Somesekhar
Dhruv Jurel: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సూపర్బ్ నాక్ తో దరగొట్టాడు యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను సాధించాడు.
Dhruv Jurel: ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో సూపర్బ్ నాక్ తో దరగొట్టాడు యంగ్ వికెట్ కీపర్ ధృవ్ జురెల్. ఈ క్రమంలోనే ఓ రేర్ ఫీట్ ను సాధించాడు.
Somesekhar
ధృవ్ జురెల్.. ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియాకు ఆపద్భాంధవుడిగా మారాడు. ఒక్క యశస్వీ జైస్వాల్(73) తప్ప మిగతా బ్యాటర్లు అంతా విఫలం కావడంతో.. భారత్ కష్టాల్లో పడింది. ఇలాంటి సమయంలో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే కెరీర్ లో తొలి ఫిఫ్టీని సాధించడమే కాకుండా.. ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దీంతో తొలి వికెట్ కీపర్ గా నిలిచాడు. ఈ రికార్డుకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఇంగ్లండ్ తో జరుగుతున్న నాలుగో టెస్ట్ లో టీమిండియా యువ వికెట్ కీపర్ ధృవ్ జురెల్ సత్తాచాటాడు. రోహిత్ శర్మ, గిల్, రజత్ పాటిదారు, రవీంద్ర జడేజా, సర్ఫరాజ్ ఖాన్ విఫలమైన చోట.. అర్ధసెంచరీతో అదరగొట్టాడు. 90 పరుగులు చేసి కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. దీంతో కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ చేసిన జురెల్ ఓ రేర్ ఫీట్ ను సాధించాడు. అదేంటంటే? ఈ సిరీస్ లో ఫిఫ్టీ సాధించిన తొలి వికెట్ కీపర్ గా అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఇప్పటి వరకు ఇరు జట్లలో వికెట్ కీపర్ అర్దశతకం సాధించలేకపోయారు. ఈ ఇన్నింగ్స్ లో ఓవరాల్ గా 149 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 4 సిక్సులతో 90 రన్స్ చేశాడు. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తో కలిసి 8వ వికెట్ కు 76 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. చివరికి టామ్ హార్ట్లీ బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. దీంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 307 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంగ్లండ్ స్పిన్నర్ బషీర్ 5, హార్ట్లీ 3 వికెట్లతో రాణించారు. మరి రేర్ ఫీట్ సాధించిన జురెల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Dhruv Jurel becomes the first wicketkeeper to score a fifty in this Test series. 🇮🇳 pic.twitter.com/nGH4y7eVPr
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 25, 2024
ఇదికూడా చదవండి: కుల్దీప్ మాయ.. బౌలింగ్ లో కాదు.. బ్యాటింగ్ లో! ఏంటి సామి ఈ మార్పు!