టీ20 వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్.. ఇంగ్లండ్ బౌలర్ సంచలన రికార్డ్!

టీ20 వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఇప్పటికే ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ రెండుసార్లు హ్యాట్రిక్స్ సాధించగా.. తాజాగా ఇంగ్లండ్ బౌలర్ హ్యాట్రిక్ తో అదరగొట్టాడు.

టీ20 వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్ నమోదు అయ్యింది. ఇప్పటికే ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ రెండుసార్లు హ్యాట్రిక్స్ సాధించగా.. తాజాగా ఇంగ్లండ్ బౌలర్ హ్యాట్రిక్ తో అదరగొట్టాడు.

ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ లో బౌలర్లు దుమ్మురేపుతున్నారు. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తూ.. హ్యాట్రిక్ ల మీద హ్యాట్రిక్ లు తీస్తున్నారు. ఈ మెగా టోర్నీలో ఒకే ఒక్కరోజు రెండు హ్యాట్రిక్ లు నమోదు అయ్యాయి. ఉదయం ఆఫ్గానిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఆసీస్ బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ హ్యాట్రిక్ సాధించగా.. రాత్రి జరిగిన మ్యాచ్ లో అమెరికాపై హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ జోర్డాన్. ఈ క్రమంలోనే పలు రికార్డులు క్రియేట్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టీ20 వరల్డ్ కప్ లో మరో హ్యాట్రిక్ నమోదు అయ్యింది. అమెరికా ప్లేయర్లను ఓ ఆటాడుకున్న ఇంగ్లండ్ పేసర్ క్రిస్ జోర్డాన్ ఒకే ఓవర్లో ఏకంగా 4 వికెట్లు తీశాడు. అందులో హ్యాట్రిక్ కూడా ఉంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన అమెరికాకు తొలి ఓవర్లోనే షాకిచ్చాడు టోప్లే. ఓపెనర్ ఆండ్రీస్ గౌస్(8)ను ఔట్ చేసి ఇంగ్లండ్ కు బ్రేక్ ఇచ్చాడు. ఈ క్రమంలో వన్ డౌన్ లో బ్యాటింగ్ కు వచ్చిన నితీశ్(30)తో కలిసి స్టీవ్ టేలర్(12) ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి 48 పరుగులు చేసింది అమెరికా.

అయితే పవర్ ప్లే అనంతరం గొప్పగా పుంజుకున్న ఇంగ్లండ్ బౌలర్లు చకచకా వికెట్లు తీయడంతో.. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. టేలర్ ను కర్రన్ ఔట్ చేయగా.. నితీశ్, ఆరోన్ జోన్స్(10)లను ఆదిల్ రషీద్ వెనక్కి పంపాడు. ఈ దశలో కోరీ అండర్సన్(29)తో కలిసిన హర్మీత్ సింగ్(21) క్రీజ్ లో నిలబడి పరుగులు రాబట్టారు. దాంతో అమెరికా 115/5 స్కోర్ తో మెరుగైన స్థితిలో ఉన్నట్లు కనిపించింది. కానీ 18వ ఓవర్ వచ్చే సరికి కథ పూర్తిగా మారిపోయింది. ఈ ఓవర్ వేయడానికి వచ్చిన క్రిస్ జోర్డాన్.. తొలి బంతికి అండర్సన్ ను ఔట్ చేశాడు. ఆ తర్వాత బంతికి పరుగులు ఏమీ ఇవ్వలేదు. ఇక నెక్ట్స్ బంతుల్లో వరుసగా.. అలీఖాన్, కెంజిగే, నేత్రావల్కర్ లను హ్యాట్రిక్ ద్వారా పెవిలియన్ కు పంపాడు.

దాంతో 115 పరుగుల వద్దే అమెరికా ఇన్నింగ్స్ ముగిసింది. యూఎస్ఏ తన చివరి 5 వికెట్లను 6 బంతుల వ్యవధిలో కోల్పోయింది. ఇక హ్యాట్రిక్ సాధించిన జోర్డాన్ పలు రికార్డులు క్రియేట్ చేశాడు. ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి బౌలర్ గా నిలిచాడు. ఇక ఈ టోర్నీలో హ్యాట్రిక్ తీసిన రెండో బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. కాగా.. 116 పరుగుల స్వల్ప టార్గెట్ ను ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా.. 9.4 ఓవర్లలోనే దంచికొట్టింది. కెప్టెన్ జోస్ బట్లర్ 38 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్సులతో 83 నాటౌట్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఓపెనర్ ఫిలిప్ సాల్ట్(25*) రన్స్ తో రాణించాడు. మరి సంచలన బౌలింగ్ తో హ్యాట్రిక్ సాధించిన ఇంగ్లండ్ బౌలర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments