iDreamPost

IND vs ENG: మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ 11 ఇదే! డేంజర్‌ ప్లేయర్‌ ఇన్‌

  • Published Feb 14, 2024 | 3:28 PMUpdated Feb 14, 2024 | 3:28 PM

తొలి రెండు టెస్టుల్లో చెరొకటి గెలిచి సమవుజ్జీలుగా ఉన్న ఇండియా-ఇంగ్లండ్‌ మూడో టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీగా ఉన్నాయి. మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. మరి టీమ్‌ ఎలా ఉంది? ఎలాంటి మార్పులు చేశారో ఇప్పుడు చూద్దాం..

తొలి రెండు టెస్టుల్లో చెరొకటి గెలిచి సమవుజ్జీలుగా ఉన్న ఇండియా-ఇంగ్లండ్‌ మూడో టెస్టులో అమీతుమీ తేల్చుకునేందుకు రెడీగా ఉన్నాయి. మూడో టెస్ట్‌ కోసం ఇంగ్లండ్‌ తన ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. మరి టీమ్‌ ఎలా ఉంది? ఎలాంటి మార్పులు చేశారో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 14, 2024 | 3:28 PMUpdated Feb 14, 2024 | 3:28 PM
IND vs ENG: మూడో టెస్ట్‌కు ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ 11 ఇదే! డేంజర్‌ ప్లేయర్‌ ఇన్‌

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. మూడో టెస్ట్‌ రాజ్‌కోట్‌ వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరుజట్లు సంసిద్ధంగా ఉన్నాయి. గెలుపే లక్ష్యంగా ఇండియా-ఇంగ్లండ్‌ బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ముగిసిన తొలి రెండు టెస్టుల్లో చెరో విజయంతో ఇరు జట్లు సమవుజ్జీలుగా ఉన్నాయి. ఇప్పుడు మూడో టెస్టులో ఎలాగైనా గెలిచి.. లీడ్‌ను పెంచుకోవాలని గట్టి పట్టుదలతో ఢీ కొంటున్నాయి. అయితే.. మూడో టెస్టు కోసం ఇంగ్లండ్‌ ఇప్పటికే తమ ప్లేయింగ్‌ ఎలెవన్‌ను ప్రకటించింది. దాదాపు రెండో టెస్ట్‌ ఆడిన జట్టుతోనే బరిలోకి దిగుతున్న ఇంగ్లండ్‌.. ప్లేయింగ్‌ ఎలెవన్‌లో ఒక్క మార్పు మాత్రమే చేసింది.

హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్ట్‌లో ఘన విజయం సాధించిన ఇంగ్లండ్‌, విశాఖపట్నం వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది. అయితే.. మళ్లీ పుంజుకుని ఎలాగైన మూడో టెస్ట్‌లో విజయం సాధించాలని బెన్‌ స్టోక్స్‌ సేన భావిస్తోంది. అందుకోసం జట్టులో ఒక కీలకమైన మార్పు చేసుకొని బరిలోకి దిగుతుంది. రెండో టెస్ట్‌ ఆడిన యువ స్పిన్నర్‌ షోయబ్‌ బషీర్‌ స్థానంలో స్టార్‌ బౌలర్‌ మార్క్‌ వుడ్‌ను బరిలోకి దింపుతోంది. తొలి మ్యాచ్‌లో మార్క్‌ వుడ్‌ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. కానీ హైదరాబాద్‌లోని ఉప్పల్‌ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలించడంతో వుడ్‌ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. దీంతో రెండు టెస్ట్‌కు సీనియర్‌ పేసర్‌ అండర్సన్‌ను దింపి, వుడ్‌ను పక్కనపెట్టారు.

కానీ, రాజ్‌కోట్‌ పిచ్‌ నుంచి పేసర్లకు కాస్త మద్దతు ఉంటుందనే అంచనాతో ఈ సారి ఇద్దరు పేసర్లను బరిలోకి దింపుతున్నారు. కాగా, రాజ్‌కోట్‌ పిచ్‌పై మార్క్‌ వుడ్‌ డేంజరస్‌గా మారే ప్రమాదం ఉందని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా రాజ్‌కోట్‌ పిచ్‌ ఫ్లాట్‌గా ఉంది. బ్యాటర్లతో పాటు పేస్‌ బౌలర్లకు పిచ్‌ నుంచి బద్దతు ఉంటుందని సమాచారం. ఇక ఇంగ్లండ్‌ ప్లేయింగ్‌ను ఒకసారి చూస్తే.. జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఒల్లీ పోప్, జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), బెన్ ఫోక్స్, రెహాన్ అహ్మద్, టామ్ హార్ట్లీ, మార్క్ వుడ్, జేమ్స్ అండర్సన్ ఉన్నారు. మరి ఈ ప్లేయింగ్‌తో పాటు, యువ స్పిన్నర్‌ బషీర్‌ను కాదని మార్క్‌ వుడ్‌ను తీసుకున్న ఇంగ్లండ్‌ స్ట్రాటజీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి