iDreamPost
android-app
ios-app

Devdutt Padikkal: రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్ అనారోగ్యంతో..!

  • Published Feb 13, 2024 | 3:40 PM Updated Updated Feb 13, 2024 | 3:40 PM

ఇంగ్లాండ్ తో జరగనున్న మూడో టెస్ట్ కు రాహుల్ ప్లేస్ లో యంగ్ స్టార్ ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్ కు పిలుపు అందించారు సెలెక్టర్లు. జట్టులో చోటు దక్కడంపై స్పందించాడు పడిక్కల్.

ఇంగ్లాండ్ తో జరగనున్న మూడో టెస్ట్ కు రాహుల్ ప్లేస్ లో యంగ్ స్టార్ ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్ కు పిలుపు అందించారు సెలెక్టర్లు. జట్టులో చోటు దక్కడంపై స్పందించాడు పడిక్కల్.

Devdutt Padikkal: రాహుల్ స్థానంలో జట్టులోకి వచ్చిన పడిక్కల్ అనారోగ్యంతో..!

ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలబారిన పడిన విషయం తెలిసిందే. దీంతో మిగిలిన మూడు టెస్ట్ లకు వీరు ఆడేది అనుమానంగానే కనిపిస్తోంది. ఎందుకంటే? మూడో టెస్ట్ కు రాహుల్ అందుబాటులోకి వస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అతడు ఆ మ్యాచ్ కు దూరం కానున్నాడని తెలుస్తోంది. ఇక రాహుల్ ప్లేస్ లో యంగ్ స్టార్ ప్లేయర్ దేవ్ దత్ పడిక్కల్ కు పిలుపు అందించారు సెలెక్టర్లు. టెస్ట్ జట్టులోకి పిలుపురావడంతో.. తాజాగా స్పందించాడు ఈ యువ ఆటగాడు. ఈ క్రమంలోనే పలు షాకింగ్ విషయాలు వెల్లడించాడు.

దేవ్ దత్ పడిక్కల్.. ఆటతో పాటుగా అదృష్టం కలిసిరావడంతో టీమిండియా టెస్ట్ జట్టులోకి పిలుపొచ్చింది. కేఎల్ రాహుల్ గాయం నుంచి ఇంకా కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో పడిక్కల్ కు అవకాశం కల్పించారు సెలెక్టర్లు. దీంతో ఇంగ్లాండ్ తో రాజ్ కోట్ వేదికగా జరగబోయే మూడో టెస్ట్ లో అతడు ఆడటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో టీమ్ లో చోటు దక్కడంపై స్పందించాడు పడిక్కల్.

“టెస్టుల్లో టీమిండియా తరఫున ఆడటం అనేది నా కల. అయితే ఊపిరితిత్తుల సమస్యతో గత కొంతకాలంగా ఇబ్బంది పడ్డాను. ఆ ప్రాబ్లమ్ తోనే 2022-23 రంజీ సీజన్ ఆడాను. ఇక ఈ టైమ్ లో నేను దాదాపుగా 10 కేజీల బరువు తగ్గాను. అయితే అనారోగ్యం నుంచి కోలుకుని, ఫిట్ నెస్ సాధించడం నేను ఎదుర్కొన్న అతిపెద్ద సవాల్. ఇన్ని సవాళ్లను ఎదుర్కొని టీమిండియాకు ఎంపిక అవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. టెస్ట్ జట్టులోకి పిలుపురావడాన్ని నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. నా కఠిన శ్రమ ఫలించినందుకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ చెప్పుకొచ్చాడు పడిక్కల్.

ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో పరుగుల వరదపారిస్తున్నాడు ఈ కర్ణాటక ప్లేయర్. చివరిగా తాను ఆడిన 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో నాలుగు సెంచరీలతో పాటు ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం రంజీ సీజన్ లో 4 మ్యాచ్ లు ఆడి 92.67 సగటుతో 556 పరుగులు సాధించాడు. ఓవరాల్ గా ఇప్పటి వరకు 31 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన పడిక్కల్ 2227 పరుగులు సాధించాడు. 2021లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ తో పడిక్కలు పొట్టి ఫార్మాట్ లోకి డెబ్యూ చేశాడు. కాగా.. మళ్లీ మూడేళ్ల తర్వాత టీమిండియా నుంచి పిలుపురావడం గమనార్హం. మరి రాహుల్ ప్లేస్ లో పడిక్కల్ ను తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: Datta Gaekwad: టీమిండియా మాజీ కెప్టెన్ కన్నుమూత.. ఆయన కొడుకూ క్రికెటరే!