iDreamPost
android-app
ios-app

మా తప్పు వల్లే ఇంగ్లండ్ కు 2019 ప్రపంచ కప్.. అంపైర్ సంచలన కామెంట్స్!

  • Published Apr 02, 2024 | 7:54 PM Updated Updated Apr 02, 2024 | 7:54 PM

అందరూ బౌండరీల రూపంలో ఇంగ్లండ్ కు ప్రపంచ కప్ 2019 వచ్చిందని అనుకుంటున్నారు. కానీ అంపైర్లు చేసిన దారుణమైన తప్పు కారణంగా న్యూజిలాండ్ రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది. మరి అంపైర్లు చేసిన తప్పు ఏంటి? తెలుసుకుందాం పదండి.

అందరూ బౌండరీల రూపంలో ఇంగ్లండ్ కు ప్రపంచ కప్ 2019 వచ్చిందని అనుకుంటున్నారు. కానీ అంపైర్లు చేసిన దారుణమైన తప్పు కారణంగా న్యూజిలాండ్ రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది. మరి అంపైర్లు చేసిన తప్పు ఏంటి? తెలుసుకుందాం పదండి.

మా తప్పు వల్లే ఇంగ్లండ్ కు 2019 ప్రపంచ కప్.. అంపైర్ సంచలన కామెంట్స్!

వన్డే వరల్డ్ కప్ 2019 ఫైనల్ మ్యాచ్ ను క్రికెట్ లవర్స్ అంత ఈజీగా మర్చిపోరు. టైటిల్ పోరులో న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లండ్ జట్లు హోరాహోరిగా పోరాడాయి. కానీ చివరికి అదృష్టం మాత్రం బౌండరీల రూపంలో ఇంగ్లండ్ ను వరించింది. దాంతో వరల్డ్ కప్ 2019 ను ఇంగ్లీష్ ప్లేయర్లు ముద్దాడారు. అయితే అందరూ బౌండరీల రూపంలో వారికి ప్రపంచ కప్ వచ్చిందని అనుకుంటున్నారు. కానీ అంపైర్లు చేసిన దారుణమైన తప్పు కారణంగా న్యూజిలాండ్ రన్నరప్ గా నిలవాల్సి వచ్చింది. మరి అంపైర్లు చేసిన తప్పు ఏంటి? తెలుసుకుందాం పదండి.

2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్-న్యూజిలాండ్ జట్లు తలపడగా.. మెుదట మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో రూల్స్ ప్రకారం సూపర్ ఓవర్ ను నిర్వహించారు. కానీ సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమం కావడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం బౌండరీల సంఖ్య ఎక్కువగా ఉన్న జట్టును విజేతగా ప్రకటించారు. దీంతో ఇంగ్లండ్ ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఫైనల్ మ్యాచ్ లో తాము చేసిన తప్పు కారణంగానే ఇంగ్లండ్ కు వరల్డ్ కప్ వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు అంపైర్ మరియస్ ఎరాస్మస్. ఫైనల్లో చేసిన తప్పును చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే?

Umpire

చివరి 3 బంతుల్లో ఇంగ్లండ్ విజయానికి 9 పరుగులు అవసరం. ఈ క్రమంలో కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన ఫుల్ టాస్ బాల్ ను బెన్ స్టోక్స్ భారీ షాట్ ఆడాడు. ఆ బాల్ ను అందుకున్న గప్టిల్ ను త్రో విసిరాడు. అయితే అప్పటికే ఓ పరుగు పూర్తి చేసుకున్నారు స్టోక్స్-ఆదిల్ రషీద్. రెండో రన్ కోసం ప్రయత్నించే క్రమంలో బాల్ స్టోక్స్ బ్యాట్ కు తాకి బౌండరీ వెళ్లింది. దీంతో నిబంధనల ప్రకారం బౌండరీ వెళ్లిన 4 పరుగులతో పాటుగా వారు తీసిన రెండు పరుగులు కలిపి 6 రన్స్ ఇచ్చారు అంపైర్లు. కానీ ఇక్కడ అంపైర్లు పెద్ద తప్పు చేశారు. ఫీల్డర్ బాల్ విసిరే సమయానికి ఇద్దరు బ్యాటర్లు క్రీజ్ బయట ఉంటేనే ఆ రన్ కౌంట్ అవుతుంది. కానీ ఇక్కడ అది జరగలేదు. గప్టిల్ బాల్ విసిరే సమయానికి వారిద్దరు క్రీజ్ లోనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇద్దరు అంపైర్లు కూడా గమనించలేదు.

ఇదిలా ఉండగా.. ఫైనల్ తర్వాత రోజు ఉదయం తప్పు తెలుసుకున్న ఎరాస్మస్ అదే విషయాన్ని కుమార ధర్మసేనకు చెప్పాడు. ఇద్దరు అంపైర్లు తప్పు తెలుసుకున్నారు. కానీ ఏం లాభం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే.. అంటూ ఈ విషయం తెలిసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంపైర్లు తప్పు చేయకపోతే.. పాపం కివీస్ వరల్డ్ కప్ గెలిచేది కదా? అంటూ రాసుకొస్తున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత చెప్పడానికి కారణం ఏంటి? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మరి అంపైర్లు చేసిన ఈ ఘోర తప్పిదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: IPL 2024: ఇషాన్ కిషన్ కు వెరైటీ పనిష్మెంట్! వైరలవుతున్న వీడియో..