iDreamPost
android-app
ios-app

చరిత్ర సృష్టించిన ధృవ్ జురెల్.. 22 ఏళ్ల తర్వాత రేర్ ఫీట్!

  • Published Feb 28, 2024 | 7:30 AM Updated Updated Feb 28, 2024 | 7:30 AM

Dhruv Jurel: ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్. ఈ క్రమంలోనే చరిత్ర సృష్టించాడు. 22 ఏళ్ల తర్వాత ఓ రేర్ ఫీట్ ను రిపీట్ చేశాడు. అదేంటంటే?

Dhruv Jurel: ఇంగ్లండ్ తో జరిగిన నాలుగో టెస్ట్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో అదరగొట్టాడు యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్. ఈ క్రమంలోనే చరిత్ర సృష్టించాడు. 22 ఏళ్ల తర్వాత ఓ రేర్ ఫీట్ ను రిపీట్ చేశాడు. అదేంటంటే?

చరిత్ర సృష్టించిన ధృవ్ జురెల్.. 22 ఏళ్ల తర్వాత రేర్ ఫీట్!

ధృవ్ జురెల్.. టీమిండియా క్రికెట్ లోనే కాదు, ప్రపంచ క్రికెట్ లో మారుమ్రోగుతున్న పేరు. క్లిష్ట సమయాల్లో జురెల్ భారత జట్టును అద్భుతమైన బ్యాటింగ్ తో ఆదుకోవడమే కాకుండా.. సిరీస్ విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ తో రాంచీ వేదికగా జరిగిన నాలుగో టెస్ట్ లో కీలక ఇన్నింగ్స్ లు ఆడాడు ఈ నయా సంచలనం. తొలి ఇన్నింగ్స్ లో 90, రెండో ఇన్నింగ్స్ లో 39 రన్స్ తో అజేయంగా నిలిచి టీమ్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే 22 ఏళ్ల రేర్ ఫీట్ ను మరోసారి రిపీట్ చేశాడు. మరి ఆ రికార్డు ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియాలో యువ రక్తం ఉరకలేస్తోంది. ఇంగ్లండ్ పై 5 టెస్ట్ ల సిరీస్ ను 3-1తో గెలవడంలో యంగ్ ప్లేయర్లదే కీలక పాత్ర. కోహ్లీ, రాహుల్, శ్రేయస్ అయ్యర్, షమీ లాంటి స్టార్ ప్లేయర్లు లేనప్పటికీ.. రోహిత్ నాయకత్వంలో ఇంగ్లండ్ ను చిత్తుచేసింది. కాగా.. ఈ సిరీస్ ద్వారానే టీమిండియాలోకి డెబ్యూ చేశాడు యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్. తొలి మ్యాచ్ లో ఒక్క ఇన్నింగ్స్ లోనే బ్యాటింగ్ చేసే అవకాశం రాగా.. రెండో మ్యాచ్ లో తన సత్తా ఏంటో ప్రపంచానికి చూపించాడు. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో సూపర్బ్ నాక్స్ ఆడి టీమ్ కు విజయాన్ని అందించాడు. దీంతో తన డెబ్యూ సిరీస్ లోనే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న రెండో భారత వికెట్ కీపర్ గా చరిత్రకెక్కాడు. 22 ఏళ్ల తర్వాత ఈ రేర్ ఫీట్ ను మళ్లీ రిపీట్ చేశాడు జురెల్.

2002లో వెస్టిండీస్ పర్యటన ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు మాజీ వికెట్ కీపర్ అజయ్ రాత్రా. అతడు అంటిగ్వా వేదికగా జరిగిన నాటి మ్యాచ్ లో సెంచరీ(115) చేసి ప్లేయర్ ఆఫ్ ద అవార్డును దక్కించుకున్నాడు. దీంతో డెబ్యూ సిరీస్ లోనే ఈ అవార్డు సొంతం చేసుకున్న తొలి వికెట్ కీపర్ గా చరిత్ర సృష్టించాడు. తాజాగా మళ్లీ ఇన్ని సంవత్సరాల తర్వాత జురెల్ ఈ రికార్డును రిపీట్ చేశాడు. ఇక ఈ లిస్ట్ లో ఓవరాల్ గా ఆరుగురు ఆటగాళ్లు మాత్రామే డెబ్యూ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ద అవార్డులను గెలుచుకున్నారు. వారిలో ఎంఎస్ ధోని, రిషబ్ పంత్ రెండేసి సార్లు ఈ రికార్డు సాధించగా.. నయన్ మోంగియా, అజయ్ రాత్రా, వృద్ధిమాన్ సాహాతో పాటుగా ఇప్పుడు ధృవ్ జురెల్ ఈ ఘనతను సాధించిన వారిలో ఉన్నారు. మరి 22 ఏళ్ల తర్వాత జురెల్ ఈ ఘనతను రిపీట్ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: తప్పు తెలుసుకున్న ఇషాన్ కిషన్.. బీసీసీఐ వార్నింగ్​తో..!