Nidhan
Devdutt Padikkal Fighting Knock In Duleep Trophy 2024: యంగ్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ క్లాసికల్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లకు అడ్డుగోడలా నిలబడిపోయాడు.
Devdutt Padikkal Fighting Knock In Duleep Trophy 2024: యంగ్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ క్లాసికల్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. టీమ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కడే ప్రత్యర్థి బౌలర్లకు అడ్డుగోడలా నిలబడిపోయాడు.
Nidhan
క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదు. ప్రత్యర్థి బౌలర్లు చెలరేగుతున్న సమయంలో వికెట్లను కాచుకొని సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలంటే టాలెంట్‌తో పాటు ఓపిక, టెక్నిక్, ఒత్తిడిని తట్టుకొని నిలబడే ధైర్యం, నేర్పు కావాలి. అలా ఉన్న బ్యాటర్లనే ప్రతి టీమ్ కోరుకుంటుంది. తాజాగా ఓ యంగ్ బ్యాటర్ ఇలా ఓ క్లాసికల్ ఇన్నింగ్స్ ఆడి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే దేవ్‌దత్ పడిక్కల్. దులీప్ ట్రోఫీ సెకండ్ రౌండ్లో అతడు అదరగొట్టాడు. ఇండియా-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో ఇండియ-డీ ఆరంభంలోనే తడబడింది. మొదటి ఓవర్ నుంచే వికెట్ల పతనం మొదలైంది. ఒకదశలో 52 పరుగులకే 4 వికెట్లు పడ్డాయి. ఆ టీమ్ స్కోరు వంద దాటడం కష్టమేనని అనిపించింది. కానీ ఈ టైమ్‌లో క్రీజులో పాతుకుపోయాడు పడిక్కల్. ఒక ఎండ్‌లో వికెట్లను కాపాడుతూనే ఒక్కో పరుగును స్కోరు బోర్డు మీదకు చేరుస్తూ పోయాడు.
పడిక్కల్ పట్టుదలతో ఆడాడు. వంద లోపు చాప చుట్టేస్తుందనుకున్న ఇండియా-డీ పరువు కాపాడాడు. 124 బంతులు ఎదుర్కొన్న ఈ యువ బ్యాటర్ 15 బౌండరీల సాయంతో 92 పరుగులు చేశాడు. అతడి పోరాటం వల్లే టీమ్ 183 పరుగులు చేయగలిగింది. పడిక్కల్ తప్పితే ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకోలేదు. రికీ భుయ్ (23) మంచి స్టార్ట్ దొరికినా భారీ ఇన్నింగ్స్‌గా మలచలేకపోయాడు. ఆఖర్లో హర్షిత్ రానా (31) 4 బౌండరీలు, 2 సిక్సులు బాది ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) గోల్డెన్ డకౌట్ అవడం టీమ్‌ను దారుణంగా దెబ్బ తీసింది. స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ (5) ఫెయిల్యూర్ కూడా భారీ స్కోరు ఆశలకు గండికొట్టింది. పడిక్కల్ ఫైటింగ్ ఇన్నింగ్స్ లేకపోతే ఇండియా-డీ పరిస్థితి దారుణంగా ఉండేది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఇండియా-డీ 183 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా-ఏ ఇప్పుడు వికెట్లేమీ కోల్పోకుండా 104 పరుగులతో ఉంది. ప్రతాప్ సింగ్ (57 నాటౌట్), మయాంక్ అగర్వాల్ (47 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ఇండియా-ఏ ఆధిక్యం 211 పరుగులకు చేరుకుంది. ప్రతాప్-మయాంక్ వేగంగా ఆడుతున్నారు. ఎడాపెడా బౌండరీలు బాదుతున్నారు. లీడ్ డబుల్ అయ్యే వరకు ఇండియా-ఏ బ్యాటింగ్ చేసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లోనే కుప్పకూలిన ఇండియా-డీ భారీ స్కోరును ఛేజ్ చేయడం కష్టంగానే ఉంది. అయితే పడిక్కల్‌కు జతగా అయ్యర్, శాంసన్ లాంటి వాళ్లు చెలరేగి ఆడితే ఏదైనా సాధ్యమే. టీమిండియా స్టార్లు ఏం చేస్తారో చూడాలి. మరి.. పడిక్కల్ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Well played, Devdutt Padikkal…!!!
– 92 (124) with 15 fours, India D are struggling at 154/8 and Padikkal himself scored 92 out of that. The next best scorer of the team is with 23, a lone warrior show by Devdutt. 🫡🔥 pic.twitter.com/g0vOyFgqgz
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 13, 2024