Nidhan
Deepti Sharma Shines In Women's Hundred 2024: ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఓ భారత క్రికెటర్ అదరగొట్టింది. క్రంచ్ సిచ్యువేషన్లో బరిలోకి దిగి తన బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒక్క షాట్‌తో కప్‌ను ఎగరేసుకుపోయింది.
Deepti Sharma Shines In Women's Hundred 2024: ‘ది హండ్రెడ్’ లీగ్‌లో ఓ భారత క్రికెటర్ అదరగొట్టింది. క్రంచ్ సిచ్యువేషన్లో బరిలోకి దిగి తన బ్యాటింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒక్క షాట్‌తో కప్‌ను ఎగరేసుకుపోయింది.
Nidhan
భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ తన సత్తా ఏంటో మరోమారు చూపించింది. టీమిండియా తరఫున ఎన్నోమార్లు అదరగొట్టిన ఆమె.. మహిళల హండ్రెడ్ లీగ్-2024లో సంచలనం సృష్టించింది. లండన్ స్పిరిట్ టీమ్ తరఫున బరిలోకి దిగిన ఆమె.. కీలకమైన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి బ్యాటింగ్ చేసింది. క్రంచ్ సిచ్యువేషన్లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి.. మెరుపు ఇన్నింగ్స్‌తో తన టీమ్‌ను ఛాంపియన్‌గా నిలబెట్టింది. ఒక దశలో లండన్ స్పిరిట్ గెలుస్తుందా? లేదా? అనే అనుమానం ఏర్పడింది. కానీ ఒక్క షాట్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది దీప్తి. ఆమె చేసింది 16 పరుగులే అయినా లండన్ టీమ్ విక్టరీకి అవి ఎంతగానో దోహదపడ్డాయి.
హండ్రెడ్ లీగ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి థండర్ ఇన్నింగ్స్‌లు ఆడుతూ వచ్చిన దీప్తి శర్మ.. ఫైనల్లోనూ దాన్ని రిపీట్ చేసింది. మొత్తంగా ఈ సీజన్లో ఆరు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 212 పరుగులు చేసింది. హయ్యెస్ట్ స్కోర్ 46 నాటౌట్ కాగా.. 18 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదింది. బాల్‌తోనూ సత్తా చాటిన ఈ ఆల్‌రౌండర్ 6.85 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. వెల్ష్‌ఫైర్‌తో నిన్న జరిగిన ఫైనల్లో లండన్ స్పిరిట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన వెల్ష్‌ఫైర్ 115 పరుగులు చేసింది. ఈ టార్గెట్‌ను మరో 2 బంతులు ఉండగా అందుకుంది లండన్ స్పిరిట్. ఆఖర్లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి శర్మ 16 బంతుల్లో 16 పరుగులు చేసింది.
చివర్లో సిక్స్ కొట్టి మ్యాచ్‌ను గ్రాండ్ స్టైల్లో ముగించింది దీప్తి శర్మ. చేతిలో వికెట్లు ఉన్నా రాంగ్ షాట్ కొడితే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కొత్త బ్యాటర్ ఒక్క రన్ తీయాలన్నా చాలా ప్రెజర్‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న దీప్తి.. గుడ్ లెంగ్త్‌లో పడిన బంతిని క్రీజు వదిలి ముందుకొచ్చి లాంగాన్ దిశగా భారీ సిక్స్‌గా మలిచింది. దీంతో అప్పటివరకు ఉద్విగ్నతతో నిలబడి మ్యాచ్‌ను చూస్తున్న లండన్ స్పిరిట్ ప్లేయర్లు సంతోషంలో మునిగిపోయారు. పరుగు పరుగున దీప్తి దగ్గరకు వచ్చి ఆమెను హత్తుకున్నారు. సాధించామంటూ సంబురాలు చేసుకున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ సంయమనం కోల్పోకుండా లెజెండ్ ధోని మాదిరిగా సిక్స్‌తో మ్యాచ్‌ను ఫినిష్ చేయడం, టీమ్‌కు టైటిల్ అందించడంతో దీప్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. మరి.. హండ్రెడ్ లీగ్ ఫైనల్లో ఈ స్టార్ క్రికెటర్ ఆట మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.
London Spirit needed 4 in 3 balls to win The Hundred Final:
Deepti Sharma finished the match with a six….!!! 🫡🔥 pic.twitter.com/M4Jt3bQcyB
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 18, 2024