iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ముందు.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ పై నిషేధం! కారణం ఏంటంటే?

  • Published Jun 01, 2024 | 3:47 PM Updated Updated Jun 01, 2024 | 3:47 PM

ఇంగ్లండ్ కు చెందిన  ఓ ఫాస్ట్ బౌలర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ నిషేధం విధించింది. అండర్సన్ తర్వాత ఆ ప్లేస్ కు వస్తాడు అనుకున్న ఈ బౌలర్ ఇలా అనూహ్యంగా సస్పెండ్ కావడంతో క్రీడాభిమానులు షాక్ కు గురౌతున్నారు.

ఇంగ్లండ్ కు చెందిన  ఓ ఫాస్ట్ బౌలర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ నిషేధం విధించింది. అండర్సన్ తర్వాత ఆ ప్లేస్ కు వస్తాడు అనుకున్న ఈ బౌలర్ ఇలా అనూహ్యంగా సస్పెండ్ కావడంతో క్రీడాభిమానులు షాక్ కు గురౌతున్నారు.

వరల్డ్ కప్ ముందు.. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ పై నిషేధం! కారణం ఏంటంటే?

సాధారణంగా ఆటగాళ్లు నిబంధనలు ఉల్లంఘిస్తే కొరడా ఝళిపిస్తాయి ఐసీసీ, ఆ దేశ క్రికెట్ బోర్డ్ లు. డోప్ టెస్టుల్లో పట్టుబడినా, నిబంధనలు ఉల్లంఘించి.. మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డా ప్లేయర్లను జీవిత కాలం లేదా కొన్ని నెలలు సస్పెండ్ చేస్తాయి. తాజాగా ఇంగ్లండ్ కు చెందిన  ఓ ఫాస్ట్ బౌలర్ పై ఆ దేశ క్రికెట్ బోర్డ్ నిషేధం విధించింది. అండర్సన్ తర్వాత ఆ ప్లేస్ కు వస్తాడు అనుకున్న ఈ బౌలర్ ఇలా అనూహ్యంగా సస్పెండ్ కావడంతో క్రీడాభిమానులు షాక్ కు గురౌతున్నారు. అతడిపై నిషేధం విధించడానికి కారణం ఏంటంటే?

క్రికెట్ లో ఓ ప్లేయర్ పై నిషేధం పడింది. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ బ్రైడన్ కార్స్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడినందుకు అతడిపై మూడు నెలల నిషేధం విధించింది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్. అతడు 2017 నుంచి 2019 వరకు 303 బెట్టింగ్ లకు పాల్పడినట్లు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డ్ నిర్ధారించింది. తాను బెట్టింగ్ లకు పాల్పడ్డట్లు కార్స్ కూడా అంగీకరించడంతో.. సస్పెండ్ చేశారు. ఈ నిషేధం మే 28 నుంచి ఆగస్ట్ 28 వరకు ఉంటుంది. ఈ కాలంలో అతడు క్రికెట్ కు సంబంధించి ఎలాంటి వ్యవహారాల్లో పాలుపంచుకోరాదు. అయితే అతడు బెట్టింగ్ వేసిన ఆ మ్యాచ్ లో కూడా ఆడలేదని తెలుస్తోంది.

ఇక బ్రైడన్ కార్స్ కెరీర్ విషయానికి వస్తే.. 2021లో పాకిస్థాన్ తో మ్యాచ్ ద్వారా క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 14 వన్డేలు, 3 టీ20లు ఆడాడు. వన్డేల్లో 15, టీ20ల్లో 4 వికెట్లు పడగొట్టాడు కార్స్. 2023 ప్రపంచ కప్ లో 15 సభ్యులతో కూడిన టీమ్ లో చోటు దక్కించుకున్నాడు.  అయితే త్వరలోనే అండర్సన్ రిటైర్మెంట్ ప్రకటించనుండటంతో.. కార్స్ కు ఎక్కువ ఛాన్స్ లు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టైమ్ లో నిషేధం ఎదుర్కొవడం అతడి కెరీర్ పై ప్రభావం చూపే అవకాశం ఉంది.