సచిన్ ఆల్​టైమ్​ రికార్డుకు ఎసరు పెట్టిన రూట్.. ఇది మామూలు ఘనత కాదు!

Joe Root Nears Sachin Tendulkar's Record: ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డుకు అతడు మరింత చేరువయ్యాడు.

Joe Root Nears Sachin Tendulkar's Record: ఇంగ్లండ్ టాప్ బ్యాటర్ జో రూట్ మరో అరుదైన ఘనత సాధించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డుకు అతడు మరింత చేరువయ్యాడు.

ప్రస్తుత క్రికెట్​లో బెస్ట్‌ బ్యాటర్ ఎవరంటే అందరూ ఠక్కున చెప్పే ఆన్సర్ విరాట్ కోహ్లీ. గత కొన్నేళ్లుగా టన్నుల కొద్దీ పరుగులు చేస్తూ, సెంచరీల మీద సెంచరీలు బాదుతూ ఎన్నో రికార్డులను కింగ్ అధిగమించడమే దీనికి కారణం. అయితే టెస్టుల్లో మాత్రం ఇంగ్లండ్ స్టార్ జో రూట్ హవా నడుస్తోంది. లాంగ్ ఫార్మాట్​లో దిగ్గజాల సరసన నిలిచేందుకు అతడు పరుగులు తీస్తున్నాడు. ఒక్కో మైల్​స్టోన్​ను బ్రేక్ చేస్తూ పోతున్నాడు. టెస్టుల్లో కన్​సిస్టెంట్స్​గా రన్స్ చేస్తూ ఎవరికీ అందని ఘనతల్ని సాధిస్తున్నాడు. ఇప్పుడు ఏకంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ ఆల్​టైమ్ రికార్డుపై అతడు కన్నేశాడు. ఒకవేళ ఇది గానీ సాధిస్తే అదిరిపోతుంది. ఇంతకీ ఏంటా రికార్డు? అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో హాఫ్ సెంచరీ బాదాడు రూట్. లాంగ్ ఫార్మాట్​లో అతడికి ఇది 65వ హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఇప్పటికే భారత దిగ్గజం రాహుల్ ద్రవిడ్ (63 హాఫ్ సెంచరీలు), ఆస్ట్రేలియా లెజెండ్ రికీ పాంటింగ్ (62 ఫిఫ్టీలు)ను అధిగమించిన రూట్.. ఇప్పుడు టాప్ ప్లేస్​పై కన్నేశాడు. ఈ లిస్ట్​లో సచిన్ టెండూల్కర్ (68 హాఫ్ సెంచరీలు), విండీస్ గ్రేట్ శివ్​నారాయణ్ చందర్​పాల్ (66 ఫిఫ్టీలు) టాప్-2లో ఉన్నారు. సెకండ్ పొజిషన్​లో ఉన్న చందర్​పాల్ 280 ఇన్నింగ్స్​ల్లో 66 ఫిఫ్టీలు కొట్టగా.. మూడో నంబర్​లో ఉన్న రూట్ 65 హాఫ్ సెంచరీల ఫీట్​ను చేరుకునేందుకు 263 ఇన్నింగ్స్​లు తీసుకున్నాడు. ఇంకో ఒకట్రెండు మ్యాచులతోనే అతడు మాస్టర్ బ్లాస్టర్ రికార్డును సమం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇక, లంకతో మ్యాచ్​లో 121 బంతులు ఎదుర్కొన్న రూట్ 81 పరుగులు చేశాడు. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటం, పిచ్ నుంచి బౌలర్లకు మద్దతు లభిస్తుండటంతో రూట్ ఆచితూచి బ్యాటింగ్ చేశాడు. ఒక్కో రన్ తీస్తూ స్కోరు బోర్డును కదిలించాడు. అడ్డగోలు షాట్స్ ఆడకుండా స్ట్రైక్ రొటేషన్​కు ఇంపార్టెన్స్ ఇచ్చాడు. అయితే ఇంకో ఎండ్ నుంచి అతడికి సహకారం లేకుండా పోయింది. ప్రస్తుతం రూట్​తో పాటు క్రిస్ వోక్స్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇంగ్లండ్ 5 వికెట్లకు 200 స్కోరుతో ఉంది. రూట్ ఎంత సేపు క్రీజులో ఉంటాడనే దాని మీదే ఇంగ్లండ్ భారీ స్కోరు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. లంక మాత్రం ఆతిథ్య జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేసి పైచేయి సాధించాలని చూస్తోంది. దీంతో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. మరి.. సచిన్ రికార్డును రూట్ ఎప్పటిలోగా బ్రేక్ చేస్తాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments