iDreamPost

ఇండియాను కాదని పాక్ ను నమ్మిన ఇంగ్లండ్.. భారీ మూల్యం చెల్లించుకుంటోంది!

ఇండియాను కాదని పాకిస్తాన్ ను నమ్మిన ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు నట్టేట మునిగింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ చేసిన తెలివితక్కువ పనికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇంగ్లండ్ చేసిన తప్పేంటి? ఆ వివరాలు..

ఇండియాను కాదని పాకిస్తాన్ ను నమ్మిన ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు నట్టేట మునిగింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ చేసిన తెలివితక్కువ పనికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. ఇంగ్లండ్ చేసిన తప్పేంటి? ఆ వివరాలు..

ఇండియాను కాదని పాక్ ను నమ్మిన ఇంగ్లండ్.. భారీ మూల్యం చెల్లించుకుంటోంది!

క్రికెట్ లవర్స్ ను ఉర్రూతలూగించడానికి మరో మహా సంగ్రామం రెడీగా ఉంది. వెస్టిండీస్, అమెరికా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్ జూన్ 2 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఈ పొట్టి కప్ కోసం 20 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఇండియాను కాదని పాకిస్తాన్ ను నమ్మిన ఇంగ్లండ్ జట్టు ఇప్పుడు నట్టేట మునిగింది. ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ చేసిన తెలివితక్కువ పనికి ఇప్పుడు భారీ మూల్యం చెల్లించుకుంటోంది. మరి భారత్ ను కాదని, పాక్ ను నమ్మి ఇంగ్లండ్ చేసిన తప్పేంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

టీ20 వరల్డ్ కప్ కోసం అన్ని దేశాలు కొన్ని నెలల ముందు నుంచే ప్లాన్స్ సిద్దం చేసుకున్నాయి. అందులో భాగంగానే తమ ఆటగాళ్లకు ప్రాక్టీస్ ఉండాలని ఐపీఎల్ కు పంపించాయి. వరల్డ్ కప్ ముందు ఐపీఎల్ సరైన సాధన అని ఆ టీమ్స్ భావించాయి. ఇందుకోసం గాయాలు పాలైన ప్లేయర్లను మినహాయించి మిగతావారిని ఈ మెగాటోర్నీలో  ఆడించాయి. అయితే ఐపీఎల్ చివరి దశకు వచ్చేసరికి కొన్ని దేశాలు యూటర్న్ తీసుకుని తమ ఆటగాళ్లను రప్పించుకున్నాయి. అందులో ఇంగ్లండ్ కూడా ఒకటి.

పాకిస్తాన్ తో టీ20 సిరీస్ ఉన్న నేపథ్యంలో తమ ప్లేయర్లను ఇంగ్లండ్ రావాలని ఆదేశాలు జారీ చేసింది. దాంతో ఆటగాళ్లు చేసేది ఏమీ లేక టోర్నీ మధ్యలోనే ఇంగ్లండ్ కు బయలుదేరారు. అయితే ప్లే ఆఫ్స్ కు చేరిన టీమ్స్ లో ఉన్న ప్లేయర్లను భారత్ లోనే ఉంచాలని ఆ దేశ మాజీలు సూచించినప్పటికీ.. బోర్డ్ పట్టించుకోలేదు. ఇండియాను కాదని పాకిస్తాన్ నమ్మి.. వరల్డ్ కప్ ముందు మంచి ప్రాక్టీస్ దొరుకుతుందని భావించిన బ్రిటీష్ టీమ్ కు భారీ షాక్ తగిలింది. నాలుగు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో రెండు మ్యాచ్ లు వర్షార్పణం అయ్యాయి. ఒక మ్యాచ్ లో ఇంగ్లండ్ విజయం సాధించగా.. చివరి మ్యాచ్ కు కూడా వర్షం ముప్పు ఉందని సమాచారం. దీంతో ఇంగ్లండ్ ఆటగాళ్లకు తగినంత ప్రాక్టీస్ లభించడం లేదు. దాంతో వరల్డ్ కప్ ముందు ఇలాంటి సమస్య ఎదురౌతుందని బ్రిటీష్ టీమ్ ఊహించి ఉండదు. ఆటగాళ్లకు ప్రాక్టీస్ లేకపోతే.. ఆ ప్రభావం వరల్డ్ కప్ పై పడే అవకాశాలు లేకపోలేదు. దాంతో పాక్ ను నమ్మి.. ఇంగ్లండ్ టీమ్ నట్టేట మునిగింది అంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి