iDreamPost
android-app
ios-app

కెప్టెన్‌గా కప్పు గెలిచిన అశ్విన్‌! ఇన్ని రోజులు టీమిండియా వాడుకోలేదా?

  • Published Aug 05, 2024 | 2:41 PM Updated Updated Aug 05, 2024 | 2:41 PM

Ravichandran Ashwin, Dindigul Dragons, TNPL 2024: రవిచంద్రన్‌ అశ్విన్‌ కెప్టెన్‌గా ఒక కప్పు గెలిచాడు. అందుకోసం తన బ్యాటింగ్‌ టాలెంట్‌ను బయటికి తీశాడు. టీఎన్‌పీఎల్‌ టోర్నీలో అశ్విన్‌ చేసిన అద్భుతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Ravichandran Ashwin, Dindigul Dragons, TNPL 2024: రవిచంద్రన్‌ అశ్విన్‌ కెప్టెన్‌గా ఒక కప్పు గెలిచాడు. అందుకోసం తన బ్యాటింగ్‌ టాలెంట్‌ను బయటికి తీశాడు. టీఎన్‌పీఎల్‌ టోర్నీలో అశ్విన్‌ చేసిన అద్భుతం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Aug 05, 2024 | 2:41 PMUpdated Aug 05, 2024 | 2:41 PM
కెప్టెన్‌గా కప్పు గెలిచిన అశ్విన్‌! ఇన్ని రోజులు టీమిండియా వాడుకోలేదా?

ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024లో అన్ని జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. అంతిమంగా రవిచంద్రన్‌ అశ్విన్‌ కెప్టెన్సీలోని దిండిగల్‌ డ్రాగన్స్‌ జట్టు విజేతగా నిలిచింది. టీమిండియాలో ఒక స్టార్‌ స్పిన్నర్‌గా మాత్రమే ఉన్న అశ్విన్‌.. ఈ టీఎన్‌పీఎల్‌ టోర్నీలో మాత్రం.. అన్నీ తానై వ్యవహరించి.. డ్రాగన్స్‌ టీమ్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. ఆటగాళ్లను కొనుగోలు చేసే వేలంలో పాల్గొనడంతో పాటు.. కెప్టెన్‌గా, బౌలర్‌గా.. అన్నింటికి మించి ఒక బ్యాటర్‌గా అద్భుతం చేశాడు. ఈ టోర్నీలో దిండిగల్‌ డ్రాగన్స్‌ జట్టు ఛాంపియన్‌గా నిలిచిందంటే అందుకు ప్రధాన కారణం అశ్విన్‌ బ్యాటింగ్‌.

ఎలిమినేటర్‌, క్వాలిఫైయర్‌-2, ఫైనల్‌.. ఇలా మూడు కీలక మ్యాచ్‌ల్లో కూడా రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాట్‌తో దుమ్మురేపాడు. వరుసగా మూడు హాఫ్‌ సెంచరీలో అదరగొట్టాడు. చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌తో జరిగని ఎలిమినేటర్‌లో 35 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 57 పరుగులు చేశాడు. ఐడ్రీమ్‌ తిరుప్పూర్‌ తమిజన్స్‌తో జరిగిన క్వాలిఫైయర్‌-2లో కేవలం 30 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సుతో 69 పరుగులు చేసి.. సూపర్‌ టీ20 ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇక లైకా కోవై కింగ్స్‌తో ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 46 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్సులతో 52 పరుగులు చేసి మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. అశ్విన్‌లోని ఈ బ్యాటింగ్‌ టాలెంట్‌ చూసి.. ఇన్ని రోజులు అశ్విన్‌ టాలెంట్‌ను టీమిండియా సరిగ్గా వాడుకోలేదా? అని క్రికెట్‌ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన లైకా కోవై కింగ్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది. ఓపెనర్‌ సుజయ్‌ 22, రామ్‌ అరవింద్‌ 27, అతీఖ్‌ ఉర్‌ రెహమాన్‌ పరుగులు చేసి రాణించారు. డ్రాగన్స్‌ బౌలర్లలో వారియర్‌, వరుణ్‌ చక్రవర్తి, పీ. విగ్నేష్‌ రెండేసి వికెట్లు తీసుకున్నారు. ఇక 130 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దిండిగల్‌ డ్రాగన్స్‌ 18.2 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 52, బాబా ఇంద్రజిత్‌ 32, సీ.శరత్‌ కుమార్‌ 27 పరుగులు చేసి రాణించారు. లైకా కోవై కింగ్స్‌ బౌలర్లలో గౌతమ్‌, మణిమారన్‌ సిద్ధార్థ్‌, యుదీశ్వరన్‌, షారుఖ్‌ ఖాన్‌ తలో వికెట్‌ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ ఇన్నింగ్స్‌తో పాటు.. ఓవరాల్‌ టోర్నీలో కెప్టెన్‌గా, బ్యాటర్‌ అశ్విన్‌ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.