iDreamPost
android-app
ios-app

వీడియో: క్రికెటర్స్ అందరి కన్నా ధోని తోపు! జెర్సీలు అమ్మే కుర్రాడు ఇచ్చిన ఎలివేషన్ చూశారా?

  • Published May 20, 2024 | 7:04 PM Updated Updated May 20, 2024 | 7:04 PM

MS Dhoni, Virat Kohli, IPL 2024: ఈ సీజన్‌లో ధోని వర్సెస్‌ కోహ్లీ ఫ్యాన్‌ వార్‌ గట్టిగానే జరిగింది. కానీ, ఈ ఒక్క వీడియోతో ధోని తోపు అనే తేలిపోయింది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

MS Dhoni, Virat Kohli, IPL 2024: ఈ సీజన్‌లో ధోని వర్సెస్‌ కోహ్లీ ఫ్యాన్‌ వార్‌ గట్టిగానే జరిగింది. కానీ, ఈ ఒక్క వీడియోతో ధోని తోపు అనే తేలిపోయింది. అది ఎలాగో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published May 20, 2024 | 7:04 PMUpdated May 20, 2024 | 7:04 PM
వీడియో: క్రికెటర్స్ అందరి కన్నా ధోని తోపు! జెర్సీలు అమ్మే కుర్రాడు ఇచ్చిన ఎలివేషన్ చూశారా?

టీమిండియా క్రికెటర్లను కొన్ని కోట్ల మంది అభిమానిస్తారు. జాతీయ జట్టు.. వరల్డ్‌ కప్‌ లాంటి మెగా టోర్నీల్లో ఆడుతున్న సమయంలో వంద కోట్ల మందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులు ఏకమై.. మెన్‌ ఇన్‌ బ్లూను ఎంకరేజ్‌ చేస్తుంటారు. కానీ, టీమిండియాకు ఆడే ప్లేయర్లలో కొంతమంది ఆటగాళ్లకు ఇంకా ప్రత్యేకమైన క్రేజ్‌ ఉంటుంది. వారిలో మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ.. ఇలా కొంత మందికి సెపరేట్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉంటుంది. ఐపీఎల్‌తో ఆ ధోరణి మరింత పెరిగింది. ఇటీవల రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు, చెన్నై సూపర్‌ కింగ్స్‌ మ్యాచ్‌ సమయంలో కూడా కోహ్లీ వర్సెస్‌ ధోని ఫ్యాన్స్‌ వార్‌ నడిచింది. ఆ మ్యాచ్‌ ఈ ఐపీఎల్‌ సీజన్‌కే హైలెట్‌ మ్యాచ్‌గా నిలిచింది.

ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో బంపర్‌ విక్టరీ కొట్టి ప్లే ఆఫ్స్‌కు సగర్వంగా వెళ్లింది. పైగా సీఎస్‌కే లాంటి పెద్ద టీమ్‌పై, ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన డిఫెండింగ్‌ ఛాంపియన్‌పై నెగ్గి ప్లే ఆఫ్స్‌కు వెళ్లడంతో.. ఆర్సీబీ అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు. ఈ క్రమంలో వైరల్‌ అవుతున్న ఒక వీడియో వారిని చాలా నిరాశకు గురిచేస్తోంది. ఓ జెర్సీలు అమ్మే కుర్రాడు ఇచ్చిన ఎలివేషన్‌ అందుకు కారణం. అందేంటో ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం..

సాధారణంగా మ్యాచ్‌ చూసేందుకు స్టేడియానికి వచ్చే అభిమానుల్లో చాలా మంది తమ అభిమాన ఆటగాడి జెర్సీని ధరించి వస్తారు. ఆ జెర్సీలను స్టేడియం బయటే అమ్ముతుంటారు. అయితే. అన్ని జెర్సీలు ఒకే ధర ఉండవ్‌. అందుకు కారణం ఆ జెర్సీపై ఉండే క్రికెటర్‌ పేరు, జెర్సీ నంబర్‌ కారణం. అందులోనా ధోని, కోహ్లీ, రోహిత్‌ జెర్సీలకు విపరీతమైన ‍క్రేజ్‌ ఉంటుంది. ఆ క్రేజ్‌ను జెర్సీలు అమ్మేవారు క్యాష్‌ చేసుకుంటారు. తాజాగా వైరల్‌ అవుతున్న వీడియోలో ధోని జెర్సీ 250, కోహ్లీ జెర్సీ 150 అంటూ జెర్సీలు అమ్మే కుర్రాడు కొనే​ందుకు వచ్చిన వారితో అన్నాడు. అదేంటి? ఎందుకు ధరలో తేడా అని అడిగితే.. ‘ధోని తో సబ్‌కా బాప్‌ హై’ అని జవాబు ఇచ్చాడు. ధోని అందరి బాబు అని దాని అర్థం. ఇలా ధోని క్రేజ్‌ కోహ్లీ కంటే ఎక్కువ అని ఈ వీడియోతో తేలిపోయిందంటూ.. కొంతమంది సోషల్‌ మీడియాలో వీడియోను షేర్‌ చేస్తూ.. కామెంట్‌ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetjojobetJojobet girişcasibomJojobet GirişcasibomjojobetjojobetjojobetcasibomMadridbetMadridbetJojobet Girişcasibom girişHoliganbet GirişOnwin GirişRekabet girişCasibom Girişhttps://www.hoteltarobafoz.com.br/superbetincasibomholiganbet girişholiganbet girişMarsbahis Güncel