iDreamPost
android-app
ios-app

‘ది హండ్రెడ్’ లీగ్​లో దీప్తి శర్మ సంచలనం.. ఒక్క షాట్​తో ట్రోఫీ కొట్టేసింది!

  • Published Aug 19, 2024 | 6:41 PM Updated Updated Aug 19, 2024 | 6:41 PM

Deepti Sharma Shines In Women's Hundred 2024: ‘ది హండ్రెడ్’ లీగ్​లో ఓ భారత క్రికెటర్ అదరగొట్టింది. క్రంచ్ సిచ్యువేషన్​లో బరిలోకి దిగి తన బ్యాటింగ్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒక్క షాట్​తో కప్​ను ఎగరేసుకుపోయింది.

Deepti Sharma Shines In Women's Hundred 2024: ‘ది హండ్రెడ్’ లీగ్​లో ఓ భారత క్రికెటర్ అదరగొట్టింది. క్రంచ్ సిచ్యువేషన్​లో బరిలోకి దిగి తన బ్యాటింగ్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది. ఒక్క షాట్​తో కప్​ను ఎగరేసుకుపోయింది.

  • Published Aug 19, 2024 | 6:41 PMUpdated Aug 19, 2024 | 6:41 PM
‘ది హండ్రెడ్’ లీగ్​లో దీప్తి శర్మ సంచలనం.. ఒక్క షాట్​తో ట్రోఫీ కొట్టేసింది!

భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ తన సత్తా ఏంటో మరోమారు చూపించింది. టీమిండియా తరఫున ఎన్నోమార్లు అదరగొట్టిన ఆమె.. మహిళల హండ్రెడ్ లీగ్-2024లో సంచలనం సృష్టించింది. లండన్ స్పిరిట్ టీమ్​ తరఫున బరిలోకి దిగిన ఆమె.. కీలకమైన ఫైనల్ మ్యాచ్​లో చెలరేగి బ్యాటింగ్ చేసింది. క్రంచ్ సిచ్యువేషన్​లో బ్యాటింగ్​కు దిగిన దీప్తి.. మెరుపు ఇన్నింగ్స్​తో తన టీమ్​ను ఛాంపియన్​గా నిలబెట్టింది. ఒక దశలో లండన్ స్పిరిట్ గెలుస్తుందా? లేదా? అనే అనుమానం ఏర్పడింది. కానీ ఒక్క షాట్​తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేసింది దీప్తి. ఆమె చేసింది 16 పరుగులే అయినా లండన్ టీమ్ విక్టరీకి అవి ఎంతగానో దోహదపడ్డాయి.

హండ్రెడ్ లీగ్ ఫస్ట్ మ్యాచ్​ నుంచి థండర్ ఇన్నింగ్స్​లు ఆడుతూ వచ్చిన దీప్తి శర్మ.. ఫైనల్​లోనూ దాన్ని రిపీట్ చేసింది. మొత్తంగా ఈ సీజన్​లో ఆరు ఇన్నింగ్స్​ల్లో కలిపి 212 పరుగులు చేసింది. హయ్యెస్ట్ స్కోర్ 46 నాటౌట్ కాగా.. 18 ఫోర్లు, ఆరు సిక్సర్లు బాదింది. బాల్​తోనూ సత్తా చాటిన ఈ ఆల్​రౌండర్ 6.85 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టింది. వెల్ష్​ఫైర్​తో నిన్న జరిగిన ఫైనల్​లో లండన్ స్పిరిట్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్​కు దిగిన వెల్ష్​ఫైర్ 115 పరుగులు చేసింది. ఈ టార్గెట్​ను మరో 2 బంతులు ఉండగా అందుకుంది లండన్ స్పిరిట్. ఆఖర్లో బ్యాటింగ్​కు దిగిన దీప్తి శర్మ 16 బంతుల్లో 16 పరుగులు చేసింది.

చివర్లో సిక్స్ కొట్టి మ్యాచ్​ను గ్రాండ్ స్టైల్​లో ముగించింది దీప్తి శర్మ. చేతిలో వికెట్లు ఉన్నా రాంగ్ షాట్ కొడితే ఔట్ అయ్యే ప్రమాదం ఉంది. కొత్త బ్యాటర్​ ఒక్క రన్ తీయాలన్నా చాలా ప్రెజర్​ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకున్న దీప్తి.. గుడ్​ లెంగ్త్​లో పడిన బంతిని క్రీజు వదిలి ముందుకొచ్చి లాంగాన్ దిశగా భారీ సిక్స్​గా మలిచింది. దీంతో అప్పటివరకు ఉద్విగ్నతతో నిలబడి మ్యాచ్​ను చూస్తున్న లండన్ స్పిరిట్ ప్లేయర్లు సంతోషంలో మునిగిపోయారు. పరుగు పరుగున దీప్తి దగ్గరకు వచ్చి ఆమెను హత్తుకున్నారు. సాధించామంటూ సంబురాలు చేసుకున్నారు. తీవ్ర ఒత్తిడిలోనూ సంయమనం కోల్పోకుండా లెజెండ్ ధోని మాదిరిగా సిక్స్​తో మ్యాచ్​ను ఫినిష్ చేయడం, టీమ్​కు టైటిల్ అందించడంతో దీప్తిని అందరూ మెచ్చుకుంటున్నారు. ​మరి.. హండ్రెడ్ లీగ్ ఫైనల్​లో ఈ స్టార్ క్రికెటర్ ఆట మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.