iDreamPost
android-app
ios-app

సొంతగడ్డపై పాక్‌ పరువుతీసిన ఇంగ్లండ్‌! టెస్ట్‌ క్రికెట్‌లోనే సరికొత్త చరిత్ర సృష్టించారు

  • Published Oct 11, 2024 | 5:27 PM Updated Updated Oct 11, 2024 | 5:27 PM

ENG vs BAN, Multan, Cricket News: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఓ అరుదైన విజయాన్ని నమోదు చేసింది ఇంగ్లండ్‌. పాక్‌ను చిత్తుగా ఓడించి.. ఒక కొత్త హిస్టరీని లిఖించింది. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ENG vs BAN, Multan, Cricket News: టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలోనే ఓ అరుదైన విజయాన్ని నమోదు చేసింది ఇంగ్లండ్‌. పాక్‌ను చిత్తుగా ఓడించి.. ఒక కొత్త హిస్టరీని లిఖించింది. మరి ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Oct 11, 2024 | 5:27 PMUpdated Oct 11, 2024 | 5:27 PM
సొంతగడ్డపై పాక్‌ పరువుతీసిన ఇంగ్లండ్‌! టెస్ట్‌ క్రికెట్‌లోనే సరికొత్త చరిత్ర సృష్టించారు

పాక్‌ గడ్డపై ఇంగ్లండ్‌ ఒక కొత్త చరిత్రను లిఖించింది. కుర్రాడు హ్యారీ బ్రూక్‌ ట్రిపుల్‌ సెంచరీతో, సీనియర్‌ స్టార్‌ జో రూట్‌ డబుల్‌ సెంచరీతో విధ్వంకర బ్యాటింగ్‌ చేసి.. ఈ కొత్త హిస్టరీని క్రియేట్‌ చేశారు. ముల్తాన్‌ వేదికగా అక్టోబర్‌ 7న ప్రారంభమైన టెస్ట్‌లో ఇంగ్లండ్‌ ఘన విజయం సాధించింది. ఏకంగా ఇన్నింగ్స్‌ 47 పరుగుల తేడాతో గెలిచింది. ఇది మామూలు గెలుపు కాదు.. క్రికెట్‌ చరిత్రలోనే ఓ టీమ్‌ గెలవడం ఇదే మొదటి సారి. ప్రత్యర్థి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 500లకు పైగా పరుగులు చేసిన తర్వాత.. ఆ టీమ్‌ను ఏకంగా ఇన్నింగ్స్‌ తేడాతో ఓడించడం అనేది క్రికెట్‌ హిస్టరీలో ఫస్ట్‌ టైమ్‌ జరిగింది.

ఈ టెస్ట్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 556 పరుగుల భారీ స్కోర్‌ చేసి ఆలౌట్‌ అయింది. ఓపెనర్‌ అబ్దుల్‌ షఫీఖ్‌ 102, కెప్టెన్‌ షాన్‌ మసూద్‌ 151, అఘా సల్మాన్‌ 104, సౌద్‌ షకీల్‌ 82 పరుగులతో రాణించడంతో పాక్‌ భారీ స్కోర్‌ నమోదు చేసింది. కానీ, అసలు ఆట ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు వచ్చిన తర్వాత మొదలైంది. పాక్‌ను వాళ్ల సొంత గడ్డపై ఇంగ్లండ్‌ బ్యాటర్లు ఊచకోత కోశారు. ముఖ్యంగా జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ అయితే.. పరుగుల వరద పారించారు. రూట్‌ 262, బ్రూక్‌ 317 పరుగులతో పండగ చేసుకున్నారు. వీరితో పాటు ఓపెనర్‌ జాక్‌ క్రాలే 78, బెన్‌ డకెట్‌ 84 పరుగులతో రాణించడంతో ఇంగ్లండ్‌ 150 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 823 పరుగుల అతి భారీ స్కోర్‌ చేసి.. ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఇంగ్లండ్‌ బ్యాటర్ల దెబ్బకి.. పాకిస్థాన్‌ టీమ్‌లో ఏడుగురు బౌలర్లు బౌలింగ్‌ వేస్తే.. అందులో ఆరుగురు ఏకంగా వందకు పైగా పరుగులు సమర్పించుకున్నారు. షాహీన్‌ అఫ్రిదీ 120, నసీమ్‌ షా 157, అబ్రార్‌ అహ్మద్‌ 174, అమిర్‌ జమాల్‌ 126, అఘా సల్మాన్‌ 118, సైమ్‌ అ‍య్యూబ్‌ 101 పరుగులు ఇచ్చారు. ఇక ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ చూసి పాకిస్థాన్‌కు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాంక్‌ అయినట్లు ఉంది. అందుకే సెకండ్‌ ఇన్నింగ్స్‌లో కేవలం 220 పరుగులకే కుప్పకూలింది. అఘా సల్మాన్‌ 63, అమిర్‌ జమాల్‌ 55 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌ అయితే.. ఈ మ్యాచ్‌లో దారుణంగా విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో 30, రెండో ఇన్నింగ్స్‌లో 5 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్‌ బౌలర్లలో జాక్‌ లీచ్‌ 4 వికెట్లతో సత్తా చాటాడు. మొత్తంగా ఈ టెస్ట్‌ విజయంతో ఇంగ్లండ్‌ టెస్ట్‌ క్రికెట్‌ హిస్టరీలోనే ఒక అరుదైన రికార్డును అందుకుంది. మరి ఈ రికార్డుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.