Dhruv Jurel: ధోని ఆల్​టైమ్​ రికార్డును సమం చేసిన జురెల్.. యంగ్ కీపర్ అరుదైన ఘనత!

Dhruv Jurel Equals MS Dhoni's Record: టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోని ఆల్​టైమ్ రికార్డును యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ సమం చేశాడు. దులీప్ ట్రోఫీ-2024 ఓపెనింగ్ మ్యాచ్​లో అతడు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

Dhruv Jurel Equals MS Dhoni's Record: టీమిండియా లెజెండ్ ఎంఎస్ ధోని ఆల్​టైమ్ రికార్డును యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ సమం చేశాడు. దులీప్ ట్రోఫీ-2024 ఓపెనింగ్ మ్యాచ్​లో అతడు ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు.

దులీప్ ట్రోఫీ-2024 ఎన్నో సంచలనాలకు వేదికగా నిలుస్తోంది. భారత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలంటే ఈ టోర్నమెంట్​లో రాణించడం కీలకంగా మారింది. ఫిట్​నెస్​, ఫామ్​ను నిరూపించుకుంటేనే సెలెక్షన్​కు పరిగణనలోకి తీసుకుంటామని భారత క్రికెట్ బోర్డు నుంచి క్లియర్​గా ఇండికేషన్స్ వెళ్లడంతో ప్లేయర్లు ఈ టోర్నీలో బాగా పెర్ఫార్మ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అటు టీమిండియాలోకి ఎంట్రీ ఇవ్వాలని ఉవ్విళ్లూరుతున్న కొందరు యంగ్​స్టర్స్ కూడా కసిగా ఆడుతున్నారు. దీంతో టోర్నీలో సంచలన ప్రదర్శనలు నమోదవుతున్నాయి. ఇప్పటికే ముషీర్ ఖాన్ లాంటి కొందరు యువ ఆటగాళ్లు సెన్సేషనల్ పెర్ఫార్మెన్స్​తో అందరి అటెన్షన్​ను తమ వైపునకు తిప్పుకుంటున్నారు. ఈ తరుణంలో యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ ఓ ఆల్​టైమ్ రికార్డును సమం చేశాడు.

టీమిండియా లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని పేరిట దులీప్ ట్రోఫీలో ఓ ఆల్​టైమ్ రికార్డ్ ఉంది. ఒక ఇన్నింగ్స్​లో అత్యధిక క్యాచ్​లు అందుకున్న వికెట్ కీపర్​గా మాహీ అప్పట్లో రికార్డు క్రియేట్ చేశాడు. 2004-05 సీజన్ దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరఫున బరిలోకి దిగిన మాహీ ఓ మ్యాచ్​లోని ఒక ఇన్నింగ్స్​లో ఏకంగా 7 క్యాచ్​లు అందుకున్నాడు. రెండు దశాబ్దాల నుంచి ఈ రికార్డు చెక్కుచెదరనిదిగా ఉంది. దీన్ని ఇప్పుడు ధృవ్ జురెల్ సమం చేశాడు. దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా ఇండియా-ఏ తరపున బరిలోకి దిగిన జురెల్.. ఇండియా-బీతో జరుగుతున్న మ్యాచ్​లో ధోని రికార్డును సమం చేశాడు. నవ్​దీప్ సైనీ ఇచ్చిన క్యాచ్​ను అందుకోవడం ద్వారా అతడు మాహీ సరసన నిలిచాడు. ఈ మ్యాచ్​లో అతడికి ఇది ఏడో క్యాచ్ కావడం విశేషం. తద్వారా దులీప్ ట్రోఫీలో ధోని తర్వాత ఒకే ఇన్నింగ్స్​లో అత్యధిక క్యాచ్​లు అందుకున్న రెండో వికెట్ కీపర్​గా జురెల్ రికార్డు నెలకొల్పాడు.

ఈ మ్యాచ్​లో అద్భుతమైన కీపింగ్​తో అదరగొట్టిన జురెల్.. బ్యాటింగ్​లో మాత్రం ఫెయిల్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్​లో 2 పరుగులు చేసిన యంగ్ బ్యాటర్.. సెకండ్ ఇన్నింగ్స్​లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్​కు చేరుకున్నాడు. అతడితో పాటు కెప్టెన్ శుబ్​మన్ గిల్ (21), రియాన్ పరాగ్ (31), మయాంక్ అగర్వాల్ (3) కూడా విఫలమయ్యారు. దీంతో 275 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఇండియా ఏ ప్రస్తుతం 6 వికెట్లకు 137 పరుగులతో ఉంది. కేఎల్ రాహుల్ (53 నాటౌట్), కుల్దీప్ యాదవ్ (8 నాటౌట్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. రాహుల్ ఎంతసేపు ఆడతాడనే దాని మీదే మ్యాచ్ రిజల్ట్ డిపెండ్ అయింది. అతడు బాగా ఆడి, కుల్దీప్ మంచి సహకారం అందిస్తే ఇండియా గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కానీ టార్గెట్ భారీగా ఉంది కాబట్టి ఆ జట్టు ఎస్కేప్ అవడం కష్టంగానే ఉంది. మరి.. ధోని రికార్డును జురెల్ సమం చేయడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments