20 World Cup 2024: ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్‌ కప్‌ 2024కి ముందు ఓ దిగ్గజ క్రికెటర్‌.. ఈ టోర్నీలో అత్యంత బలమైన టీమ్‌ ఏదో తేల్చిచెప్పేశాడు. వాళ్లే ఫేవరేట్స్‌గా ఉంటారని అన్నాడు. మరి ఆ టీమ్‌ ఏదో? అన్నది ఎవరో ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published May 28, 2024 | 10:43 AMUpdated May 28, 2024 | 1:26 PM
టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యంత బలమైన టీమ్‌ అదే: దిగ్గజ క్రికెటర్‌

ధనాధన్‌ క్రికెట్‌ ఐపీఎల్‌ ముగిసింది. రెండున్నర నెలల పాటు క్రికెట్‌ అభిమానులను ఒక ఊపు ఊపేసిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌ ఆదివారంతో ముగిసిపోయింది. ఫైనల్లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచి.. కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ ఛాంపియన్‌గా నిలిచింది. ఐపీఎల్‌ హడావుడి తగ్గడంతో.. ఇప్పుడు అందరి ఫోకస్‌ టీ20 వరల్డ్‌ కప్‌ 2024 వైపు మళ్లింది. జూన్‌ 2 నుంచి వెస్టిండీస్‌, అమెరికా సంయుక్త వేదికగా ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కోసం ఇప్పటి భారత జట్టు అమెరికా చేరుకుంది. జూన్‌ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా తమ వరల్డ్‌ కప్‌ వేటను మొదలుపెట్టనుంది. అలాగే జూన్‌ 9న పాకిస్థాన్‌తో అసలు సిసలు పోరులో తలపడనుంది. ఈ విషయం అటుంచితే.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌లో అత్యంత బలమైన జట్టు, ఫేవరేట్‌ టీమ్‌ ఏదో ఓ దిగ్గజ క్రికెటర్‌ తేల్చిచెప్పేశాడు. ఆ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇంగ్లండ్‌ దిగ్గజ మాజీ క్రికెటర్‌ ఇయాన్‌ మోర్గాన్‌.. రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో స్ట్రాంగెస్ట్‌ టీమ్‌, తన ఫేవరేట్‌ టీమ్‌ ఏదో చెప్పేశాడు. బహుషా మోర్గాన్‌తో చాలా మంది క్రికెట్‌ అభిమానులు కూడా ఏకీభవించవచ్చు. మోర్గాన్‌ అభిప్రాయం ప్రకారం.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియానే అత్యంత బలంగా ఉందని, 15 మందితో కూడి స్క్వౌడ్‌ను పరిశీలిస్తే.. ఇండియానే అత్యంత స్ట్రాంగ్‌గా కనిపిస్తోందని అన్నాడు. అలాగే టీమిండియా తన టైటిల్‌ ఫేవరేట్‌ అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు మోర్గాన్‌. మాజీ క్రికెటర్‌గా, ఇంగ్లండ్‌కు వన్డే వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌గా మోర్గాన్‌కు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుంటే.. అతను అన్నట్లు.. టీమిండియా చాలా స్ట్రాంగ్‌గానే కనిపిస్తోంది.

రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో అమెరికా వెళ్లిన భారత జట్టును ఒకసారి పరిశీలిస్తే.. ఓపెనర్లు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ ప్రస్తుతం అంత మంచి ఫామ్‌లో లేకపోయినా.. ఒక్కసారి వరల్డ్‌ కప్‌ అనగానే నెక్ట్స్‌ లెవెల్‌ బ్యాటింగ్‌ చేసే ఎబిలిటీ ఉన్న ప్లేయర్లు. ఇక విరాట్‌ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్నాడు. అలాగే మిడిల్డార్‌లో పంత్‌, పాండ్యా, జడేజా రాణిస్తే.. టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ను అడ్డుకునే బౌలింగ్‌ లైనప్‌ ఏ టీమ్‌లో కూడా లేదు. ఇక బౌలింగ్‌లో ప్రధాన బలంగా ఉన్నాడు జస్ప్రీత్‌ బుమ్రా. అలాగే స్పిన్‌లో కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌ రూపంలో మంచి స్పిన్‌ ఎటాక్‌ ఉంది. బుమ్రాకు తోడు సిరాజ్‌, అర్షదీప్‌ కూడా తమ స్థాయి తగ్గట్లు బౌలింగ్‌ వేస్తే.. మోర్గాన్‌ అన్నట్లు టీమిండియా హాట్‌ ఫేవరేట్‌గా టోర్నీలో కొనసాగడం ఖాయం. మరి టీమిండియానే టైటిల్‌ ఫేవరేట్‌ అంటూ ఇయాన్‌ మోర్గాన్‌ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి