iDreamPost
android-app
ios-app

Moeen Ali: భారత టాప్‌ 5 ఆటగాళ్లను ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ మొయిన్‌ అలీ!

  • Published Jan 09, 2024 | 5:31 PM Updated Updated Jan 09, 2024 | 5:31 PM

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మెుయిన్ అలీ టీమిండియాకు చెందిన తన ఆల్ టైమ్ ఫేవరెట్ టాప్ 5 ప్లేయర్లను ప్రకటించాడు. మరి అలీ ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న ఆ టీమిండియా ప్లేయర్లు ఎవరు? ఆ వివరాలు..

ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మెుయిన్ అలీ టీమిండియాకు చెందిన తన ఆల్ టైమ్ ఫేవరెట్ టాప్ 5 ప్లేయర్లను ప్రకటించాడు. మరి అలీ ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న ఆ టీమిండియా ప్లేయర్లు ఎవరు? ఆ వివరాలు..

Moeen Ali: భారత టాప్‌ 5 ఆటగాళ్లను ప్రకటించిన ఇంగ్లండ్‌ స్టార్‌ ప్లేయర్‌ మొయిన్‌ అలీ!

ప్రపంచ క్రికెట్ లో ఎంతో మంది దిగ్గజ క్రికెటర్లు ఉన్నారు. కానీ అందులో కొందరు మాత్రమే అభిమానుల గుండెల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు. కాగా.. ప్రపంచ దేశాలకు చెందిన కొందరు ఆటగాళ్లు తమ ఆల్ టైమ్ ఫేవరెట్ ప్లేయర్ల లిస్ట్ ను ప్రకటిస్తూ ఉంటారు. టాప్ 5, టాప్ 10, ఏకైక ఫేవరెట్ ప్లేయర్ అంటూ కొంతమంది దిగ్గజాల పేర్లను వెళ్లడిస్తూ ఉంటారు. తాజాగా ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మెుయిన్ అలీ టీమిండియాకు చెందిన తన ఆల్ టైమ్ ఫేవరెట్ టాప్ 5 ప్లేయర్లను ప్రకటించాడు. మరి అలీ ఆల్ టైమ్ ఫేవరెట్ లిస్ట్ లో ఉన్న ఆ టీమిండియా ప్లేయర్లు ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఏ రంగంలోనై ఓ వ్యక్తికి తనకంటూ ఆల్ టైమ్ ఫేవరెట్ వ్యక్తులు ఉంటారు. కొందరు వారిని తమ రోల్ మోడల్ గా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా టీమిండియాకు చెందిన ఆ ఐదురుగు ప్లేయర్లు తన ఆల్ టైమ్ ఫేవరెట్ అంటూ చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ స్టార్ ఆల్ రౌండర్ మెుయిన్ అలీ. టాప్ 5లో వరుసగా ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండుల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్ లను తన ఆల్ టైమ్ ఇండియన్ ప్లేయర్లుగా ప్రకటించాడు. కాగా.. టీమిండియాకు 3 ఐసీసీ ట్రోఫీలను అందించిన ధోనికి లిస్ట్ లో అగ్రస్థానం కల్పించాడు అలీ.

మెుయిన్ అలీ ఐపీఎల్ లో ధోనితో పాటు చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే. దీంతో ధోనితో అలీకి మంచి బాండింగ్ ఏర్పడింది. ఇక టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీని తన ఫేవరెట్ లిస్ట్ లో రెండో స్థానం కల్పించాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్, విధ్వంసకర వీరుడు సెహ్వాగ్ తో పాటుగా 2011 వరల్డ్ కప్ హీరో యువరాజ్ సింగ్ ను తన ఆల్ టైమ్ ప్లేయర్లుగా ప్రకటించాడు ఈ ఇంగ్లాండ్ స్టార్. అయితే తన లిస్ట్ లో దిగ్గజ ప్లేయర్లు అయిన కపిల్ దేవ్ లాంటి ఆటగాళ్లతో పాటు ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మను పేవరెట్ లిస్ట్ లోకి తీసుకోకపోవడం అందరిని ఆశ్చర్యపరిచిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి మెుయిన్ అలీ టాప్ 5 లిస్ట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.