SNP
భారత్‌తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓ భారీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగనుంది. ఇప్పటికే వారి వద్ద బజ్‌బాల్ అనే ఒక మంత్రం ఉంది. అది కాకుండా మరో ప్లాన్‌తో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
భారత్‌తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ ఓ భారీ మాస్టర్ ప్లాన్‌తో బరిలోకి దిగనుంది. ఇప్పటికే వారి వద్ద బజ్‌బాల్ అనే ఒక మంత్రం ఉంది. అది కాకుండా మరో ప్లాన్‌తో ఇంగ్లండ్ బరిలోకి దిగనుంది. అందేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో గురువారం నుంచి భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్ ఆడేందుకు భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లీష్ జట్టు.. ఎలాగైనా ఇండియాను ఇండియాలో ఓడించి సత్తా చాటాలని భావిస్తోంది. పైగా ఈ సిరీస్ విజయంతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ 2025 పాయింట్ల పట్టికలో కూడా తమ స్థానాన్ని మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది బెన్ స్టోక్స్ సేన. దీని కోసం.. భారీ ప్లాన్స్‌తోనే బరిలోకి దిగబోతుంది. ఇప్పటికే ఇంగ్లండ్ వద్ద బజ్‌బాల్ అనే అస్త్రం ఉంది. చాలా దేశాలపై ఈ ఆయుధాన్ని వాడి ఇంగ్లండ్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఇండియాపై కూడా ఇదే స్ట్రాటజీ వాడి గెలుస్తామని ధీమా ఉంది.
అయితే.. ఇండియాని ఇండియాలో ఓడించాలంటే.. కేవలం బజ్‌బాల్ ఒక్కటే సరిపోదని కూడా ఇంగ్లండ్‌కు బాగా తెలుసు. పైగా బజ్‌బాల్ కనుక మిస్ ఫైర్ అయితే.. అది తమకే దెబ్బకొడుతుందని కూడా ఇంగ్లండ్‌కు బాగా తెలుసు. రోహిత్ శర్మ కెప్టెన్సీలోని యంగ్ టీమిండియా సైతం బజ్‌బాల్ క్రికెట్‌ను తమ కంటే బాగా ఆడగలదనే విషయం ఇంగ్లండ్‌కు తెలియంది కాదు. సో.. ఒక్క బజ్‌బాల్ స్ట్రాటజీతోనే పటిష్టమైన ఇండియాను ఓడించేందుకు వీలు పడదని గ్రహించిన ఇంగ్లండ్.. బజ్‌బాల్‌కు తోడు మరో మాస్టర్ ప్టాన్‌ను సిద్ధం చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
ఇండియాలో పిచ్‌లు స్పిన్‌కు అనుకూలంగా ఉంటాయనే విషయం తెలిసిందే. భారత గడ్డపై మ్యాచ్‌లు గెలవాలంటే.. స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొవడమే కాదు, టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను స్పిన్ బౌలింగ్‌తో ఇబ్బంది పెట్టాలి. ఇదే మంత్రాన్ని ఇప్పుడు ఇంగ్లండ్ కూడా ఫాలో అయినట్లు కనిపిస్తోంది. గురువారం ప్రారంభం కానున్న తొలి టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించింది. ఈ జట్టులో ఏకంగా ముగ్గురు స్పిన్నర్లను తీసుకుంది. స్పిన్ మంత్రం తోనే ఇండియా పని పట్టాలని ఇంగ్లండ్ భావిస్తోంది. అయితే.. ఎవరూ ఊహించని విధంగా ఆ జట్టు సీనియర్ స్టార్ బౌలర్ జెమ్స్ అండర్సన్‌ను సైతం పక్కనపెట్టిన ఇంగ్లండ్.. ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతుంది. మరి ఈ ముగ్గురు స్పిన్నర్ల ప్లాన్ ఇండియాపై వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి. మరి ఇండియాను ఓడించేందుకు ఇంగ్లండ్ వేసిన ప్లాన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇంగ్లండ్ ప్లేయింగ్ ఎలెవన్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జాక్ లీచ్.
Here is the England’s playing 11 for the 1st Test against India!#INDvENG #ENGvIND #TeamIndia #IndianTeam #BenStokes #England #RohitSharma #CricketBook pic.twitter.com/Gx7kla6HKL
— Cricket Book (@cricketbook_) January 24, 2024