SNP
Deccan Chargers, Gayatri Reddy: ఐపీఎల్ స్టార్టింగ్‌లో డెక్కన్ ఛార్జర్స్ అని మన హోం టీమ్ ఒకటి ఉండేది. ఆ టీమ్‌కు ఇప్పటి ఎస్ఆర్‌హెచ్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవాళ్లు. అందుకు కారణం ఓ అమ్మాయి. ఆమె గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Deccan Chargers, Gayatri Reddy: ఐపీఎల్ స్టార్టింగ్‌లో డెక్కన్ ఛార్జర్స్ అని మన హోం టీమ్ ఒకటి ఉండేది. ఆ టీమ్‌కు ఇప్పటి ఎస్ఆర్‌హెచ్ కంటే ఎక్కువ ఫ్యాన్స్ ఉండేవాళ్లు. అందుకు కారణం ఓ అమ్మాయి. ఆమె గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్‌లో మన హోం టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ అనగానే చాలా మందికి కావ్య మారన్.. అదే అంతా ముద్దుగా పిలుచుకునే కావ్య పాప గుర్తుకు వస్తుంది. సన్‌రైజర్స్ ఆడే ప్రతి మ్యాచ్‌కు వచ్చి, టీమ్‌ను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎస్‌ఆర్‌హెచ్ పరిస్థితిని బట్టీ ఆమె ఇచ్చే ఎక్స్‌ప్రెషన్స్ వైరల్ అవుతూ ఉంటాయి. టీమ్ బాగా ఆడితే ఎగిరి గంతులేసే కావ్య, టీమ్ ఓడిపోతుంటే మాత్రం.. పేస్ చాలా డల్‌గా పెడుతుంది. ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌ల కంటే కావ్య పాప ఎక్స్‌ప్రెషన్స్, రియాక్షన్స్ చాలా వైరల్ అయ్యేవి. కనీసం ఆమె కోసమైనా మ్యాచ్ గెలవాలని ఎస్‌ఆర్‌హెచ్ క్రికెటర్లుకు ఫ్యాన్స్ రిక్వస్ట్ చేసేవారు. అది కావ్య పాప రేంజ్. కానీ, చాలా మందికి తెలియంది ఏంటంటే.. కావ్యను మంచి ఓ అమ్మాయికి తెలుగు క్రికెట్స్‌లో క్రేజ్ ఉండేది. ఆమె పేరు గాయత్రి రెడ్డి. ఇలా చెబితే చాలా మందికి తొందరగా అర్థం కాదేమో కానీ, డెక్కన్ ఛార్జర్స్ ఓనర్ కూతురంటే మాత్రం టక్కున గుర్తుపడతారు.
ఐపీఎల్ ఆరంభం సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ పేరుతో మనకు ఓ టీమ్ ఉండేది. ఐపీఎల్ 2009 సీజన్‌లో ఛాంపియన్‌గా కూడా నిలిచింది డీసీ. ఆ టీమ్‌లో ఆడమ్ గిల్‌క్రిస్ట్, ఆండ్రూ సైమండ్స్, రోహత్ శర్మ ఇలా స్టార్లతో నిండిపోయి ఉండేది. ఆ టీమ్ జెర్సీ కానీ, లోగో కానీ.. అందులోని ఆటగాళ్లు అంతా అద్భుతం. వీటన్నింటికి మించి ఆ జట్టు ఓనర్ టీ వెంకట్రామ్ రెడ్డి కూతురు.. గాయత్రి రెడ్డి గ్లామర్ ఆ జట్టుకు అదనపు బలం. ఇప్పుడు కావ్య పాప ఎలాగైతే ఎస్‌ఆర్‌హెచ్ ఆడే ప్రతి మ్యాచ్‌కు ఎంకరేజ్ చేస్తుందో.. అప్పట్లో గాయత్రి రెడ్డి కూడా అంతకు మించి ఎంకరేజ్ చేసేది. పైగా ఐపీఎల్ స్టార్టింగ్‌లో టీమ్ ఏర్పాటు, జెర్సీ డిజైన్, లోగో డిజైన్, ఆటగాళ్ల కొనుగోలు.. ఇలా ప్రతి విషయంలో ఎంతో కష్టపడి డెక్కన్ ఛార్జర్స్ 2009లో ఛాంపియన్‌గా నిలిపేందుకు ఎంతో కృషి చేసింది.
గాయత్రి రెడ్డి 1986 సెప్టెంబర్ 21న జన్మించింది. ప్రస్తుతం డెక్కన్ క్రానికల్ ఓనర్‌గా ఉంది. లండన్‌లో చదువుకున్న గాయత్రి రెడ్డి.. కన్సస్ట్రక్షన్ మెనేజ్‌మెంట్‌లో బీఎస్సీ పూర్తి చేసింది. ఆ తర్వాత 2008లో డెక్కన్ ఛార్జర్స్ టీమ్‌ను బిల్డ్ చేయడంలో తన తండ్రి వెంకట్రామ్ రెడ్డికి చేదోడువాదోడుగా ఉంది. 2008 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్ విఫలం కావడంతో.. వెంటనే నెక్ట్స్ ఇయర్‌కి మొత్తం మార్చేసింది. జెర్సీ కలర్ నుంచి, లోగో వరకు మొత్తం మార్చిపడేసింది. అలాగే టీమ్ కెప్టెన్సీ కూడా వీవీఎస్ లక్ష్మణ్ నుంచి గిల్‌క్రిస్ట్‌కి వచ్చింది. దక్కన్ ఛార్జర్స్‌లో పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రదీ కూడా ఆడాడు. ఇలా అప్పటి డెక్కన్ ఛార్జర్స్ టీమ్ అంటే చాలామంది తెలుగు క్రికెట్ అభిమానులకు ఒక ఎమోషన్. అలాగే గాయత్రి రెడ్డి అన్నా.. ఎమోషనల్ ఫీలింగే. మరి కావ్య పాప, గాయత్రి రెడ్డి.. ఎవరు బిగ్గెస్ట్ టీమ్ సపోర్టరో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Goodnight Gayatri reddy fans and Deccan Chargers fans. pic.twitter.com/vBuoEOwxyf
— A. (@Anchalla3) February 18, 2021
Hyderabad team owners in IPL.
Deccan Chargers – Gayatri Reddy
Sunrisers Hyderabad – KavyaBeauties 😍❤️ pic.twitter.com/XccD9QFZMn
— Classic Mojito (@classic_mojito) February 13, 2022