Dwayne Smith: వీడియో: వెస్టిండీస్‌ బౌలర్‌ దెబ్బకు రెండు ముక్కలైన వికెట్‌!

Dwayne Smith, Kamran Akmal, PAK vs WI, WCL 2024: వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024లో భాగంగా పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Dwayne Smith, Kamran Akmal, PAK vs WI, WCL 2024: వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024లో భాగంగా పాకిస్థాన్‌, వెస్టిండీస్‌ మధ్య జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

దిగ్గజ మాజీ క్రికెటర్లు తలపడుతున్న వరల్డ్‌ ఛాంపియన్స్‌ ఆఫ్‌ లెజెండ్స్‌ 2024 టోర్నీలో ఓ సూపర్‌ అవుట్‌ చోటు చేసుకుంది. మంచి వయసులో ఉండి, కళ్లు చెదిరే వేగంతో వేస్తున్న బౌలర్లు కూడా చేయలని పనిని.. ఓ మాజీ క్రికెటర్‌ చేశాడు. బౌలింగ్‌లో వికెట్‌ను అడ్డంగా విరగ్గొట్టాడు. వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌, పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ మధ్య డబ్ల్యూసీఎల్‌ 2024లో భాగంగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వెస్టిండీస్‌ బౌలర్‌ డ్వేన్ స్మిత్ సూపర్‌ బాల్‌తో పాక్‌ ఓపెనర్‌ కమ్రాన​ అక్మల్‌ను అవుట్‌ చేయడమే కాకుండా.. స్టంప్స్‌ను అడ్డగా విరగ్గొట్టాడు.

స్మిత్‌ బౌలింగ్‌లో వికెట్‌ విరిగిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో.. విండీస్‌ ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ స్మిత్‌ వేసిన ఇన్నింగ్స్‌ 12వ ఓవర్‌లో అక్మల్‌ అవుట్‌ అయ్యాడు. అప్పటి వరకు భారీ భారీ షాట్లతో విరుచుకుపడుతున్న అక్మల్‌ను స్మిత్‌ చాలా తెలివిగా అద్భుతమైన స్లో యార్కర్‌తో బోల్తాకొట్టించాడు. 12వ ఓవర్‌ రెండో బంతిని కట్‌ షాట్‌ ఆడబోయిన అక్మల్‌ పూర్తిగా మిస్‌ టైమ్‌ అయ్యాడు. దీంతో.. బాల్‌ లెగ్‌ స్టంప్‌కు సరిగ్గా మధ్యలో తగిలింది.. స్టంప్‌ అడ్డంగా రెండు ముక్కలుగా విరిగింది. 30 బంతుల్లో 8 ఫోర్లతో 46 పరుగులు చేసి బాగా ఆడుతున్న అక్మల్‌ను స్మిత్‌ పెవిలియన్‌కు పంపాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. కమ్రాన్‌ అక్మల్‌ 46, కెప్టెన్‌ యూనిస్‌ ఖాన్‌ 65, ఆమీర్‌ యామిన్‌ 40, తన్వీర్‌ 33 పరుగులు చేసి రాణించారు. మిగతా బ్యాటర్లు షార్జీల్‌ ఖాన్‌, మక్సుద్‌, షోయబ్‌ మాలిక్‌, అఫ్రిదీ, మిస్బా ఉల్‌ హక్‌ దారుణంగా విఫలం అయ్యారు. ఇక 199 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన వెస్టిండీస్‌ ఛాంపియన్స్‌ 19.5 ఓవర్లలో 178 పరుగులు చేసి ఆలౌట్‌ అయి ఓటమి పాలైంది. మరి ఈ మ్యాచ్‌లో డ్వేన్‌ స్మిత్‌ వేసిన బాల్‌కు స్టంప్‌ రెండు ముక్కలుగా విరగడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments