iDreamPost
android-app
ios-app

వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా దువా లిపా!

  • Author Soma Sekhar Published - 12:18 PM, Fri - 17 November 23

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం నరేంద్రమోదీ స్టేడియం సిద్దమవుతోంది. ఇక ఈ మ్యాచ్ ముగింపు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది ప్రముఖ సింగర్ దువా లిపా.

వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కోసం నరేంద్రమోదీ స్టేడియం సిద్దమవుతోంది. ఇక ఈ మ్యాచ్ ముగింపు వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది ప్రముఖ సింగర్ దువా లిపా.

  • Author Soma Sekhar Published - 12:18 PM, Fri - 17 November 23
వరల్డ్ కప్ ముగింపు వేడుకల్లో స్పెషల్ ఎట్రాక్షన్ గా దువా లిపా!

ప్రపంచ కప్ 2023 మెగాటోర్నీ చివరి దశకు చేరుకుంది. నాకౌట్ మ్యాచ్ ల్లో ఇండియా కివీస్ ను ఓడించగా.. ఆసీస్ సౌతాఫ్రికాను మట్టికరిపించింది. దీంతో ఫైనల్ మ్యాచ్ కు సిద్దమైయ్యాయి భారత్-ఆస్ట్రేలియా టీమ్స్. ఆదివారం(నవంబర్ 19)న జరగనున్న ఈ మెగా ఫైనల్ మ్యాచ్ కు అహ్మదాబాద్ లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యాన్ని ఇస్తోంది. కాగా.. ఈ మ్యాచ్ కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతోంది. ఫైనల్ మ్యాచ్ స్టారింగ్, ఎండింగ్ కు ముందు నిర్వహించే వేడుకలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా ముగింపు వేడుకల్లో వరల్డ్ ఫేమస్ సింగర్ ‘దువా లిపా’ ప్రత్యేక ప్రదర్శన ఉంటుందని సమాచారం.

130 కోట్లకు పైగా భారతీయులు ఎదురు చూస్తున్న ఆ క్షణాలకు ఇంకా ఒక్క అడుగు దూరంలోనే ఉంది టీమిండియా. ఆదివారం జరగనున్న ప్రపంచ కప్ ఫైనల్లో ఆసీస్ ను ఢీకొట్టబోతోంది భారత జట్టు. నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కోసం భారీగా ఏర్పాట్లు చేస్తోంది బీసీసీఐ. అదీకాక ఈ మ్యాచ్ కు భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటుగా ఎంతో మంది అతిరథ మహారథుల హాజరుకానున్నారు. ఇక ఈ మ్యాచ్ ముగింపు వేడుకల్లో ఆడిపాడనుంది ప్రముఖ పాప్ సింగర్ దువా లిపా. యూకేకి చెందిన ఈ లేడీ సింగర్ కు వరల్డ్ వైడ్ గా కోట్లలో అభిమానులు ఉన్నారు. తన ఆటపాటతో కోట్లలో అభిమానులను సంపాదించుకుంది దువా లిపా.

ఈ క్రమంలోనే ఆమె ఇటీవల పాడిన ‘హౌడిని ట్రాక్’ రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి.. గ్లోబల్ చార్ట్ బస్టర్ గా నిలిచింది. కేవలం ఐదు రోజుల్లోనే 27 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. కాగా.. దువా లిపా ముగింపు వేడుకల్లో ప్రదర్శన ఇస్తున్నట్లు వరల్డ్ కప్ కు అధికారిక బ్రాడ్ కాస్టర్ గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ కూడా ప్రకటించింది. ఆమె ఆటపాటతో ఈ వరల్డ్ కప్ అద్భుతంగా ముగియనుందని స్టార్ స్పోర్ట్స్ చెప్పుకొచ్చింది. కానీ ఐసీసీ మాత్రం ఈ విషయంపై ఇంకా ఎలాంటి ప్రకటనా ఇవ్వలేదు. మరి దువా లిపా స్పెషల్ షోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom