Somesekhar
ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. మూడో టెస్ట్ లో అసలైన ఆట చూపిస్తామని ప్రగల్బాలు పలికాడు.
ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. మూడో టెస్ట్ లో అసలైన ఆట చూపిస్తామని ప్రగల్బాలు పలికాడు.
Somesekhar
ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో టీమిండియా-ఇంగ్లాండ్ జట్లు సమంగా నిలిచాయి. తొలి మ్యాచ్ లో పర్యటక జట్టు విజయం సాధిస్తే.. రెండో టెస్ట్ లో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది భారత జట్టు. విశాఖ వేదికగా జరిగిన ఈ పోరులో 106 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక కీలకమైన మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్ కోట్ వేదికగా జరగబోతోంది. దీంతో రెండు జట్లు తమ ప్రణాళికలను సిద్ధం చేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో ఇంగ్లాండ్ కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఇండియాకు వార్నింగ్ ఇచ్చాడు. మూడో టెస్ట్ లో అసలైన ఆట చూపిస్తామని ప్రగల్బాలు పలికాడు.
బజ్ బాల్ స్ట్రాటజీతో ప్రపంచ క్రికెట్ ను ఒక్కసారిగా తమవైపు తిప్పుకుంది ఇంగ్లాండ్ జట్టు. అయితే అదే స్ట్రాటజీని ఇండియాపై కూడా కొనసాగిస్తామని సిరీస్ ఆరంభానికి ముందే పలికింది. తొలి మ్యాచ్ లో విజయం సాధించినప్పటికీ.. రెండో మ్యాచ్ కు వచ్చే సరికి వారి సిద్దాంతం దెబ్బ కొట్టింది. టీమిండియా సైతం అటాకింగ్ ఆటతో వారికి షాకిచ్చింది. ఇక రెండో టెస్ట్ లో ఓడిపోయిన ఇంగ్లాండ్ దుబాయ్ కు పయణమైంది. అక్కడ ఐసీసీ ఏర్పాటు చేసిన అకాడమీ పిచ్ లో ప్రాక్టీస్ చేయనుంది. ఈ నేపథ్యంలో కోచ్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక విధంగా అది ఇండియాకు స్వీట్ వార్నింగ్ అనే చెప్పాలి.
“ఈ ఓటమి నుంచి మేం చాలా నేర్చుకోవాలి. టీమిండియా ఆటగాళ్లు అద్భుతంగా రాణించారు. ఈ మ్యాచ్ లో మా ప్లేయర్లు కొన్ని తప్పిదాలు చేశారు. అయితే వాటిని సరిదిద్దుకుని మూడో టెస్ట్ కు సిద్దం అవ్వడమే మా ముందుంది. తదుపరి మ్యాచ్ కు ఇంకా గట్టిగా రెడీ అవుతున్నాం. మా అసలైన ఆట ఏంటో చూపిస్తాం. ఇండియాను బలంగా ఢీ కొట్టడానికి ప్లాన్స్ రెడీ చేస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చాడు మెక్ కల్లమ్. ఇక ఈ కామెంట్స్ పై టీమిండియా ఫ్యాన్స్ జోకులు పేలుస్తున్నారు. ఓడినా గానీ మీకు పొగరు తగ్గలేదంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గాయం నుంచి కోలుకున్న టీమిండియా స్టార్ బ్యాటర్ మూడో టెస్ట్ కు అందుబాటులోకి రానున్నాడు. మరి మెక్ కల్లమ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Brendon McCullum said, “England will go hard at India in the 3rd Test”. (Telegraph). pic.twitter.com/0tEa0sVgLv
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 6, 2024
ఇదికూడా చదవండి: U19 Cricket World Cup: చరిత్ర సృష్టించిన అండర్-19 టీమ్.. వరల్డ్ కప్ సెమీస్లో ఘన విజయం