వరల్డ్‌ కప్‌ ముందు చెత్త కుప్పలా స్టేడియం! ఫ్యాన్స్ ఫైర్!

దేశవ్యాప్తంగా వరల్డ్‌ కప్‌ హడావిడి మొదలైపోయింది. క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఇప్పటికే వరల్డ్‌ కప్‌ ఫీవర్‌తో ఊగిపోతున్నారు. అక్టోబర్‌ 5 నుంచి అహ్మాదాబాద్‌ వేదికగా ఇంగ్లండ్‌-న్యూజిలాండ్‌ మధ్య మ్యాచ్‌తో వరల్డ్‌ కప్‌ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వామప్‌ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఇండియా ఆడాల్సిన రెండు వామప్‌ మ్యాచ్‌లు కూడా వర్షం కారణంగా రద్దు అయిన విషయం తెలిసిందే. కానీ, హైదరాబాద్‌ వేదికగా పాకిస్థాన్‌-న్యూజిలాండ్‌ మధ్య జరిగిన వామప్‌ మ్యాచ్‌ అలాగే.. ఈ రోజు పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వామప్‌ మ్యాచ్‌లు ఏ ఆటంకం లేకుండా సవ్యంగా సాగుతున్నాయి. కానీ, ఉప్పల్‌ స్టేడియంలో పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా వామప్‌ మ్యాచ్‌ వీక్షించేందుకు వచ్చిన ప్రేక్షకులు మాత్రం అసౌకార్యాలో అవస్థలు పడుతున్నారు.

వరల్డ్‌ కప్‌ లాంటి ప్రతిష్టాత్మక టోర్నీలో భాగంగా వామప్‌ మ్యాచ్‌లకు ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. మంగళవారం పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా మధ్య వామప్‌ మ్యాచ్‌ ప్రారంభమైంది. అయితే.. ఈ మ్యాచ్‌ వీక్షించేందుకు చాలా మంది క్రికెట్‌ అభిమానులు స్టేడియానికి తరలివచ్చారు. వామప్‌ మ్యాచ్‌లే అయినా.. పాకిస్థాన్‌-ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లు ఆడుతుండటం, రెండు టీమ్స్‌లో స్టార్‌ ప్లేయర్లు ఉండటంతో హైదరాబాద్‌లోని క్రికెట్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో మ్యాచ్‌ చూసేందుకు వచ్చారు. అయితే.. మ్యాచ్‌ చూసేందుకు టిక్కెట్‌ కొని వచ్చిన ఫ్యాన్స్‌కు లోపల సౌకర్యాలు షాక్‌ ఇచ్చాయి. ఏ మాత్రం శుభ్రంలేని, కూర్చునేందుకు అస్సలు సౌకర్యంగాలేని సీట్లు చూసి క్రికెట్‌ అభిమానులు ఖంగుతిన్నారు.

ఈ విషయంపై ప్రముఖ స్పోర్ట్స్‌ అనలిస్ట్‌ సీ.వెంకటేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వెళ్లారు. అయితే.. అక్కడున్న పరిస్థితులు చూసి అవాక్కయిన వెంకటేశ్‌.. అపరిశుభ్రంగా ఉన్న సీట్లను ఫొటోలు తీసి తన ట్విట్టర్‌(ఎక్స్‌) ఖాతాలో పోస్టు చేశారు. ‘ఉప్పల్ స్టేడియంలో పెద్దగా మార్పు లేదు. కొన్ని విండో డ్రెస్సింగ్, ప్రేక్షకుల సౌకర్యాన్ని మాత్రమే ఇప్పటికీ పూర్తి స్థాయిలో పట్టించుకోలేదు.’ అంటూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. దీంతో ఆ ఫొటోలో సోషల్‌ మీడియా వేదికగా వైరల్‌ అయ్యాయి. మరి కొంతమంది సైతం ఉప్పల్‌ స్టేడియంలో సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరల్డ్‌ కప్‌ లాంటి ప్రెస్టిజియస్‌ టోర్నీకి ముందు ఓ అంతర్జాతీయ స్టేడియాన్ని ఇలాగేనా? ఉంచేది అంటూ హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌పై మండిపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియాదే వరల్డ్‌ కప్‌! రాసిపెట్టుకోండి అంటున్న భారత ప్రముఖ జ్యోతిష్కుడు

Show comments