iDreamPost
android-app
ios-app

ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్! CSK vs SRH మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందా?

  • Published Apr 04, 2024 | 9:09 PM Updated Updated Apr 05, 2024 | 8:16 AM

ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న ప్రశ్న తాజాగా తెలెత్తింది. దానికి కారణం ఏంటి? వివరాల్లోకి వెళితే..

ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న ప్రశ్న తాజాగా తెలెత్తింది. దానికి కారణం ఏంటి? వివరాల్లోకి వెళితే..

ఉప్పల్ స్టేడియానికి కరెంట్ కట్! CSK vs SRH మ్యాచ్ జరిగే ఛాన్స్ ఉందా?

ఐపీఎల్ లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే టికెట్లు కొనుక్కుని ఎప్పుడెప్పుడు స్టేడియానికి వెళ్దామా అని ఆరాటపడుతున్నారు. అయితే అసలు ఈ మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న ప్రశ్న తాజాగా తెలెత్తింది. దీంతో ఫ్యాన్స్ ఆందోళనలో ఉన్నారు. అసలు దీనికి కారణం ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 5న చెన్నై వర్సెస్ సన్ రైజర్స్ మ్యాచ్ జరగనుంది. కానీ ఈలోగా ఈ స్టేడియం అంధకారంలో చిక్కుకుంది. కరెంట్ బిల్ కట్టకపోవడంతో.. అధికారులు పవర్ కట్ చేశారు. రేపే మ్యాచ్ పెట్టుకుని ఇప్పుడు పవర్ కట్ చేయడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు విషయం ఏంటంటే? గత కొన్నేళ్లుగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కరెంట్ బిల్లు కట్టడం లేదు. అసోసియేషన్ కు చెందిన HBG2192 కనెక్షన్ పై ఉన్న పెండింగ్ బిల్లుల కోసం రంగారెడ్డి జిల్లా కోర్టులో విద్యుత్ అధికారులు 2018లో కేసు వేశారు. రూ. 1.41 కోట్లతో పాటుగా రూ. 1.64 కోట్ల సర్ ఛార్జీ కలిపి మెుత్తం రూ. 3.05 కోట్లను వారం రోజుల్లోగా చెల్లించాలని గతేడాది డిసెంబర్ 6న HCAకి కోర్టు నోటీసులు జారీ చేసింది.

అయితే ఆ తర్వాత కూడా మరికొన్నిసార్లు నోటీసులు జారీ చేసినా అసోసియేషన్ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో గురువారం(ఏప్రిల్ 4) విద్యుత్ అధికారులు స్టేడియానికి కరెంట్ సరఫరాను నిలిపివేశారు. కాగా.. మ్యాచ్ కు మరికొన్ని గంటలే సమయం ఉండటంతో.. చెన్నై-సన్ రైజర్స్ మధ్య మ్యాచ్ జరుగుతుందా? లేదా? అన్న అనుమానం ఫ్యాన్స్ లో నెలకొంది. మరి ఈ అనిశ్చితిని HCA క్లియర్ చేస్తుందా? లేదా జనరేటర్స్ తో మ్యాచ్ ను నడిపిస్తుందా? అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే. అయితే కరెంట్ బిల్లు కట్టకపోవడంతో.. అభిమానులు అసోసియేషన్ పై ఫైర్ అవుతున్నారు. డబ్బులన్నీ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.