Devdutt Padikkal: పడిక్కల్ ఫైటింగ్ నాక్.. ఒక్కడే అడ్డుగోడలా నిలబడిపోయాడు!

Devdutt Padikkal Fighting Knock In Duleep Trophy 2024: యంగ్ బ్యాటర్ దేవ్​దత్ పడిక్కల్ క్లాసికల్ బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లకు అడ్డుగోడలా నిలబడిపోయాడు.

Devdutt Padikkal Fighting Knock In Duleep Trophy 2024: యంగ్ బ్యాటర్ దేవ్​దత్ పడిక్కల్ క్లాసికల్ బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడు. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లకు అడ్డుగోడలా నిలబడిపోయాడు.

క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగుతున్న సమయంలో వికెట్లను కాచుకొని సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలంటే టాలెంట్​తో పాటు ఓపిక, టెక్నిక్, ఒత్తిడిని తట్టుకొని నిలబడే ధైర్యం, నేర్పు కావాలి. అలా ఉన్న బ్యాటర్లనే ప్రతి టీమ్ కోరుకుంటుంది. తాజాగా ఓ యంగ్ బ్యాటర్ ఇలా ఓ క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే దేవ్​దత్ పడిక్కల్. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్​లో అతడు అదరగొట్టాడు. ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్​లో ఇండియ-డీ ఆరంభంలోనే తడబడింది. మొదటి ఓవర్ నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఒకదశలో 52 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి. ఆ టీమ్ స్కోరు వంద దాటడం కష్టమేనని అనిపించింది. కానీ ఈ టైమ్​లో క్రీజులో పాతుకుపోయాడు పడిక్కల్. ఒక ఎండ్​లో వికెట్లను కాపాడుతూనే ఒక్కో పరుగును స్కోరు బోర్డు మీదకు చేరుస్తూ పోయాడు.

పడిక్కల్ పట్టుదలతో ఆడాడు. వంద లోపు చాప చుట్టేస్తుందనుకున్న ఇండియా-డీ పరువు కాపాడాడు. 124 బంతులు ఎదుర్కొన్న ఈ యువ బ్యాటర్ 15 బౌండరీల సాయంతో 92 పరుగులు చేశాడు. అతడి పోరాటం వల్లే టీమ్ 183 పరుగులు చేయగలిగింది. పడిక్కల్ తప్పితే ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్క్​ను అందుకోలేదు. రికీ భుయ్ (23) మంచి స్టార్ట్ దొరికినా భారీ ఇన్నింగ్స్​గా మలచలేకపోయాడు. ఆఖర్లో హర్షిత్ రానా (31) 4 బౌండరీలు, 2 సిక్సులు బాది ఆడియెన్స్​ను ఎంటర్​టైన్ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) గోల్డెన్ డకౌట్ అవడం టీమ్​ను దారుణంగా దెబ్బ తీసింది. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ (5) ఫెయిల్యూర్ కూడా భారీ స్కోరు ఆశలకు గండికొట్టింది. పడిక్కల్ ఫైటింగ్ ఇన్నింగ్స్ లేకపోతే ఇండియా-డీ పరిస్థితి దారుణంగా ఉండేది.

ఫస్ట్ ఇన్నింగ్స్​లో ఇండియా-డీ 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఇండియా-ఏ ఇప్పుడు వికెట్లేమీ కోల్పోకుండా 104 పరుగులతో ఉంది. ప్రతాప్ సింగ్ (57 నాటౌట్), మయాంక్ అగర్వాల్ (47 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇండియా-ఏ ఆధిక్యం 211 పరుగులకు చేరుకుంది. ప్రతాప్-మయాంక్ వేగంగా ఆడుతున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదుతున్నారు. లీడ్ డబుల్ అయ్యే వరకు ఇండియా-ఏ బ్యాటింగ్ చేసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్​లోనే కుప్పకూలిన ఇండియా-డీ భారీ స్కోరును ఛేజ్ చేయడం కష్టంగానే ఉంది. అయితే పడిక్కల్​కు జతగా అయ్యర్, శాంసన్ లాంటి వాళ్లు చెలరేగి ఆడితే ఏదైనా సాధ్యమే. టీమిండియా స్టార్లు ఏం చేస్తారో చూడాలి. మరి.. పడిక్కల్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments