Nidhan
ఇంగ్లండ్ తమ టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించింది. విధ్వంసకారులంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంగ్లీష్ స్క్వాడ్.
ఇంగ్లండ్ తమ టీ20 వరల్డ్ కప్ టీమ్‌ను ప్రకటించింది. విధ్వంసకారులంతా ఒకే చోట చేరితే ఎలా ఉంటుందో అలా ఉంది ఇంగ్లీష్ స్క్వాడ్.
Nidhan
ఐపీఎల్ సెకండాఫ్ జోరుగా సాగుతోంది. ప్లేఆఫ్స్‌కు టైమ్ దగ్గర పడుతుండటంతో అందరూ ఈ మ్యాచ్‌లపై ఫోకస్ చేస్తున్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ హడావుడి నడుస్తున్న టైమ్‌లోనే మరోవైపు టీ20 వరల్డ్ కప్-2024 గురించి కూడా చర్చలు మొదలయ్యాయి. పొట్టి ప్రపంచ కప్ స్టార్ట్ అవడానికి ఇంకో నెల రోజుల వ్యవధి కూడా లేదు. దీంతో ఒక్కో దేశం తమ వరల్డ్ కప్ స్క్వాడ్స్ ప్రకటిస్తున్నాయి. నిన్న న్యూజిలాండ్, ఇవాళ సౌతాఫ్రికా తమ టీమ్స్ గురించి అనౌన్స్మెంట్ చేయగా.. ఇప్పుడు ఇంగ్లీష్ జట్టు వంతు వచ్చింది. 15 మందితో కూడిన తమ వరల్డ్ కప్ స్క్వాడ్‌ను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. జాస్ బట్లర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ టీమ్‌లో ఇంకా ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
బట్లర్‌తో పాటు ఇంగ్లండ్ బ్యాటింగ్ యూనిట్లో సాల్ట్, విల్ జాక్స్, జానీ బెయిర్‌స్టో, బ్రూక్, లియామ్ లివింగ్స్టన్, బెన్ డకెట్ కీలకం కానున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా మొయిన్ అలీ, పేస్ ఆల్‌రౌండర్‌గా సామ్ కర్రన్‌ను ఇంగ్లీష్ సెలెక్టర్లు ఎంపిక చేశారు. పేస్ బాధ్యతల్ని జోఫ్రా ఆర్చర్, జోర్డాన్, మార్క్ వుడ్, రీస్ టోప్లే పంచుకుంటారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అదిల్ రషీద్‌ను సెలెక్ట్ చేశారు. అయితే సరిగ్గా గమనిస్తే విధ్వంసకారులంతా ఒకే చోట ఉంటే ఎలా ఉంటుందో ఇంగ్లండ్ స్క్వాడ్ అలాగే ఉందని చెప్పొచ్చు. బట్లర్ దగ్గర నుంచి సాల్ట్, విల్ జాక్స్, బెయిర్‌స్టో, లివింగ్స్టన్ వరకు అందరూ బ్యాటింగ్‌లో చిచ్చరపిడుగులే.
ఏ టీమ్‌లో లేని రీతిలో ఇంగ్లండ్ జట్టులో ఆల్‌రౌండర్లు ఎక్కువ. దాదాపుగా అందరూ బ్యాట్‌తో కనీసం పరుగులు చేయగలిగేవారే. అవసరమైన టైమ్‌లో బ్యాట్ ఝళిపించే సత్తా ఆ టీమ్‌లోని పేసర్లు, స్పిన్నర్లకు ఉంది. మొయిన్ అలీ, సామ్ కర్రన్, మార్క్ వుడ్, ఆదిల్ రషీద్ అటు బంతితో మెరుస్తూనే బ్యాట్‌తో విలువైన పరుగుల్ని స్కోరు బోర్డుకు జోడించగలరు. కర్రన్, అలీ ఫామ్‌లో ఉంటే మ్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో మార్చేస్తారు. లివింగ్స్టన్, విల్ జాక్స్ లాంటి బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌తో టీమ్‌కు అవసరమైనప్పుడు బ్రేక్ త్రూలు అందించడంలో సిద్ధహస్తులు. టోటల్‌గా బట్లర్ సేన చాలా దుర్భేద్యంగా ఉంది. ప్రధాన పేసర్ ఆర్చర్ కరెక్ట్ టైమ్‌కు ఫిట్‌గా మారడం జట్టుకు అదనపు బలమనే చెప్పాలి. జాక్స్, బట్లర్, ఆర్చర్, కర్రన్.. ఈ నలుగురు సరిగ్గా ఆడితే ఆ టీమ్‌ను ఆపడం ఎవరి వల్లా కాదు. మరి.. ఇంగ్లండ్ వరల్డ్ కప్ టీమ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
England Provisional T20 World Cup squad:
Buttler (c), Salt, Jacks, Bairstow, Brook, Livingstone, Moeen Ali, Sam Curran, Archer, Jordan, Wood, Topley, Adil Rashid, Hartley, Duckett pic.twitter.com/J4X7J8QGEJ
— Johns. (@CricCrazyJohns) April 30, 2024